ఈ పనులు చేసే సమయంలో మీరు స్మార్ట్‌ఫోన్ అసలు వాడకూడదు
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు అనేవి కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ రాజ్యమేలుతోంది. సోషల్ మీడియా వచ్చిన తరువాత అయితే ఇవి మరీ ఊపందుకున్నాయి. పొద్దున లేస్తే వాట్సప్ , ఫేస్ బుక్, ట్విట్టర
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు అనేవి కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ రాజ్యమేలుతోంది. సోషల్ మీడియా వచ్చిన తరువాత అయితే ఇవి మరీ ఊపందుకున్నాయి. పొద్దున లేస్తే వాట్సప్ , ఫేస్ బుక్, ట్విట్టర్ వీటితోనే టైం పాస్ చేస్తున్నారు. టైంపాస్ వరకు బాగానే ఉంది కాని ఫోన్ ఛార్జింగ్ అనేది చాలా సమస్యగా మారిన విషయం అందరూ గమనించే ఉంటారు. ఇలా ఛార్జింగ్ సమయంలో ఫోన్ వాడటం చాలా ప్రమాదకరం.

అలాగే డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫోన్ టెక్స్టింగ్ చాలా ప్రమాదకరమని కూడా పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కొన్ని పనులు చేసే సమయంలో మీరు ఫోన్ అసలు వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం.

డ్రైవింగ్ సమయంలో..
డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫోన్ టెక్స్టింగ్ చాలా ప్రమాదకరమని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని చాలా మంది పెడచెవిన పెట్టేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్నసమయంలో స్మార్ట్‌ఫోన్‌లను వాడటం కారణంగా డ్రైవింగ్ పై ఏకాగ్రత దెబ్బతింటుంది, ఈ కారణంగా ఎటువంటి అనర్థాలైనా జరగొచ్చు.కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశముంది. కాబట్టి డ్రైవింగ్ సీటులో కూర్చున్నప్పుడు సాధ్యమైనంతవరకు వరకు ఫోన్ టెక్స్టింగ్ లకు దూరంగా ఉండండి.

స్టడీ సమయంలో..
మీరు చదువుకునే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ వాడవద్దు. ఇలా చదివే సమయంలో ఫోన్ వాడితే మీ ఏకాగ్రత చెడిపోయి పరీక్షల్లో ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి చదివే సమయంలో ఫోన్ దూరం పెట్టుకోవడం మంచిది.

కుకింగ్ సమయంలో..
లేడిస్ కుకింగ్ చేసే సమయంలో ఫోన్ పక్కన పెట్టాలి. ఫోన్ మోజులో పడి చేయి కోసుకోవడం లేకుంటే మరేదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అదీగాక వంట కూడా సరిగా రాకపోవచ్చు. కాబట్టి వంట పూర్తయ్యే వరకు దూరంగా ఉంచడం మంచింది.

పనిసమయంలో
మనం బిజిగా పని చేస్తున్న సమయంలో ఫోన్ వాడటం కూడా మంచిది కాదు. ఫోన్ వాడుతూ పనిచేస్తుంటే పూర్తిగా ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. బాసులతో ఓ సారి తిట్లు కూడా తినాల్సి రావచ్చు.

స్నానం చేసే సమయంలో,,
మీరు స్నానం చేస్తున్నప్పుడుఫోన్ ని కొంచెం పక్కనబెట్టండి. లేకుంటే ఫోన్ మీద నీళ్లు పడి చెడిపోయే ప్రమాదం ఉంది. మీ ఫోన్ సేఫ్ గా ఉంచుకునేందుకు మీరు బాతింగ్ సమయంలో ఫోన్ ని దూరంగా పెట్టడం మంచిది.

సినిమా హాల్ లో
మీరు మంచి మూవీకి వెళ్లినప్పుడు ఫోన్ చాలా అంతరాయం కలిగించాల్సి రావచ్చు. కాబట్టి దాన్ని మూవీ చూసే సమయంలో దూరంగా పెట్టడం మంచింది.

బస్ కోసం వేచి చూస్తున్న సమయంలో
మీరు బస్ కోసం వేచి చూస్తున్న సమయంలో ఫోన్ మోజులో పడితే మీరు అందుకోవాల్సిన బస్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఈ ససమయంలో చాలా తక్కువగా ఫోన్ వాడండి.

విమాన ప్రయాణంలో..
మీరు విమానంలో ప్రయాణం చేసే సమయంలో మీ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయడం కాని లేకుంటే ఫ్లైట్ మోడ్ లో కాని ఉంచండి. లేకుంటే మీ ఫోన్ బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది.

రోడ్ క్రాస్ సమయంలో
మీరు రోడ్ క్రాస్ చేసే సమయంలో ఫోన్ అసలు వాడకండి. అలా చేయడం వల్ల మీరు యాక్సిడెంట్ కి గురి కావచ్చు. ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి కూడా..


Click it and Unblock the Notifications








