వేల కోట్లలో ఆస్తులు.. పొదుపైన బతుకులు

Posted By:

పుట్టుకతోనే కోటేశ్వరులనుకుంటే అదీ కాదు. గొప్ప విద్యావంతులు కూడా కాదు. అలా అని ఏలాంటి లాటరీలు వీళ్లను వరించలేదు. మరి ఏలా కబేరులయ్యారు......?, ఓ ఐడియా జీవితాన్ని మార్చేసినట్లు. ఆసక్తితో కూడిన ఓ వినూత్న ఆలోచన వాళ్లను అపరకుబేరులను చేసి టెక్ మిలియనీర్లగా నిలబెట్టింది. ఆన్‌లైన్ ప్రపంచంలో తొలి ప్రయత్నంగా వారు వేసిన కమ్యూనికేషన్ విత్తు ఇప్పుడు వటవృక్షంగా మారి ఎంతో మంది జీవితాలను మార్చేసింది. తమ కష్టానికి ప్రతిఫలంగా టెక్నాలజీ ప్రపంచంలో వేల కోట్లు గడించినప్పటికి సాదాసీదా జీవనాన్ని మాత్రమే మక్కువ చూపుతున్న పలువురు టెక్ ఎగ్జిక్యూటివ్‌ల వివరాలను క్రింది స్లైడ్‌‌షోలో చూడొచ్చు..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వేల కోట్లలో ఆస్తులు.. పొదుపైన బతుకులు

డేవిడ్ చెరిటన్, స్టాన్ఫోర్డ్ ప్రొఫెసర్ ఇంకా అరిస్టా నెట్‌వర్క్ సహ వ్యవస్థాపకులు

ఈయన నికర ఆస్తుల విలువ 2.8 బిలియన్ డాలర్లు.

ఈ 63 సంవత్సరాల బిలియనీర్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఇప్పటికి కంప్యూటర్ సైన్స్ పాఠాలు చెబుతున్నారు. తన మేదో సంపత్తితో వేల కోట్లు అర్జించిన ఈ ప్రొఫెసర్ లారీపేజ్, సెర్జీబ్రిన్‌లను తన వద్దకు పిలుపించుకుని తమ గూగుల్ ప్రాజెక్టును  వివరించివల్సింగా కోరారు. ప్రాజెక్ట్ నచ్చటంతో డేవిడ్ చెరిటన్ గూగుల్ కంపెనీలో 100,000 డాలర్లను  పెట్టుబడిగా పెట్టారు.అన్ని కోట్లు ఆస్తి ఉన్నప్పటికి సాదాసీదా జీవితాన్నిమాత్రమే డేవిడ్ చెరిటన్ ఇష్టపడతారు. 1986 మోడల్ వోక్స్‌వేగన్‌ కారునే ఆయన ఉపయోగిస్తున్నారు. 30 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో నివశిస్తున్నారు. 

 

వేల కోట్లలో ఆస్తులు.. పొదుపైన బతుకులు

చార్లీ ఇర్జెన్ (చైర్మన్, డిష్ నెట్‌వర్క్)

ఈయన నికర ఆస్తుల విలువ 16.3బిలియన్

ఖర్చు విషయంలో చార్లీ చాలా పొదుపుగా ఉంటారు. తన లంచ్ బాక్సును తానే తయారు చేసుకుటారు. ప్రయాణ సమయాల్లో సహచరులతో కలిసి హోటల్ గదులను షేర్ చేసుకుంటారు.

 

వేల కోట్లలో ఆస్తులు.. పొదుపైన బతుకులు

పియరీ ఓమిడ్యార్ (ఈబే వ్యవస్థపాకులు ఇంకా చైర్మన్)

ఈయన నికర ఆస్తుల విలువ 8.1 బిలియన్ డాలర్లు

ఈ బిలియనీర్ ఖర్చు విషయంలో ఆచితూచి స్పందిస్తారు.

 

వేల కోట్లలో ఆస్తులు.. పొదుపైన బతుకులు

విడ్ కార్ప్ (వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ, టంబ్లర్)

ఈయన నికర ఆస్తుల విలువ 200 మిలియన్ డాలర్లు

సాదాసీదా జీవనశైలిని మాత్రమే కార్ప్ ఇష్టపడతారు.

వేల కోట్లలో ఆస్తులు.. పొదుపైన బతుకులు

అజీమ్ ప్రేమ్‌జీ (చైర్మన్, విప్రో లిమిటెడ్)

ఈయన నికర ఆస్తుల విలువ 15.4 బిలియన్ డాలర్లు

భారతదేశంలోని అత్యంత ధనికుల్లో ఒకరైన అజీమ్ ప్రేమ్‌జీ డబ్బును అవసరం మేరకే ఖర్చుపెడతారు. ఈయన్ ఎయిర్‌‌పోర్ట్ నుంచి విప్రో ఆఫీసులకు మూడు చక్రాల ఆటో రిక్షాలలో ప్రయాణిస్తారు. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని ఉద్యోగులకు గుర్తుచేస్తుంటారు.

 

వేల కోట్లలో ఆస్తులు.. పొదుపైన బతుకులు

మార్క్ జూకర్‌బెర్గ్ (వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ ఫేస్ బుక్)

ఈయన నికర ఆస్తుల విలువ 32.4 బిలియన్ డాలర్లు

డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేయటం మార్క్‌కు ఏ మాత్రం ఇష్టముండదు. సాధ్యమైనంత వరకు సాదాసీదా జీవనాన్నే మార్క్ ఇష్టపడతారు.

 

వేల కోట్లలో ఆస్తులు.. పొదుపైన బతుకులు

జాన్ కౌమ్ (వ్యవస్థాపకులు వాట్స్‌యాప్)

ఈయన నికర ఆస్తుల విలువ 6.8 బిలియన్ డాలర్లు

చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలను చెవిచూసిన జాన్ కౌమ్ డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేయటాన్ని ఏ మాత్రం ఇష్టపడరు. సాధ్యమైనంత వరకు సాదాసీదా జీవనాన్నే ఇష్టపడతారు.

 

వేల కోట్లలో ఆస్తులు.. పొదుపైన బతుకులు

టిమ్ కుక్ (సీఈఓ, యాపిల్)

ఈయన నికర ఆస్తులు విలువ 400 మిలియన్ డాలర్లు.

టిమ్ కుక్ సాదాసీదా జీవనాన్నే ఇష్టపడతారు. ఖర్చు విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు.

 

వేల కోట్లలో ఆస్తులు.. పొదుపైన బతుకులు

టోనీ హిసైహ్, సీఈఓ జప్పోస్

ఈయన నికర ఆస్తుల విలువ 1 బిలియన్ డాలర్లు

1999లో టోనీ తన కంపెనీని లింక్ ఎక్స్‌చేంజ్‌ను 265 మిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్‌కు విక్రయించేసిన తరువాత తన ఆస్తులను మరింత పొదుపు చేయటం ప్రారంభించారు.

 

వేల కోట్లలో ఆస్తులు.. పొదుపైన బతుకులు

సెర్జీ బ్రిన్ (సహ వ్యవస్థాపకులు గూగుల్)

ఈయన నికర ఆస్తుల విలువ 30.9 బిలియన్ డాలర్లు

డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేయటాన్ని సెర్జీ బ్రిన్ ఏ మాత్రం ఇష్టపడరు. సాధ్యమైనంత వరకు సాదాసీదా జీవనాన్నే ఇష్టపడతారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Extremely Wealthy Tech Executives Who Choose To Live Frugally. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot