యాపిల్ ఐఫోన్‌ల గురించి 10 ఆసక్తికర విషయాలు

Posted By:

స్టీవ్ జాబ్స్ ఆలోచల నుంచి పుట్టుకొచ్చిన యాపిల్ ఐఫోన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మొబైల్ ఫోన్‌ల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేసిన యాపిల్ ఐఫోన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన హుందాతనంతో ప్రపంచ మార్కెట్లో తనకంటూ  ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. 2007, జూన్ 29న స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి యాపిల్ ఐఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసారు. అప్పటి నుంచి యాపిల్ ఐఫోన్ అమ్మకాలు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లను శాసిస్తూనే వస్తున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఐఫోన్ లు మార్కెట్లో కొత్తవిగా ఉన్నాయి. యాపిల్ ఐఫోన్‌ల గురించి 10 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐఫోన్‌ల గురించి 10 ఆసక్తికర విషయాలు

ఐఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచి గేమ్స్ ఆడటం ద్వారా పాపింగ్ అప్‌ల ద్వారా వచ్చే యాడ్‌లను నిరోధించవచ్చు. అయితే, మీకు ఏ విధమైన ఫోన్ కాల్స్ రావు.

యాపిల్ ఐఫోన్‌ల గురించి 10 ఆసక్తికర విషయాలు

ఓ 20 సంవత్సరాల పాటు ఐఫోన్‌ను రోజు వారి చార్జ్ చేసేందుకు ఒక గ్యాలన్ గ్యాస్ ఉపయోగపడుతుందనుకుంటే రెట్టింపు ఇంధనం అవసరమవుతుంది. ఇది సాధ్యమేనా..?

యాపిల్ ఐఫోన్‌ల గురించి 10 ఆసక్తికర విషయాలు

ఐఫోన్‌లో ఉండే కంప్యూటింగ్ మెమరీ, మనిషిని చంద్ర మండలానికి తీసుకువెళ్లటానికి ఉపయోగించిన నాసా స్సేస్ షిప్ కంప్యూటింగ్ మెమరీ కంటే చాలా ఎక్కువ.

నిజంగానే మనిషి చంద్రమండలం పై ల్యాండ్ అయ్యాడా..?

యాపిల్ ఐఫోన్‌ల గురించి 10 ఆసక్తికర విషయాలు

ఓ ఔత్సాహికుడు తన ఐఫోన్‌ను 13,500 ఎత్తు నుంచి క్రిందపడేసాడు. ఈ ఘటనలో కేవలం ఫోన్ స్ర్కీన్ మాత్రమే దెబ్బతింది. ఫోన్ ఎప్పటిలానే స్పందించటం విశేషం.

యాపిల్ ఐఫోన్‌ల గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ ఐఫోన్ 5ఎస్‌ను కొనుగోలు చేసే డబ్బుతో 2000 నిజమైన యాపిల్స్ ను కొనుగోలు చేయవచ్చు.

యాపిల్ ఐఫోన్‌ల గురించి 10 ఆసక్తికర విషయాలు

యాపిల్ ఐఫోన్ పరిణామ క్రమం.

యాపిల్ ఐఫోన్‌ల గురించి 10 ఆసక్తికర విషయాలు

జపాన్‌లోని ఓ యాపిల్ అభిమాని ఐఫోన్6ను దక్కించుకునేందకు 7 నెలలు ముందునుంచే ఇలా ఉత్సాహాంగా ఎదురుచూడటం ఆశ్చర్యం కలిగించింది.

యాపిల్ ఐఫోన్‌ల గురించి 10 ఆసక్తికర విషయాలు

2010లో ఓకేకుపిడ్ అనే రిసెర్చ్ సంస్థ నిర్వహించిన ఓ పరిశోధనలో ఆండ్రాయిడ్, బ్లాక్ బెర్రీ యూజర్లతో పోలిస్తే ఐఫోన్ యూజర్లు ఎక్కువ మంది సెక్స్ పార్టనర్‌లను కలిగి ఉన్నారట.

యాపిల్ ఐఫోన్‌ల గురించి 10 ఆసక్తికర విషయాలు

గడిచిన 5 సంవత్సరాల కాలంగా బాగా అమ్ముడవుతోన్న ఉత్పత్తుల జాబితాలో యాపిల్ ఐఫోన్‌కు రెండో స్థానం లభించింది. రూబిక్స్ క్యూబ్ కు మొదటి స్థానం లభించటం విశేషం.

యాపిల్ ఐఫోన్‌ల గురించి 10 ఆసక్తికర విషయాలు

బ్లాక్ ఐఫోన్ వేగవంతంగా రన్ అవుతుందన్న విషయం తెలియక చాలా మంది వైట్ ఐఫోన్ ను కొనుగోలు చేస్తుంటారు. వైట్ ఐఫోన్, బ్లాక్ వేరియంట్ తో పోలిస్తే ధృడమైన నీటి నిరోధకతను కలిగి ఉంటుందని ఓ నమ్మకం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Facts About iPhone Every Geek Must Know. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot