Home
News

జియో సామ్రాజ్యం వెనుక కొన్ని రహస్యపు ఒప్పందాలు

జియో గురించి పూర్తి సమాచారం ఇదే. ఆనందంగా జీవించమంటూ అంబాని చెప్పిన పాఠం ఇదే.

జియో గురించి పూర్తిగా చాలామందికి తెలియదు. ఉచిత ఆఫర్ల సునామితో మార్కెట్లో సుడి గుండాలు సృష్టించిన జియో ఏ చోట నుండి తన ప్రస్థానాన్ని ప్రారంభించిందే తెలుసుకుంటే ఆశ్చర్యంతో పాటు షాకింగ్ కూడా కలుగుతుంది. అసలు జియో అంటే ఏమిటి..? దాని బ్యాక్ గ్రౌండ్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో అంటే హిందీలో జీవించు

జియో అంటే హిందీలో జీవించు

రిలయన్స్ నుంచి పుట్టిన జియో అంటే హిందీలో అర్థం ఏంటో తెలుసా జీవించు అని. అంబాని అదే చెబుతున్నారు..మీరు మాములుగా జీవించవద్దు ఎంజాయ్ చేస్తూ జీవించడం అని చెబుతున్నారు. ఏన్నో ఏళ్లుగా పాతుకుపోయిన దిగ్గజ ప్రత్యర్థులను ఒకే ఒక అస్త్రంతో చావు దెబ్బ కొట్టారు.

 

 

2010లోకి

2010లోకి

అయితే ఈ జియో ప్రస్థానం ఎక్కడ నుంచి మొదలైంది.. రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ఎలా రూపుదిద్దుకుంది?అంటే చాలా ఆసక్తికర సమాధానాలు వినిపిస్తాయి. అవి తెలుసుకోవాలంటే 2010లోకి వెళ్లాలి.

 

 

నాలుగేళ్ళపాటు పరస్పరం పోటీ పడకూడదన్న ఒప్పందాన్ని

నాలుగేళ్ళపాటు పరస్పరం పోటీ పడకూడదన్న ఒప్పందాన్ని

2010 మే నెలలో నాలుగేళ్ళపాటు పరస్పరం పోటీ పడకూడదన్న ఒప్పందాన్నిముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ రద్దుచేసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములూ విడిపోయే సమయంలో ఆ ఒప్పందం రాసుకున్న సంగతి పాఠకులకు గుర్తుండే ఉంటుంది. దీంతో అనిల్ అంబాని టెలికామ్ వ్యాపారంలో ప్రవేశించేందుకు మార్గం సుగమమైంది.

 

 

2010 జూన్ లో

2010 జూన్ లో

వెనువెంటనే 2010 జూన్ లో ప్రభుత్వం బ్రాడ్ బాండ్ అండ్ వైర్లెస్ యాక్సెస్ (బిడబ్ల్యుఎ) వేలం నిర్వహిస్తున్నప్పుడు వేలం ధరలు సహేతుక పరిమితి దాటి పోయాయంటూ వోడాఫోన్, అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ కమ్యూనికేషన్స్, టాటా కమ్యూనికేషన్స్ వెనకడుగేశాయి.

 

 

ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్

ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్

అయితే, ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్ అనే ఒకే ఒక సంస్థ మాత్రం రంగంలో నిలబడి 12 వేల 847 కోట్ల 77 లక్షలకు వేలం పాడి దేశవ్యాప్తంగా మొత్తం 22 సర్కిల్స్ కు ఏకైక విజేతగా మారింది. దేశవ్యాప్తంగా ఆ సంస్థ ఒక్కటే వేలంలో రూ. 4,800 కోట్లకు లైసెన్స్ గెలుచుకుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కంపెనీ ఏంటో ఎవరూ తొంగిచూడకముందే

కంపెనీ ఏంటో ఎవరూ తొంగిచూడకముందే

ఆ కంపెనీ ఏంటో ఎవరూ తొంగిచూడకముందే ముఖేశ్ అంబానీకి చెందిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆ వేలం జరిగిన మరుసటి రోజే అందులో 95 శాతం వాటా కొనేసింది.

 

 

ఎల్టీఈ లేదా 4 జి మొబైల్ టెక్నాలజీ

ఎల్టీఈ లేదా 4 జి మొబైల్ టెక్నాలజీ

ఆ తరువాత జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలో వైమాక్స్ లేదా ఎల్టీఈ లేదా 4 జి మొబైల్ టెక్నాలజీ ద్వారా వైర్లెస్ బ్రాడ్ బాండ్ సర్వీసులు అందజేస్తుందని ప్రకటించారు.

 కంపెనీ మరో ప్రకటన

కంపెనీ మరో ప్రకటన

అదే సమావేశంలో కంపెనీ మరో ప్రకటన కూడా చేసింది. వచ్చే ఏడాది కాలంలో ఈ సంస్థలో 18 నుంచి 20 వేలకోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పింది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో సేవలు మొదలుపెట్టకపోయినా సంస్థ మాత్రం తన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు బలోపేతం చేసుకోవటానికి తగిన ఏర్పాట్లలో తలమునకలైంది.

 

 

 ఇన్పోటెల్ అనే సంస్థ మిగతా టెల్కోలకు షాకిస్తూ

ఇన్పోటెల్ అనే సంస్థ మిగతా టెల్కోలకు షాకిస్తూ

ఆ వేలం తర్వాత ఇన్పోటెల్ అనే సంస్థ మిగతా టెల్కోలకు షాకిస్తూ వస్తూనే ఉంది. మూడేళ్ళపాటు అనేక నగరాలలో ప్రయోగాత్మకంగా 4జీని పరీక్షిస్తూనే వచ్చింది తప్ప ఎలాంటి కీలకమైన ప్రకటనా చేయలేదు.

 

 

ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ పేరు రిలయెన్స్ జియో

ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ పేరు రిలయెన్స్ జియో

అయితే, 2013 జనవరిలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ పేరును రిలయెన్స్ జియో గా మార్చింది. అప్పటి నుంచి టెక్ దిగ్గజాలకు షాకిస్తూ వస్తూనే ఉంది.

 

 

జియో ఇన్పోకామ్ భారతి ఎయిర్ టెల్ మధ్య ఓ కీలక ఒప్పదం

జియో ఇన్పోకామ్ భారతి ఎయిర్ టెల్ మధ్య ఓ కీలక ఒప్పదం

అదే సమయంలో రిలయన్స్ జియో ఇన్పోకామ్ భారతి ఎయిర్ టెల్ మధ్య ఓ కీలక ఒప్పదం కూడా జరిగింది. భారత్, సింగపూర్ మధ్య సముద్రంగుండా ఉన్న భారతి ఫైబర్ కేబుల్ ను రిలయెన్స్ జియో వాడుకునేలా ఆ ఒప్పందం కుదిరింది.

 

 

 రిలయెన్స్ జియో కు ఆసియా పసిఫిక్ అంతటా

రిలయెన్స్ జియో కు ఆసియా పసిఫిక్ అంతటా

దాని వలన రిలయెన్స్ జియో కు ఆసియా పసిఫిక్ అంతటా ప్రధాన కేంద్రాలకు అత్యంత వేగవంతమైన కనెక్టివిటీ దొరకటంతోబాటు నేరుగా అనుసంధానమయ్యే వీలుంటుంది. ఇది ముందే ఊహించి ఉండే అవకాశం కూడా లేకపోలేదని మార్కెట్ వర్గాల కథనం

 

 

రూ. 1673 కోట్లు

రూ. 1673 కోట్లు

దీంతో పాటు ఆర్ కామ్ కు దేశవ్యాప్తంగా ఉన్న టెలికామ్ టవర్లు తదితర మౌలిక సదుపాయాలను కలిసి వాడుకునేలా రిలయెన్స్ జియో, రిలయెన్స్ కమ్యూనికేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు ప్రతిఫలంగా రిలయెన్స్ జియో ఏకమొత్తంగా రూ. 1673 కోట్లు చెల్లించింది.

 

 

ఎటిసి ( american tower corporation) తో కూడా ఇదే ఒప్పందం

ఎటిసి ( american tower corporation) తో కూడా ఇదే ఒప్పందం

ఇక మరో కంపెనీ అయిన ఎటిసి ( american tower corporation) తో కూడా ఇదే ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఎటిసి ఇండియా వారి టెలికామ్ టవర్ సదుపాయాన్ని కలిసి వాడుకోవటానికి ఆ సంస్థతో కూడా రిలయెన్స్ జియో ఒక ఒప్పందం చేసుకుంది.

 

 

అక్కడ నుంచి జియో ప్రస్థానం

అక్కడ నుంచి జియో ప్రస్థానం

ఇక అక్కడ నుంచి జియో ప్రస్థానం మొదలైందనే చెప్పాలి. ఐఐటి ముంబై లో జరిగిన టెక్ ఫెస్ట్ లో రిలయెన్స్ జియో తన 4 జి నెట్ వర్క్ ను పరీక్షించి చూసింది. వీడియో కాల్స్ ను, జియో టెలివిజన్ సర్వీస్ ను పరీక్షించింది. అప్పుడే మొత్తం 5 వేల పట్టణాలు, నగరాలు, 2 లక్షల 15 వేల గ్రామాలకు విస్తరిస్తామని ముఖేశ్ అంబానీ స్వయంగా ప్రకటించారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
10 facts you need to know about Reliance Jio Read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X