రూ.30లో బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే..

ఒకానొక సమయంలో మొబైల్ డేటాను చాలా పొదుపుగా ఆచితూచి వాడుకోవల్సి వచ్చేది. జియో రాకతో ఒక్కసారిగా పరిస్థితులన్ని మారిపోయాయి. జియో ఉచిత డేటా ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తటంతో పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్ వంటి సంస్థలు రూ.5కే డేటాను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. రూ.30 రేంజ్‌లో మార్కెట్లో సిద్థంగా ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Read More : మీ వాట్సాప్ ఛాటింగ్ హిస్టరీ మొత్తాన్ని సింగిల్ క్లిక్‌తో పొందాలంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎయిర్‌టెల్ రూ.5 ప్లాన్

ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే వర్తించే ఈ ప్లాన్‌లో భాగంగా 4జీబి 4జీ డేటా అందుబాటలో ఉంటుంది. ఈ డేటా మొత్తాన్ని 7 రోజుల్లోపు వినియోగించకోవల్సి ఉంటుంది.

వొడాఫోన్ రూ.19 ప్లాన్

ఒక రోజు వ్యాలిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా 100MB 4జీ డేటాతో పాటు వొడాఫోను టు వొడాఫోన్ నెట్‌వర్క్ మధ్య అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలుంటుంది.

వొడాఫోన్ రూ.29 ప్లాన్

ఈ ప్లాన్‌లో భాగంగా రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటల వరకు అపరిమితంగా డేటాను వినియోగించుకోవచ్చు.

రిలయన్స్ జియో రూ.19 ప్లాన్

ఒక రోజు వ్యాలిడీటితో వస్తోన్న ఈ ప్లాన్‌లో భాగంగా 200MB 4జీ డేటాతో అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

రిలయన్స్ జియో రూ.23 ప్లాన్

రెండు రోజులు వ్యాలిడిటితో వస్తోన్న ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ డేటాతో పాటు వాయిస్ కాల్స్ అలానే ఎస్ఎంఎస్‌లు అందుబాటలో ఉంటాయి.

ఐడియా సెల్యులార్ రూ.15 ప్లాన్

30 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ వాయిస్ కట్టర్ ప్లాన్‌లో భాగంగా లోకల్ అలానే ఎస్‌టీడీ కాల్స్ పై సెకనుకు 1.5 పైసా ఛార్జ్ చేయటం జరుగుతుంది. ఈ ప్లాన్ పై 100MB డేటా కూడా లభిస్తుంది.

ఐడియా సెల్యులార్ రూ.22 ప్లాన్

60 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ వాయిస్ కట్టర్ ప్లాన్‌లో భాగంగా లోకల్ అలానే ఎస్‌టీడీ కాల్స్ పై సెకనుకు 1.5 పైసా ఛార్జ్ చేయటం జరుగుతుంది. ఈ ప్లాన్ పై 50MB డేటా కూడా లభిస్తుంది.

ఐడియా సెల్యులార్ రూ.17 ప్లాన్

90 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ వాయిస్ కట్టర్ ప్లాన్‌లో భాగంగా లోకల్ అలానే ఎస్‌టీడీ కాల్స్ పై సెకనుకు 1.2 పైసా ఛార్జ్ చేయటం జరుగుతుంది. ఈ ప్లాన్ పై 200MB డేటా కూడా లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 data plans under Rs 30 from Airtel, Reliance Jio, Vodafone and Idea. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot