క్రికెట్‌ ఆడుతున్నారా..అయితే వీటి గురించి తెలుసుకోండి

Written By:

క్రికెట్ ఇప్పుడు ప్రపంచానికి పట్టిన ఫీవర్. అది టీ 20 అయినా వన్డేలు అయినా, టెస్ట్ లు అయినా...ఏదయినా సరే దాన్ని ఉత్కంఠతో చూడాల్సిందే.. ఇక పొట్టి క్రికెట్ వచ్చిన తరువాత క్రికెట్ ప్రపంచమే మారిపోయింది. 14వ శతాబ్దం నుంచి నేటి దాకా దాదాపు 100కు పైగా దేశాల్లో ఈ క్రికెట్ ఆడుతున్నారు. అయితే క్రికెట్‌లో టెక్నాలజీ ఏముంది అని చాలామందికి డౌటు రావచ్చు...క్రికెట్ లో కూడా విప్లవాత్మక టెక్నాలజీని ప్రవేశపెట్టారు..అవేంటో మీరే చూడండి.

Read more: కలా.. నిజమా : బద్ధ శత్రువులు ఇలా సెల్ఫీలతో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఈ రకమైన బెయిల్స్ ను తొలిసారిగా ఆస్ట్రేలియన్ బిగ్ బాష్ లీగ్ లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు వీటిని ఐసీసీ వరల్డ్ టీ 20కి వాడుతున్నారు. ఈ బెయిల్స్ కు మైక్రో ప్రాసెసర్ ఉంటుంది. ఈ బెయిల్స్ సెకండ్ కు 1/1000th వేగంతో రియాక్షన్ ని గుర్తించగలవు. దీని పేటెంట్ కి అయిన ఖర్చు ఎంతో తెలుసా దాదాపు 40 వేల డాలర్లు. ఇవే ఇప్పుడు మ్యాచ్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

2

క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు గ్రౌండ్ నలుమూలలా ఈ స్పైడర్ కామ్ లు తిరుగుతూ మ్యాచ్ ని షూట్ చేస్తాయి. మ్యాచ్ మొత్తాన్ని నిలువుగా అలాగే అడ్డంగా ఏ కోణంలో కావాలంటే ఆ కోణంలో గ్రౌండ్ నలువైపులా తిరిగి షూట్ చేస్తాయి. ఇదంతా కేబుల్ టెక్నాలజీ ద్వారా అలాగే సాఫ్ట్ వేర్ ద్వారా మాత్రమే కంట్రోల్ అవుతూ ఉంటుంది. అణువణువునా గాలిస్తూ ఉంటాయి.

3

ఇది లెగ్ బిఫోర్ వికెట్ కి వాడే అత్యంత అధునాతనమైన టెక్నాలజీ. కామెంటేటర్స్ అలాగే వీక్షకులు అందరూ చూసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. బాల్ పడిన తరువాత దాన్ని లెగ్ బిఫోర్ కింద బౌలర్ అప్పీల్ చేసినప్పుడు ఈ టెక్నాలజీ అంపైర్ కు చాలా సహాయం చేస్తుంది. చూసేందుకు ఇది నీడలాగా ఉంటుంది. కాని కరెక్ట్ పొజిషన్ లో బాల్ పడిందా లేదా అని కరెక్ట్ గా చెబుతుంది.

4

బాల్ బ్యాట్ కు తగిలిందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు అంపైర్ ఈ రకమైన టెక్నాలజీని ఉపయోగిస్తారు. బాల్ బ్యాట్ హెడ్జ్ లకు గాని లేకుంటే ఎక్కడైనా తగిలి తగలనట్లు వెళ్లినప్పుడు ఈ టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ టెక్నాలని చాలా ఖరీదుతో కూడుకున్నది కావడంతో దీన్ని అమలు చేయట్లేదు.

5

ఈ రకమైన టెక్నాలజీని అలెన్ ప్లాస్కెట్ ఆవిష్కరించారు. ఇది వికెట్ కి బాల్ కి అలాగే బ్యాట్ కి బాల్ కి మధ్య దూరాన్ని ఇలా సిగ్నల్స్ రూపంలో అందిస్తుంది. స్టంప్స్ దగ్గరలో మైక్రోఫోన్స్ తో కూడిన టెక్నాలజీ ఉంటుంది. అక్కడ ఫలితం ఎలా వచ్చిందనేది ఈ స్నిక్ మీటర్ ధ్వనులతో సహా వినిపిస్తుంది. ఆద్వనిని బట్టే అంపైర్ నిర్ణయం తీసుకుంటారు.

6

ఈ రకమైన టెక్నాలజీని స్టంపౌట్స్ లో ఉపయోగిస్తారు. బ్యాట్స్ మెన్ క్రీజు వదిలినప్పుడు కీపర్ స్టంపౌట్స్ కి అప్పీల్ చేసినప్పుడు ఈ టెక్నాలజీని ఉపయోగించే అంపైర్ నిర్షయం తీసుకుంటారు.

6

ఇది బౌలర్ వేసే బంతి వేగాన్ని కొలుస్తుంది. గిన్నీస్ రికార్డ్ లో చోటు సంపాదించిన బౌలర్ల బంతి వేగం ఈ టెక్నాలజీ ద్వారానే తెలుసుకుంటారు. ఇప్పటివరకు అత్యంత వేగంతో విసిరిన బంతిగా షోయబ్ అక్తర్ నిలిచాడు. ఇతను ఇంగ్లండ్ మీద దాదాపు గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరారు. ఇదే ఇప్పటివరకు అత్యధిక రికార్డు.

8

క్రికెట్ జరుగుతున్న సమయంలో ఆడియన్స్ ని ఎంకరేజ్ చేయడానికి అంపైర్లు వాడే టెక్నాలజీ. బౌలర్ వ్యూహాలు అలాగే బ్యాట్స్ మెన్ వ్యూహాలు, కెప్టెన్ వ్యూహాలు ఇలా అన్నింటిని అంపైర్లు చెబుతూ ఆడియన్స్ ని ఎంకరేజ్ చేస్తుంటారు.

9

2013లో యాషెస్ సీరిస్ లో స్కై స్పోర్ట్ వారు దీన్ని ప్రవేశపెట్టారు. బాల్ నిమిషానికి టర్న్ ఎలా అవుతోంది. దానికి సంబంధించిన రేటింగ్ ను ఇచ్చే టెక్నాలజీ. బాల్ టర్న్ అయిన తరువాత ఆ బాల్ వేగాన్ని కొలుస్తారు..ఇది స్నిన్నర్ల సామర్ధ్యాన్ని అంచనా వేసే టెక్నాలజీ. గన్ స్పీడ్ పేసర్ల వేగాన్ని అంచనా వేసే టెక్నాలజీ

10

దీనికి అడ్వాన్స్ హై స్పీడ్ కెమెరాలు వాడుతారు. ఈ టెక్నాలజీ చాలా పకడ్బందీగా ఉంటుంది. ఫ్రేమ్ చాలా స్లోగా మూవ్ కావాలంటే ఈరకమైన టెక్నాలజీ తప్పనిసరి. అందుకుని ముందుగానే హై స్పీడ్ కెమెరాలు ఈ టెక్నాలజీకి వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తుంటారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Technological Advancements in Cricket
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot