టెక్ ప్రపంచాన్ని మార్చేసిన 10 అత్యుత్తమ ఆవిష్కరణలు!

|

ప్రజాజీవితాన్ని మరింత సుఖవంతం చేస్తూ ప్రపంచ దిశనే మార్చేసిన వినూత్నఆవిష్కరణలు చాలానే ఉన్నాయి. 100ల ఏళ్ల క్రితం ప్రపంచపు పరిస్థితులను చరిత్ర ఆధారంగా మనం పరిశీలించినట్లయితే మనుగడ ఎంత కష్టతరంగా ఉండేదో అర్థమవుతుంది. క్రమక్రమంగా తన ఆలోచనలకు పొదునుపెడుతూ వచ్చిన మనిషి ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణల వైపు దృష్టిని మళ్లించి ప్రపంచాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా టెక్నాలజీ ప్రపంచంలో చోటుచేసుకున్న పది అత్యుత్తమ ఆవిష్కరణలను మీతో షేర్ చేసుకుంటున్నాం......

 

మొదటి వాణిజ్య సెల్‌ఫోన్:

మొదటి వాణిజ్య సెల్‌ఫోన్:

1.) మొదటి వాణిజ్య సెల్‌ఫోన్:

మార్కెట్లో విడుదలైన మొట్టమొదటి వాణిజ్య సెల్‌ఫోన్‌గా మోటరోలా డైనా టాక్ 8000 ఎక్స్ (Motorola DynaTAC 8000X)చరిత్రకెక్కింది. ఈ సెల్‌ఫోన్‌ను మోటరోలా సంస్థ 1984లో విడుదల చేసింది. మోటరోలా సంస్థకు చెందిన డాక్టర్ మార్టిన్ కూపర్ ఏప్రిల్ 4, 1973న మొదటి హ్యాండ్‌హెల్డ్ ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసారు.

 

మొదటిస్మార్ట్ ఫోన్:

మొదటిస్మార్ట్ ఫోన్:


2.) మొదటిస్మార్ట్ ఫోన్:

1992లో ఐబీఎమ్ సంస్థ ‘ఐబీఎమ్ సైమన్' పేరుతో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను కంప్యూటర్స్ డీలర్స్ ఎగ్జిబిషన్ వేదికగా ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ హ్యండ్‌సెట్ 4.5 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్‌ను కలిగి
కాలింగ్ వ్యవస్థతో పాటు క్యాలెండర్, అడ్రస్ బుక్, ఫ్యాక్స్, మోడెమ్, నోట్ ప్యాడ్, ఈమెయిల్ అప్లికేషన్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది.

 

మొట్టమొదటి ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్:
 

మొట్టమొదటి ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్:

మొట్టమొదటి ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్:

1992లో మెక్‌గిల్ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు అలెన్ ఎంతేజ్, బిల్ హీలన్ ఇంకా జే. పీటర్‌లు ఆన్‌లైన్‌లో ప్రజలు నిర్దిష్ట ఫైళ్లను కనుగొనేందుకు వీలుగా ‘ఆర్చీ'(Archie) పేరుత ప్రత్యేకమైన టూల్‌ను వృద్ధి చేసారు. ఆర్చీ మొట్టమొదటి ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్‌గా చరిత్రకెక్కింది.

 

మొట్టమొదటి సోషల్ మీడియా నెట్‌వర్క్ సైట్:

మొట్టమొదటి సోషల్ మీడియా నెట్‌వర్క్ సైట్:

మొట్టమొదటి సోషల్ మీడియా నెట్‌వర్క్ సైట్:

1997లో సిక్స్ డిగ్రీస్ డాట్ కామ్ (SixDegrees.com) పేరుతో మొట్టమొదటి సోషల్ మీడియా నెట్‌వర్క్ సైట్‌ను ప్రారంభించారు. ఈ సైట్‌లో యూజర్లు తమ ప్రొఫైళ్లను క్రియేట్ చేసుకోవచ్చు.

 

జావా (java)

జావా (java)

జావా

ఇంటరాక్టివ్ టెలివిజన్ సాధ్యం చేయడానికి జేమ్స్ గోస్లింగ్, మైక్ షెర్డియన్ ఇంకా ప్యాట్రిక్ నాటన్‌ను జూన్ 1991లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పై పని చేయటం ప్రారంభించారు. వీరి కృషికి ఫలితంగా జావా ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చింది. 1995లో సన్ మైక్రోసిస్టమ్స్ సంస్థ జావా 1.0 ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అనేక అప్లికేషన్‌లను తయారు చేయటంలో జావా లాంగ్వేజ్ ఉపయోగపడుతోంది.

 

వరల్డ్ వైడ్ వెబ్

వరల్డ్ వైడ్ వెబ్

వరల్డ్ వైడ్ వెబ్:

1992లో బ్రిటన్ దేశానికి చెందిన ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్ లీ ‘వరల్డ్ వెడ్ వెబ్' పేరుతో సరికొత్త సమాచార వ్యవస్థను నిర్మించారు.
ఇంటర్నెట్‌ను 1983, జనవరి1న అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ప్రారంభించింది. ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ సూట్ (ఐపీఎస్) సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలిగేలా రూపొందించిన ‘ఆర్పానెట్' నెట్‌వర్క్ ఈ మేరకు ఆ రోజు అధికారికంగా ప్రారంభమైంది. కంప్యూటర్లను అనుసంధానం చేసే ‘ఆర్పానెట్' అనే ఈ కొత్త పద్ధతే తర్వాత ‘వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ)' రాకకు మార్గం సుగమం చేసింది.

 

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో

ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసిన మొదటి ఫోటో

వరల్డ్ వైడ్ వెబ్ సృష్టికర్త టిమ్ బర్నర్స్ కామెడీ బ్యాండ్ బృందంతో కూడిన పోటోను తొలిగా వెబ్‌లో పోస్ట్ చేసారు.

 

మొట్టమొదటి పోర్నోగ్రాఫిక్ సైట్:

మొట్టమొదటి పోర్నోగ్రాఫిక్ సైట్:

మొట్టమొదటి పోర్నోగ్రాఫిక్ సైట్:

వరల్డ్ వైడ్ వెబ్ విస్తరణలో భాగంగా పోర్న్ వెబ్‌సైట్‌లు కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్నెట్ ప్రపంచంలో మొట్టమొదటి పోర్నోగ్రాఫిక్ వైబ్‌సైట్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త గ్యారీ క్రీమెన్ ప్రారంభించారు. వెబ్‌సైట్ పేరు సెక్స్ డాట్ కామ్ (Sex.com)

 

మొట్టమొదటి ఈ-మెయిల్:

మొట్టమొదటి ఈ-మెయిల్:

మొట్టమొదటి ఈ-మెయిల్:

రే టాంలిన్సన్ (Ray Tomlinson) 1971లో మొదటిసారిగా ఈ-మెయిల్‌ను పోస్ట్ చేసారు.

 

టెక్ చిట్కా: మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X