10 బెస్ట్ ఫేస్‌బుక్ గేమ్స్

Posted By:

మనలో చాలా మందికి ఫేస్‌బుక్ ఓ సామాజిక సంబంధాల వారధిగానే తెలుసు. ఈ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్ సైట్ లో మనుకు తెలియని అంశాలు చాలానే దాగి ఉన్నాయి. ముఖ్యంగా గేమింగ్ ప్రియులకు ఫేస్‌బుక్ చక్కటి టైమ్‌పాస్. ఫేస్‌బుక్ లో అనేక ఆసక్తికర గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు ఫేస్‌బుక్ లో ఒక్క గేమ్ కూడా ఆడనట్లయితే వీటిని ట్రే చేయండి. ఖాళీ సమయంలో మాత్రమేనండోయ్!!

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఆధునిక యువత జీవితాల్లోకి శరవేగంగా విస్తరించిన ఫేస్‌బుక్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సరికొత్త అధ్యయానానికి నాంది పలికింది. ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నెటిజనులు దాసోహమంటున్నారు. చిన్ననాటి స్నేహితులు మొదలుకుని పెద్ద వయసు ప్రాణ స్నేహితుల వరకు ఫేస్‌బుక్ చాటింగ్‌లలో మునిగితేలుతున్నారు. ఫేస్‌బుక్ అకౌంట్‌లను కలిగి ఉన్న అనేక మంది యువతకు తామ నిర్వహిస్తోన్న అకౌంట్‌కు సంబంధించి చాలా సందేహాలే ఉంటాయి. వాటిని నివృత్తి చేసే ఉద్దేశ్యంతో రకరకాల ఫేస్‌బుక్ చిట్కాలను ఆర్టికల్స్ రూపంలో గిజ్‌బాట్ పోస్ట్ చేయటం జరుగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 బెస్ట్ ఫేస్‌బుక్ గేమ్స్

Candy Crush Saga (క్యాండీ క్రష్ సాగా)

2013కు గాను క్యాండీ క్రష్ సాగా నెం.1 ఫేస్‌బుక్‌గా గుర్తింపుపొందింది. ప్రముఖ సోషల్ గేమ్స్ కంపెనీ కింగ్ ఈ ఆటను డిజైన్ చేసింది. ఈ ఆసక్తికర గేమ్‌ను ఆడుతున్న నెలవారీ యూజర్ల సంఖ్య 148 మిలియన్లు.

 

10 బెస్ట్ ఫేస్‌బుక్ గేమ్స్

Farm Heroes Saga (ఫార్మ్ హీరోస్ సాగా)

ప్రముఖ సోషల్ గేమ్స్ కంపెనీ, కింగ్ ఈ 3 పజిల్ గేమ్‌ను డెవలప్ చేసింది. నెలవారీ యూజర్ల సంఖ్య 40 మిలియన్లు.

10 బెస్ట్ ఫేస్‌బుక్ గేమ్స్

Pet Rescue Saga (పెట్ రెస్క్యూ సాగా)

కింగ్ కంపెనీ మూడవ ప్రయత్నంగా ఈ పెట్ రెస్క్యూ సాగా గేమ్‌ను ఫేస్‌బుక్‌లో విడుదల చేసి ఘన విజయాన్ని అందుకుంది. నెల వారీ యూజర్ల సంఖ్య 36 మిలియన్లు.

 

10 బెస్ట్ ఫేస్‌బుక్ గేమ్స్

Farmville 2 (ఫార్మ్‌విల్లీ 2)

జింగా సంస్థ ఫార్మ్‌విల్లీ పేరుతో తన మొట్టమొదటి ఫేస్‌బుక్ గేమ్‌ను 2009లో విడుదల చేసింది. ఈ గేమ్ కాస్తా బంపర్ హిట్ అవటంతో ఫార్మ్‌విల్లీ 2 పేరుతో సక్సెసర్ వర్షన్‌‌ను 2012లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ గేమ్‌ను వినియోగిస్తోన్న నెలవారీ యూజర్ల సంఖ్య 28 మిలియన్లు.

10 బెస్ట్ ఫేస్‌బుక్ గేమ్స్

Dragon City (డ్రాగన్ సిటీ)

ప్రముఖ స్పానిష్ గేమ్ డెవలపర్ సోషల్ పాయింట్ డ్రాగన్ సిటీ పేరుతో ఓ ఫాంటసీ గేమ్‌ను ఫేస్‌బుక్ ప్రియులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ గేమ్‌ను వినియోగిస్తోన్న నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 26 మిలియన్లు.

 

10 బెస్ట్ ఫేస్‌బుక్ గేమ్స్

క్రిమినల్ కేస్ (Criminal Case)

ఈ పాపులర్ ఫేస్‌బుక్ గేమ్‌ను ఫ్రెంచ్ సోషల్ గేమింగ్ కంపెనీ ప్రీటీ సింపుల్ 2012లో విడుదల చేసింది. ఈ గేమ్‌ను వినియోగిస్తోన్న నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 25 మిలియన్లు.

 

10 బెస్ట్ ఫేస్‌బుక్ గేమ్స్

Trivia Crack (ట్రివియా క్రాక్)

ప్రముఖ సోషల్ గేమింగ్ కంపెనీ Etermax ఈ గేమ్‌ను డెవలప్ చేసింది. ఈ గేమ్‌ను వినియోగిస్తోన్న నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 23 మిలియన్లు.

 

10 బెస్ట్ ఫేస్‌బుక్ గేమ్స్

Bubble Witch 2 Saga (బబ్బుల్ విచ్ 2 సాగా)

బబ్బుల్ విచ్ 2 సాగా, కింగ్ సంస్థ డిజైన్ చేసిన 8వ ఫేస్‌బుక్ గేమ్. ఈ గేమ్‌ను వినియోగిస్తోన్న నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 22 మిలియన్లు.

 

10 బెస్ట్ ఫేస్‌బుక్ గేమ్స్

టెక్సాస్ హోల్డిమ్ పోకర్

జింగా సంస్థ ఈ గేమ్‌ను డెవలప్ చేసింది. ఈ గేమ్‌ను వినియోగిస్తోన్న నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 21 మిలియన్లు.

 

10 బెస్ట్ ఫేస్‌బుక్ గేమ్స్

8 బాల్ పూల్

8 బాల్ పూల్ గేమ్‌ను ప్రముఖ సోషల్ గేమింగ్ కంపెనీ మినీక్లిప్ డెవలప్ చేసింది. ఈ గేమ్‌ను వినియోగిస్తోన్న నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 19 మిలియన్లు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Most Popular Facebook Games Of 2014. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot