ఐఫోన్ 6 చేయలేదు.. గెలాక్సీ ఎస్6 చేయగలదు..

Written By:

ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్, సామ్‌సంగ్‌ల మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరు నెలకున్న విషయం తెలిసిందే. ఇటీవల యాపిల్ నుంచి విడులైన ఐఫోన్ 6ను టార్గెట్ చేస్తూ సామ్‌సంగ్ ఇటీవల గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లను బరిలోకి దింపింది. ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్‌లలోని డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ఫింగర్ ఫ్ఱింట్ స్కానర్ తదితర విభాగాలను మరింత అభివృద్థి పరిచినట్లు సామ్‌సంగ్ వెల్లడించింది. పలు కొత్త ఫీచర్లను సైతం సామ్‌సంగ్ ఈ లేటెస్ట్ వర్షన్ ఫోన్‌లలో పొందుపరిచింది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6లోని 10 ప్రత్యేకమైన అంశాలను (ఐఫోన్ 6లో లేనివి) మీతో షేర్ చేసుకుంటున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 6 చేయలేదు.. గెలాక్సీ ఎస్6 చేయగలదు..

గెలాక్సీ ఎస్6లోని ప్రతీ కాంటాక్ట్‌కు నిర్ణీత రంగును అసైన్ చేసుకోవచ్చు. సంబంధిత కాంటాక్ట్ నుంచి కాల్ వచ్చినప్పుటు ఆ కాంటాక్ట్ అసైన్ చేసిన రంగుతో ఫోన్ డిస్‌ప్లే ప్రకాశిస్తుంది. ఈ సదుపాయం ఐఫోన్ 6లో లేదు.

ఐఫోన్ 6 చేయలేదు.. గెలాక్సీ ఎస్6 చేయగలదు..

గెలాక్సీ ఎస్6 లేదా గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ఫోన్‌లలో కెమెరా యాప్‌ను లాంచ్ చేయాలంటే డివైస్ హోమ్ బటన్ పై డబల్ ట్యాపింగ్ చేస్తే చాలు. అదే, ఐఫోన్ 6లో కెమెరా యాప్‌ను లాంచ్ చేయాలంటే lock screenలో కనిపించే కెమెరా ఐకాన్‌ను ప్రెస్ చేయావల్సి ఉంటుంది.

ఐఫోన్ 6 చేయలేదు.. గెలాక్సీ ఎస్6 చేయగలదు..

గెలాక్సీ ఎస్6లోని కెమెరా తన పరిధిలోని ప్రతి సబ్జెక్ట్‌ను పూర్తిగా ట్రాక్ చేస్తుంది. ఆ సబ్జెక్ట్ కదులుతున్నప్పటికి తన ఫోకస్‌ను ఏమాత్రం కోల్పోదు. ఐఫోన్ 6లో ఈ సదుపాయం లేదు. అయితే ఐఓఎస్8లోని ప్రత్యేకమైన ఎడిటింగ్ ఫీచర్ల ద్వారా ఫోటోలను చాలా సులువుగా ఎడిట్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 6 చేయలేదు.. గెలాక్సీ ఎస్6 చేయగలదు..

గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ఫోన్‌లను చాలా వేగవంతగా చార్జ్ చేసుకోవచ్చు. ఎంత వేగంగా అంటే..? 10 నిమిషాల చార్జ్ చేస్తే చాలు గంటల తరబడి యూసేజ్‌‍ను పొందవచ్చు. ఐఫోన్ 6లో ఈ విధమైన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కొరవడటం విశేషం.

ఐఫోన్ 6 చేయలేదు.. గెలాక్సీ ఎస్6 చేయగలదు..

గెలాక్సీ ఎస్6 screen టర్న్ ఆఫ్ చేసి ఉన్నప్పటికి తెర పై సమయాన్ని మీరు చూడొచ్చు. ఐఫోన్‌లలో ఈ తరహా సదుపాయం ఉండదు.

ఐఫోన్ 6 చేయలేదు.. గెలాక్సీ ఎస్6 చేయగలదు..

గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ home screenల పై ఏక కాలంలో అనేక యాప్‌లను ఓపెన్ చేసుకోవచ్చు. ఐఫోన్ 6 screen పై ఒక యాప్‌ను మాత్రమే ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది.

ఐఫోన్ 6 చేయలేదు.. గెలాక్సీ ఎస్6 చేయగలదు..

గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్‌ స్మార్ట్‌ఫోన్‌లు వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

ఐఫోన్ 6 చేయలేదు.. గెలాక్సీ ఎస్6 చేయగలదు..

గెలాక్సీ ఎస్6 అలానే గెలాక్సీ ఎస్6 ఎడ్జ్‌ స్మార్ట్‌ఫోన్‌లు స్మార్ట్ మేనేజర్ యాప్‌తో లభ్యమవుతున్నాయి. ఈ యాప్ ఫోన్‌లను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుతుంది.

ఐఫోన్ 6 చేయలేదు.. గెలాక్సీ ఎస్6 చేయగలదు..

గెలాక్సీ ఎస్6 అలానే గెలాక్సీ ఎస్6 ఎడ్జ్‌ స్మార్ట్‌ఫోన్‌లు మీ గుండె వేగాన్ని కొలవగలవు. ఇటీవల కాలంలో యాపిల్ తన ఐఫోన్‌లో పలు గుండె సంబంధిత ఫీచర్లను పొందుపరుస్తూ వస్తోంది.

ఐఫోన్ 6 చేయలేదు.. గెలాక్సీ ఎస్6 చేయగలదు..

గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లలో పొందుపరిచిన సామ్‌సంగ్ పే ఫీచర్ ద్వారా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్‌తో అవసరం లేకుండా చెల్లింపులను చేయవచ్చు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 things Samsung Galaxy S6 can do, iPhone 6 cannot. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot