ఈ దేశాల్లో ఫేస్‌బుక్ అడ్రస్ గల్లంతు !

Written By:

మనం పొద్దున లేచింది మొదలు సాయంత్రం నిద్రపోయో దాకా ఫేస్‌బుక్.. ఫేస్‌బుక్ అని కలవరిస్తుంటాం...స్మార్ట్‌ఫోన్‌లో ఏది ఉన్నా లేకపోయినా ఫేస్‌బుక్ మాత్రం ఉండాల్సిందే ..లైకుల కోసం కుస్తీలు పడటం అలాగే కామెంట్ల కోసం కక్కుర్తి షరా మాములే. అయితే ఫేస్‌బుక్ వాడని దేశాలు కొన్ని ఉన్నాయి తెలుసా..ఆ దేశాల్లోని అధ్యక్షులు ఉద్యమకారుల దెబ్బకి తట్టుకోలేక ఫేస్‌బుక్‌ని బంద్ చేశారు. దీంతో పాటు కొన్ని సోషల్ మీడియా సైట్లను బంద్ చేశారు.

Read more: ఈ ఫోన్‌ని ల్యాప్‌టాప్‌గా,డెస్క్‌టాప్‌గా వాడుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నార్త్ కొరియా

ప్రపంచం మొత్తం 5జీ నెట్ వర్క్ వెంట పడుతుంటే ఇక్కడ 3జీ నెట్ వాడుతుంటారు. అదీ ఫారిన్ నుంచి వచ్చే టూరిస్ట్‌లకు లిమిట్ లో అందుబాటులో ఉంటుంది. ఈ దేశానికి ప్రపంచం గురించి తెలియదు. ఈ దేశ ప్రజలు ఇంటర్నెట్ పెద్దగా వాడరు. అసలు ఇక్కడ ఇంటర్నెట్ కూడా కేవలం చాలా తక్కువ చోట్ల ఉంటుంది.ఇక ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ ఫేస్‌బుక్ పేజీని అసలు చూడలేము.

ఇరాన్

ఇరాన్ లో ఈ సైట్ ను బంద్ చేయాలని రాజకీయ నాయకులంతా పార్లమెంట్ లో తీర్మానించుకున్నారు. వీటివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అందుకే బంద్ చేయాలని 2009లో పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాను అక్కడ బయటకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు హసన్ రోహాని ట్విట్టర్ లో ఉన్నా కాని లేనట్లే ఉంటారు.

చైనా

మన పొరుగుదేశం చైనా గురించి ఇక చెప్పనే అవసరం లేదు. ఆ దేశం అన్నీ సోషల్ మీడియాను బంద్ చేసి సొంతంగా సోషల్ మీడియాను రూపొందించుకునే పనిలో బిజీగా ఉంది.

క్యూబా

ఇక్కడ జనాభాకు వచ్చే దానిలో బతికేదే చాలా కష్టం. అందుకని వీరు ఎటువంటి సోషల్ మీడియా జోలికి వెళ్లరు. ఇక్కడ నెట్ వాడకానికి చట్టపరంగా అనేక సమస్యలు ఉండటంతో వాటి జోలికి వెళ్లే సాహసం చేయరు. అక్కడ గంటకు దాదాపు 6 నుంచి 10 డాలర్లు నెట్ బిల్లు ఉంటుంది. వారికి నెలకి వచ్చేది 20 డాలర్లు.అందుకోసం వారు వాటిజోలికి వెళ్లరు.

బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ 2010లో ఫేస్‌బుక్‌ని బంద్ చేసింది. తమ దేశాధ్యక్షుడికి చెందిన కార్టూన్ ఫేస్‌బుక్‌లో సైటైరికల్ గా వాడటంతో వారంతా ఈ సైట్ ను బంద్ చేయాలని తీర్మానించారు. అయితే బంద్ అయిన వారం రోజులకు ఫేస్‌బుక్ ఆ ఇమేజ్‌ని తొలగించింది. అయినా నిషేధం అలానే కొనసాగుతోంది.

ఈజిప్ట్

2011లో ఈజిప్ట్ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కొన్ని సోషల్ మీడియా సైట్లను బంద్ చేయాలని నిర్ణయించింది. వాటిల్లో ఈ ఫేస్‌బుక్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఉద్యమం జరుగుతన్న సమయంలో ఉద్యమకారులు ఎక్కువగా ఫేస్‌బుక్ వినియోగిస్తుండటంతో ముబారక్ సోషల్ మీడియాను బంద్ చేయాలని తీర్మానించారు.

సిరియా

సిరియాలో 2007 నుంచి ఫేస్‌బుక్ బ్లాక్ అయింది. రాజకీయంగా బసద్ ఆలీకి వ్యతిరేకంగా ఉద్యమకారులు చెలరేగిపోవడం..ఆయన్ని గద్దె దింపాలని కొత్త ఉద్యమం లేవదీయడంతో చిర్రెత్తుకొచ్చిన బసద్ అన్ని సోషల్ మీడియా సైట్లకు రాంరాం చెప్పారు. అయినప్పటికీ సిరియన్లు కొన్ని ప్రొక్సీ సర్వర్ల ద్వారా కొన్ని సోషల్ మీడియా సైట్లను వాడుతున్నారు.

మౌరిటీస్

ఫేస్‌బుక్ సెలబ్రిటీలకు సంబంధించి అనేక ఫేక్ అకౌంట్లు ఉంటాయి. ఈ కోవలోనే ఈ దేశాధ్యక్షుని పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి అనేక సమస్యలకు కారణమ్యారు. దీంతో ఆ దేశంలో ఫేస్‌బుక్ కి రారాం చెప్పారు. అయితే అది కొద్ది రోజుల మాత్రమే కొనసాగింది. ఇప్పుడు మళ్లీ అక్కడ సోషల్ మీడియాని ప్రవేశపెట్టారు.

పాకిస్తాన్

ఆన్లైన్‌లో పాకిస్తాన్‌పై కార్టూన్లతో విమర్శలు గుప్పించడం అలాగే ప్రభుత్వం 2010లో సోషల్ మీడియాను బంద్ చేసింది. ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేస్తూ సోషల్ మీడియాను గాలికొదిలేసింది. ఇప్పటికీ అక్కడ కొన్ని సైట్లపై నిషేధం కొనసాగుతోంది.

వియాత్నం

ఈ దేశంలో 2009 నుంచి సోషల్ మీడియా సైట్లకు రాంరాం చెప్పారు. ఆ తరువాత పరిమితులతో కూడిన సోషల్ మీడియా సైట్లను ప్రవేశపెట్టారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 countries where Facebook has been banned
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot