నాడు చిన్నరూంలో..నేడు అద్దాల మేడలో..

Written By:

నేడు ప్రపంచాన్ని ఏలుతున్న కంపెనీలు చిన్న రూంలో ప్రారంభమై ఆర్థికంగా ఎన్నో ఓడిదుడుకులను ఎదుర్కున్నవే. ఎన్ని ఒడిదుడుకులెదురైనప్పటికీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగి విజయతీరాలకు చేరాయి. చిన్న రూం నుంచి అద్దాల మేడలోకి తమ కార్యకలాపాలను విస్తరించాయి. అలా చిన్న రూం లో ప్రారంభమై అద్దాలమేడలోకి వెళ్లిన ఓ 10 కంపెనీలను మీకు పరిచయం చేస్తున్నాం చూడండి.

Read more: పిన్నవయసులోనే కోట్లకు అధిపతులయ్యారు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాల్ డిస్నీ కంపెనీ

వాల్ డిస్నీ తన అంకుల్ ఇంటిలో పనిచేశాడు. అక్కడే తన మిక్కీ మౌస్ ని క్రియేట్ చేశాడు. సొంత రూం కూడా లేదు. అతని బ్రదర్ రాయ్ డిస్నీతో కలిసి ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మీడియా సమ్మేళనంగా నిలిచింది.

రిలయన్స్

ధీరూభాయి అంబాని దక్షిణ ముంబైలోని ఓ చిన్న రూంలో స్టార్ట్ చేశారు. కాని ఇది ఇప్పుడు ఇండియాలోనే అతి పెద్ద కంపెనీగా ప్రఖ్యాతిగాంచింది. ఎన్నో రకాల బిజినెస్ లు నడుస్తున్నాయి. మీడియా. ఆయిల్ ,టెలికాం అన్ని రంగాలో రిలయన్స్ దే ఆధిపత్యం.

ఫ్లిప్ కార్ట్

ఇద్దరు ఐఐటీ విద్యార్థులు బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్ దీన్ని స్థాపించారు. ఇది మొదట ఆన్ లైన్ బుక్ స్టోర్ గా ప్రారంభమై అనతికాలంలోనే అది పెద్ద ఈ కామర్స్ మార్కెట్ గా అవతరించింది.మార్కెట్ లో 60 వాతానికి పైగా తనవాటాను ఆక్రమించింది.

డెల్

మిచెల్ డెల్ దీన్ని స్టార్ట్ చేశారు. అతను చదివిన యూనివర్సిటీలో ఓ చిన్న రూంలో అదీ అతను వసతి ఉండే రూంలో ప్రారంభించారు. అప్పుడు అతని మూలధనం కేవలం 1000 డాలర్లు .వేరే ఆప్సన్స్ లేవు. అయితేనేమి ఇప్పుడు ప్రపంచమార్కెట్ లో టెక్నాలజీలో అతి పెద్ద కంపెనీగా అవతరించింది.

ఓయో రూమ్స్

దీన్ని రితీష్ అగర్వాల్ స్థాపించారు. 17 సంవత్సరాల వయసులో కాలేజీ విద్యను ఆపేసాడు. దేశాలు తిరుగుతూ అనేక హోటళ్లలో బస చేశారు. అయితే అదే అతనికి వ్యాపారం అవుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు ఇదే ట్రావెలింగ్ లో అతి పెద్ద సంస్థ.

రెడ్డిట్

దీన్ని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు స్థాపించారు. ఈ సైట్ లో ఆస్క్ మి ఎనీధింగ్ అనే ఆప్సన్ ఉంటుంది. ఈ కంపెనీ కోసం ఇతరుల వద్ద అప్పు చేసిన కంపెనీ అధినేత ఇప్పుడు దీన్ని 500 మిలియన్ల డాలర్లకు చేర్చారు.

అమెజాన్

1994 జెఫ్ బిజోస్ స్థాపించారు. వాల్ స్ట్రీట్ లో ఉద్యోగానికి రాంరాం చెప్పి అమెజాన్ స్టార్ట్ చేశారు. ఇది మొదటగా ఆన్ లైన్ బుక్ స్టోర్ గా ప్రారంభమై అనతికాంలోనే అతిపెద్ద ఈ కామర్స్ గా అవతరిచింది.

హెచ్‌పి

ఈ కంపెనీని డేవ్ అండ్ లూసెల్లి పాకర్డ్ స్థాపించారు. వీరిద్దరూ భార్యాభర్తలు. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో హెచ్‌పి కంపెనీని ప్రారంభించారు.ఇప్పుడు ఇదే అతి పెద్ద మార్కెట్

జోమటో

దీపిందర్ గోయెల్ పంకజ్ దీన్ని స్థాపించారు. అయితే మొదటగా దీన్ని పుడ్ రేటింగ్ కోసం అలాగే రివ్యూస్ కోసం వెబ్‌సైట్ లాగా స్టార్ట్ చేశారు. తరువాత అది కొత్త రూపుతో పుడ్ ఆర్డరింగ్ తీసుకునే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు 23 దేశాల్లో నడుస్తోంది.

ఫేస్‌బుక్

ఈ సోషల్ మీడియాని హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థి మార్క్ జుకర్ బర్గ్ స్థాపించారు. అయితే ఇది మొదట్లో యూనివర్సిటీలో మీటింగ్ కోసం అలాగే డేటింగ్ కోసం తయారుచేశారు. ఇప్పుడు ఇది ప్రపంచాన్నే శాసిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Large Internet Companies that started from a One Room Apartment!
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot