ఈ ఫోన్ల ధరలు వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి

Written By:

మీరు స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో అనేక రకాలైన ఫోన్లను చూసి ఉంటారు. సాధారణంగా ప్రముఖ కంపెనీ ఫోన్ ధరలు మహా అంటే లక్షలోపే ఉంటాయి.. ఐ ఫోన్ లాంటి ఫోన్లు అయితే కాస్త అటు ఇటూలో ఉంటాయి .అయితే ఈ పోన్ల ధరలు చూసినవారికి మాత్రం కళ్లు బైర్లు కమ్ముతాయి. వీటి ధరలు లక్షనో రెండు లక్షలో కాదు. ఏకంగా కోట్లలో ఉంటాయి..మొత్తం బంగారంతో నిండి డైమండ్లతో పొదిగిన ఫోన్లు ఇవి. మీరే చూడండి.

Read more: పొట్టి ఐఫోన్ మార్కెట్లో దిగింది : మిగతా ఫోన్లకు చుక్కలేనా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డైమండ్ రోజ్ ( Diamond Rose iPhone 4 32GB )

1

ఇది 32 జిబి ఐపోన్. దీని ధర 8 మిలియన్ల డాలర్లు. దీనికి దాదాపు 500 డైమండ్లను వాడారు. ఆపిల్ లోగోకోసం 53 డైమండ్లను అధికంగా వాడారు. కళ్లు జిగేల్ మంటాయి ఈ ఫోన్ చూసినవారికి.

 

 

సుప్రీమ్ ( Supreme Goldstriker iPhone 3G 32GB)

2

దీని ధర 3,200,000 డాలర్లు. ఇది 3జీ ఐపోన్, దీని బరువు 271 గ్రాములు ఉంటుంది. 22కె బంగారంతో నిండి ఉంటుంది. కాశ్మీర్ గోల్డ్ అలాగే అత్యంత పవర్ పుల్ బంగారాన్ని ఈ ఫోన్ కోసం వాడారు.

iPhone 3G King’s Button

3

దీని ధర 2.4 మిలియన్ల డాలర్లు. మొత్తం డైమండ్లతో నిండి ఉంటుంది. దాదాపు 138 డైమండ్లను వాడారు.

గోల్డ్ విష్ ( GoldVish Le Million)

4

దీన్ని ఇమ్యాన్యుయేల్ డిజైన్ చేశారు. వీరు వాచీలు అలాగే బంగారాన్ని డిజైన్ చేస్తారు. దీన్ని తయారుచేసి స్విట్జర్లాండ్ లో లాంచ్ చేశారు. ఈ ఫోన్ 18కె క్యారెట్ల బంగారంతో అలాగే 20 క్యారెట్ల VVS1 డైమండ్ తో తయారుచేశారు.

డైమండ్ ( Diamond Crypto Smartphone)

5

దీని ధర 1.3 మిలియన్ డాలర్లు. దీనిలో 50 డైమండ్లు ఉంటాయి. ఇది చాలా శక్తివంతమైన రక్షణ కూడా ఇస్తుంది.

Gresso Luxor Las Vegas Jackpot

6

దీన్ని 2005లో స్విట్జర్లాండ్ లో చేశారు. దీని బరువు 180 గ్రాములు. 200 సంవత్సరాల క్రితం ఆప్రికన్ లో ఉన్న బ్యాక్ వుడ్స్ తో దీని వెను ప్యానల్ తయారైంది. దీని కీ లన్నీ క్రిస్టల్ తో తయారైఉంటాయి. దీని ధర 1 మిలియన్ల డాలర్లు

కోబ్రా ఫోన్ ( Vertu Signature Cobra)

7

ఫోన్ చుట్టూ పాము ఆకారంలో ముత్యాల హారం ఉంటుంది. అది మొత్తం డైమండ్లతో నిండి ఉంటుంది.

బ్లాక్ డైమండ్ ( BlackDiamond VIPN Smartphone)

8

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫోన్లలో దీని స్థానం 8.పోలో కార్బోనేట్ మిర్రర్ తో పాటు ఆర్గానిక్ ఎల్ ఈడీ టెక్నాలజీని వాడారు. దీనిలో రెండు డైమండ్లు మాత్రమే వాడారు. దీని ధర 300,000 డాలర్లు

ఐ ఫోన్ ప్రిన్స్ స్ ప్లస్ ( iPhone Princess Plus)

9

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫోన్లలో ఇది కూడా ఒకటి. మొత్తం డైమండ్లతో అలాగే బంగారంతో నింపారు. ఆస్ట్రియాకు చెందిన పీటర్ దీన్ని డిజైన్ చేసినవారు. దీని బరువు 16.50 నుంచి 17.75 వరకు ఉంటుంది. దీని ధర మార్కెట్లో 1, 76, 400 డాలర్లు

డైమండ్ ఫోన్ ( Vertu Signature Diamond)

10

ఇది ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ ఫోన్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్లలో ఇది ముందు వరుసలో ఉంటుంది. ఇది ప్లాటినంతో అది మిషన్ల మీద కాకుండా చేతులతోనే తయారుచేశారు. 200 డైమండ్ లు ఈ ఫోన్ లో పొదిగారు. దీని ధర 88000 డాలర్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Most Expensive Mobile Phones in the World
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting