ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌లు

తన మోటో ఇ, మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లతో అమ్మకాల సునామీని సృష్టించిన మోటరోలాకు దశాబ్థాల చరిత్రే ఉంది.ప్రపంచానికి మొట్ట మొదటి మొబైల్ ఫోన్‌ను అందించిన విప్లవాత్మక బ్రాండ్‌గా మోటరోలా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. మొబైల్ మార్కెట్లోకి నోకియా, సామ్‌సంగ్‌లు అడుగుపెట్టకముందే తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మోటరోలా కాలక్రమంలో ఆర్థిక ఇబ్బందులు కారణంగా మూతపడాల్సివచ్చింది.

ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌లు

ఆ తరువాత వ్యూహాత్మక ఎత్తుగడలతో మోటరోలా పగ్గాలను అందిపుచ్చుకున్న గూగుల్ మోటో జీ పేరుతో ఆండ్రాయిడ్ ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసి మోటరోలాకు మంచి బ్రేక్ తీసుకువచ్చింది. చైనా మార్కెట్ పై పట్టు సాధించే క్రమంలో మోటరోలా మొబిలిటీ డివిజన్‌ను లెనోవోకు విక్రయించిన గూగుల్, మోటరోలా బ్రాండ్ ఇమేజ్‌ను ఒక్కసారిగా పెంచేసింది.

Truecaller యాప్ సేఫ్ కాదా..? తొలగించటం ఏలా..?

ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌లు

ప్రపంచపు తొలి చేతివినియోగ మొబైల్ ఫోన్ ‘మోటరోలా డైనా‌టాక్ 8000ఎక్స్'ను మోటరోలా ఉద్యోగి మార్టిన్ కూపర్ 1973లో తయారు చేశారు. ఫోన్ బరువు 1.1 కిలో గ్రాములు.

 

ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌లు

11 సంవత్సరాల తరువాత అంటే 1984లో ఈ ఫోన్‌ను వాణిజ్యపరంగా విడుదల చేశారు. అప్పటి ధర $3,995. ఈ ఫోన్ ను పూర్తి గా చార్జ్ చేసేందుకు 10 గంటల సమయం పట్టేది. 30 నిమిషాలు మాత్రమే మాట్లాడుకునే అవకాశం ఉండేది.

ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌లు

1980-1990 మధ్య మోటరోలా నుంచి విడుదలైన MicroTAC ఫోన్ ప్రత్యేకమైన పాపులారీటిని సొంతం చేసుకుంది. ఫ్లిప్ ఫ్రంట్, రేడియో యాంటీనా వంటి ఫీచర్లు ఈ డివైస్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌లు

1993లో మోటరోలా నుంచి విడుదైలన One2One M300 1800మెగాహెర్ట్జ్ పీసీఎన్ బ్యాండ్స్‌ను సపోర్ట్ చేసిన మొట్టమొదటి ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

 

ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌లు

1997లో మోటరోలా నుంచి విడుదైలన మొదటి ఫ్లిప్‌ఫోన్ Star Trek ప్రేరణతో డిజైన్ చేయటం జరిగింది.

 

ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌లు

మోటరోలా నుంచి 1999లో విడుదలైన Timeport World Phone మెయిన్ స్ట్రీమ్ ఫోన్‌గా నిలిచింది. వివిధ జీఎస్ఎమ్ బ్యాండ్‌లను సపోర్ట్ చేసే సామర్థ్యాలతో వచ్చిన ఈ ఫోన్‌ను యూరోప్, ఆసియా ఇంకా యూఎస్ మార్కెట్లలో విక్రయించారు.

 

ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌లు

2004లో మోటరోలా నుంచి విడులైన Razr V3 ఫోన్ స్టైలిష్ ఫోన్ గా గుర్తింపు తెచ్చుకునింది. 2004 - 2006 మధ్య 1.3 బిలియన్ Razr V3 ఫోన్ లను మోటరోలా విక్రయించింది. మోటరోలా బెస్ట్ సెల్లింగ్ ఫోన్ లలో ఇది కూడా ఒకటి.

 

ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌లు

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌తో మరోసారి మార్కెట్ రీఎంట్రీ ఇచ్చిన మోటరోలా అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగులేని ఆధిపత్యంతో దూసుకుపోతోంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రూపురేఖలనే మార్చేసింది.

 

ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌లు

మోటరోలా నుంచి 2013లో విడుదలైన మోటో ఎక్స్ ఫోన్ కస్టమైజబుల్ డిజైన్‌తో ప్రపంచాన్ని కట్టిపడేసింది.

 

ప్రపంచాన్నే మార్చేసిన 10 మోటరోలా ఫోన్‌లు

కింద పడినా పగలని సామర్థ్యాలతో మోటరోలా అభివృద్థి చేసిన శక్తివంతమైన ఫోన్ 'మోటో ఎక్స్ ఫోర్స్'(Moto X Force). క్రిందపడినా ధ్వంసం కాని shatterproof డిస్‌ప్లే, వాటర్-రిపెల్లెంట్ నానో - కోటింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ దృఢమైన ఫోన్‌లో మోటరోలా పొందుపరిచింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Motorola Phones that Changed the Smartphone World!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot