సైబర్‌క్రైమ్ కొత్తగా దూసుకొచ్చింది, ఈ 10 నిజాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి
సైబర్ చీటర్స్ బారినపడుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. వారి ఉచ్చులోపడి చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. అవగాహనరాహిత్యం కారణంగా చాలా మంది సైబర్ క్రైం ఉచ్చులో ఇరుక్కుంటున్నారని పోలీసులు
సైబర్ చీటర్స్ బారినపడుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. వారి ఉచ్చులోపడి చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. అవగాహనరాహిత్యం కారణంగా చాలా మంది సైబర్ క్రైం ఉచ్చులో ఇరుక్కుంటున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు వారి మాటలను నమ్మి ఆర్థికంగా చితికిపోతున్నారు. దీంతో ప్రజలను అలర్ట్ చేసేందుకు పోలీసులు క్రిమినల్స్ నేరాల ప్రక్రియ గురించి వివరిస్తున్నారు. ఇవి తెలుసుకుని ప్రజలు వారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

అయితే ఎంతలా జాగ్రత్తలు తీసుకున్నా ఇవి మాత్రం ఆగడం లేదు. ఈ మధ్య కొత్తదారి ద్వారా సైబర్ క్రైమ్ జరుగుతోంది. ఈ డేంజర్ సైబ్ క్రైం గురించి ఓ10 నిజాలు మీకోసం.

sextortion
సెక్స్ కి బానిసయిన వారిని టార్గెట్ చేస్తూ వారికి గాలం వేస్తూ సైబర్ క్రైం జరుగుతోంది. వారి వీక్ నెస్ ని పసిగట్టి వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

అడల్ట్ కంటెంట్
వారి ప్రొఫైల్ పాస్్ వర్డ్ లను పసిగట్టి వారు ఏం చేస్తున్నారో పసిగడుతున్నారు. తద్వారా వారు మీరు అడల్ట్ కంటెంట్ చూశారు మా దగ్గర మీ డేటా మొత్తం ఉందని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

లింక్డ్ ఇన్
ఈ క్రిమినెల్స్ ప్రధానంగా లింక్డ్ ఇన్ అకౌంట్ల ద్వారా తమ పనిని సాగిస్తున్నారు. అందులో ముఖ్యమైన అకౌంట్లను సెలక్ట్ చేసుకుని వారికి గాలం వేస్తున్నారు.

టార్గెట్
మంచి పేరున్న వారిని అలాగే మంచి హోదాలో ఉన్నవారిని కనిపెట్టి మరీ వీరు బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నారు. ధనవంతులను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు.ఇందులో లాయర్లు, డాక్టర్లు ఉన్నారు.

బిట్ కాయిన్ ద్వారా పేమెంట్లు
వీరి వలలో చిక్కుకున్న వారిని బిట్ కాయిన్స్ ద్వారా పేమెంట్ చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

అమ్మకాలు
వీరు ఇంకో ఎత్తు కూడా వేస్తున్నారు. బ్లాక్ మెయిల్ ఎలా చేయాలి అనే గైడ్ నే ఆన్ లైన్ లో 10 డాలర్లకు విక్రయిస్తున్నారు.

sextortion ద్వారా బ్లాక్ మెయిల్
ఈ రకమైన పద్దతిలో వివాహం అయినవారితో పరిచయం పెంచుకుని వారి నుంచి అన్ని వివరాలను రాబట్టి తర్వాత బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు.

భారీ స్టాయిలో జీతాలు
ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే..ఈ రకమైన పనులు చేసేవారికి వారు భారీ స్థాయిలో జీతాలను అందిస్తున్నారు. దాదాపు రూ.7.7 కోట్లను జీతంగా చెల్లిస్తున్నారని సమాచారం.

July 2018 to February 2019 వరకు
July 2018 to February 2019 వరకు గణాంకాలను పరిశీలిస్తే వీరి భారీన 89,000 మంది ప్రత్యేకంగా అంటే మంచి హోదాలో ఉన్నవారు పడ్డారని అంచనా. వీరి నుంచి దాదాపు కొన్ని లక్షల కోట్లను దండుకున్నారు. ఇక నార్మల్ విషయానికి వస్తే 792000 మంది దోపిడి భారీన పడినట్లు తెలుస్తోంది,


Click it and Unblock the Notifications








