ప్రపంచంలోని 10 అత్యుత్తమ హైటెక్ హోటల్స్!

Posted By:

ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న 10 అత్యుత్తమ హైటెక్ హోటళ్లు ఆధునిక సాంకేతిక వసతులను కలిగి సౌకర్యవంతమైన సర్వీసులను మీకు చేరువచేస్తాయి. పేపర్‌లెస్ బిల్లింగ్, రోబోటిక్ లగేజ్ హ్యాండ్లర్స్, ఇన్‌ఫ్రారెడ్ డోర్ బెల్ డిటెక్టర్స్ వంటి ప్రత్యేకఫీచర్లు ఈ హైటెక్ హోటల్స్‌లో ఉన్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

టెక్నాలజీ మేళవింపుతో ఆధునిక హంగులను అద్దుకుంటున్న మహా నగరాలలో లండన్ ఒకటి. హైటెక్ హంగులతో ఈ ఖరీదైన ప్రాంతంలో నెలకొల్పిన సిటిజన్‌ఎమ్(CitizenM) హైటెక్ హోటల్ సందర్శకులకు వినూత్న అనుభూతులను చేరువ చేస్తోంది. ఈ హోటల్‌ను పూర్తిగా ట్యాబ్లెట్ కంప్యూటర్‌లే కంట్రోల్ చేస్తాయి. బ్యాంక్‌సైడ్ ప్రాంతంలో నెలకొల్పబడిన ఈ హోటెల్‌లో పెద్ద సంఖ్యలో ట్యాబ్లెట్ తరహా టచ్‌స్ర్కీన్ కంప్యూటర్‌లను ఏర్పాటు చేసారు.  హోటల్ గదుల్లో ఏర్పాటు చేసిన సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్లెట్‌ల అతిధులకు కావల్సిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తాయి. బసచేసిన వారు వీటి సాయంతో తమకు కావల్సినవి ఆర్డర్ చేసుకోవచ్చు.అంతేకాదండోయ్ ఈ హోటల్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్ యాక్సిస్ ఉచితం. ఇంటి తరహా వాతావరణాన్ని సందర్శకులకు కలిగించే కమ్రంలో ఈ తరహా ఏర్పాట్లను చేసినట్లు సిటిజన్‌ఎమ్ నిర్వాహకులు తెలుపుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచంలోని 10 అత్యుత్తమ హైటెక్ హోటల్స్!

1.) పెనిన్సులా హోటల్ టోక్యో (Peninsula Hotel Tokyo):

ఈ హోటల్ ఆధునిక వసతులతో స్వాగతం పలుకుతోంది. నెయిల్ పాలిష్ డ్రైయర్లు మొదలుకుని నెయిల్ పాలిష్ డ్రయర్ల వరకు సాంకేతికత సాయంతో స్పందిస్తాయి. ఈ హోటల్ గదుల్లో ఫోన్ రింగ్ వినపడిన వెంటనే టీవీ ఆటోమెటిక్‌గా మ్యూట్ అయిపోతుంది.

 

ప్రపంచంలోని 10 అత్యుత్తమ హైటెక్ హోటల్స్!

2.) ద టార్చ్ దోహా (The Torch Doha):

అత్యాధునిక సాంకేతిక వసతులతో ఈ హోటల్‌ను రూపొందించటం జరిగింది. ఒక్కో గదిలో 12 రకాల లైటింగ్ సెట్టింగ్‌లు ఉన్నాయి. ఇంటరాక్టివ్ ఎల్ఈడీ టీవీలు ఇంకా ట్యాబ్లెట్ పీసీల ద్వారా రూమ్ సర్వీసులను ఆర్డర్ చేయవచ్చు.

 

ప్రపంచంలోని 10 అత్యుత్తమ హైటెక్ హోటల్స్!

3.) హోటల్ జిట్లా శాన్ ఫ్రాన్సిస్కో (Hotel Zetta San Francisco):

సాంకేతిక ప్రియులను ఈ హోటల్ మరింత ఆకర్షిస్తుంది. ఇక్కడి ప్రత్యేకమైన వసతి గదుల్లో 46 అంగుళాల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయటం జరిగింది. జీ-లింక్ డాకింగ్ స్టేషన్, స్ట్రీమింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ హోటల్ కలిగి ఉంది.

 

ప్రపంచంలోని 10 అత్యుత్తమ హైటెక్ హోటల్స్!

4.) అందాజ్ బై హియాట్ (Andaz by Hyatt):

ఈ హోటల్ ప్రత్యేక ఐప్యాడ్‌తో స్వాగతం పలకుతుంది. మీ రూమ్ చెకింగ్ మొదలుకుని బిల్ చెల్లింపు వరకు ఈ ట్యాబ్లెట్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది.

 

ప్రపంచంలోని 10 అత్యుత్తమ హైటెక్ హోటల్స్!

5.) ద అప్పర్ హౌస్ హాంగ్ కాంగ్ (The Upper House Hong Kong):

ఈ హోటల్ ఆధునిక వసతులతో స్వాగతం పలుకుతోంది. పేపర్‌లెస్ వ్యవస్థ ఇక్కడ ప్రధాన ప్రత్యేకత. ఈ హోటల్లో గెస్ట్ రిజిస్ట్రేషన్, బిల్లుల చెల్లింపు ఇంకా ఇతర రూమ్ సర్వీసులకు సంబంధించిన లావాదేవీలను ఐప్యాడ్ ద్వారానే నిర్వహించటం జరుగుతోంది.

 

ప్రపంచంలోని 10 అత్యుత్తమ హైటెక్ హోటల్స్!

6.) అరియా లాస్ వేగాస్ (Aria Las Vegas):

ఈ హోటల్ ప్రత్యేకమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఇండెటీఫికేషన్ టెక్నాలజీ కలిగి ఉంది. ఈ ప్రత్యేకమైన ఫీచర్ మీ రూమ్ తాళాన్ని ఫ్లాష్ చేయగానే ఆటోమెటిక్ గా రూమ్ కర్టెన్స్ తొలగిపోతాయి. అంతేకాదు, టీవీ కూడా ఆన్ అవుతుంది. సెట్టింగ్స్ బట్టి ఈ ఫీచర్ పనితీరు ఉంటుంది.

 

ప్రపంచంలోని 10 అత్యుత్తమ హైటెక్ హోటల్స్!

7.) జేడబ్ల్యూ మారియాట్ హోటల్ సియోల్ (JW Marriott Hotel Seoul):

ప్రత్యేకమైన టెక్నాలజీ వ్యవస్థను ఈ హోటల్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా వ్యాపారావేత్తాలకు ఈ హోటల్ మరింత సౌకర్యవంతం.

 

ప్రపంచంలోని 10 అత్యుత్తమ హైటెక్ హోటల్స్!


8.) ద విట్ హోటల్ చికాగో (theWit Hotel Chicago):

ప్రత్యేకమైన 3జీ ప్రొజెక్షన్ వ్యవస్థను ఈ హోటల్‌లో ఏర్పాటు చేయటం జరిగింది.

 

ప్రపంచంలోని 10 అత్యుత్తమ హైటెక్ హోటల్స్!

9.) హోటల్ 1000, సియాటిల్, వాషింగ్ టన్ (Hotel 1000, Seattle, Washington):

ప్రత్యేక వసతులతో పాటు 100ఎంబి సూపర్ ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ లైన్‌లను ఈ హోటల్లో ఏర్పాటు చేయటం జరిగింది. గదుల్లో ఏర్పాటు ప్రత్యేకమైన సెన్సార్ వ్యవస్థ శరీర ఉష్ణోగ్రతలను బట్టి వ్యవహరిస్తుంది. వర్చువల్ గేమింగ్ వ్యవస్థ ఆకట్టకుంటుంది.

 

ప్రపంచంలోని 10 అత్యుత్తమ హైటెక్ హోటల్స్!

10.) హైయత్ రీజెన్సీ అట్లాంటా, జార్జియా: (Hyatt Regency Atlanta, Georgia):

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting