గూగుల్‌లో ఈ పదాలు టైప్ చేస్తే నవ్వులే నవ్వులు
మీ డెస్క్ టాప్ మీద గూగుల్ గిరగిరా తిరగాలని ఉందా...అదేంటి గూగుల్ ఎలా తిరుగుతుంది అని ఆశ్చర్యపోతున్నారా..కొన్ని పదాలు టైప్ చేస్తే మీ డెస్క్ టాప్ మీద గూగుల్ గిరగరా తిరుగుతంది. అంతే కాదు గూగుల్ లో మీరు టైప్ చేసే పదాలతో ఆ గూగుల్ చిత్ర విచిత్ర విన్యాసాలు మీకు చూపిస్తుంది..మీరు టైపు చేసిన పదం గూగుల్ లో సరికొత్త అర్థాన్ని మీకు చూపిస్తుంది. కావాలంటే మేము కొన్ని పదాలను ఇస్తున్నాం వాటిని ఓ సారి టైపు చేసి చూడండి.
Read more:కీబోర్డ్ మీద ఫాస్ట్‌గా టైప్ చేయడం ఎలా..?

ప్లిప్ ఏ కాయిన్ ( Flip A Coin)
ఈ పదం టైపు చేస్తే మీకు ఇలా దర్శనమిస్తుంది. ఫ్లిప్ ఇట్ అని దీన్ని చూపిస్తుంది కావాలంటే మీరూ ట్రై చేసి చూడండి.

రోల్ ఏ డైస్ ( Roll A Dice)
దీన్ని మీరు టైపు చేసి చూస్తే నాలుగు నంబర్ వచ్చి మీకు ఇలా కనిపిస్తుంది.

ఆస్క్యూ ( Askew)
ఈ పదాన్ని మీరు గూగుల్ లో సెర్చ్ చేస్తే చిత్ర విచిత్రమైన సైట్లు వస్తాయి.

జెర్గ్ రష్ ( Zerg Rush )
ఈ పదం మీరు గూగుల్ లో వెతికారంటే అది ఏం చూపిస్తుందో తెలియక తలలు పట్టుకుంగారు మీరు. అన్నీ సున్నాలు వచ్చి కంటెంట్ చెరిపేస్తూ పోతుంటాయి.

అటారీ బ్రేక్ అవుట్ ( Atari Breakout)
ఈ పదాన్ని మీరు గూగుల్ లో టైపు చేశారనుకోండి. మీకు ఓ క్లాసిక్ ఆట కనిపిస్తుంది.

గూగుల్ పేస్ మ్యాన్ ( Google Pacman )
ఈ పదం టైపు చేస్తే మీకు ఏవో లైట్లు వచ్చి క్లిక్ టూ ప్లే అంటూ వస్తుంది. మరి దీని అర్థం ఏంటో దాని అర్థం ఏంటో తెలియక తలలు గోక్కోవాల్సిందే.

గూగుల్ గ్రేవిటీ ( Google Gravity )
ఈ పదం టైపు చేస్తే మీ డెస్క్ టాప్ మీద గూగుల్ పై నుంచి కిందకు వచ్చి అనేక రకాల ఆప్సన్స్ కనిపిస్తాయి. ప్రయత్నించి చూడండి.

Do A Barrel Roll
ఇది టైపు చూస్తే మీ డెస్క్ టాప్ గిర్రున తిరుగుతుంది మరి.

గూగుల్ ఆర్బిట్ ( Google Orbit)
దీన్ని టైపు చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. అదేంటో కూడా అర్థం కాదు.

Offline Dinosaur Game
ఇంటర్నెట్ బంద్ అయినప్పుడు మీకు ఓ కోడిపెట్ట టింగు టింగును ఎగురుతుంటుంది. ఇంటర్నెట్ వచ్చే దాకా అది కాలక్షేపానికి మీరు ఆడుకునే గేమ్ అన్నమాట.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి
టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/


Click it and Unblock the Notifications








