షియోమి ధర తగ్గింపు ప్లాన్..?

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ షియోమీ ఏప్రిల్ 23న నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో తన తురవాతి వర్షన్ ఫ్లాగ్ షిప్ మోడల్ స్మార్ట్ ఫోన్ ‘ఎమ్ఐ 4ఐ' (కోడ్ నేమ్ షియోమీ ఫెర్రారీ)ని ఆవిష్కరించనున్నట్లు వెబ్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తకు మరింత బలాన్నిచ్చే విధంగా షియోమీ ఇటీవల తన ‘ఎంఐ 4' స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ఇండియన్ మార్కెట్లో ధర తగ్గింపును ప్రకటించింది.

ఇంకా చదవండి: హద్దులు దాటిన తెలివి!

తాజా ధర తగ్గింపులో భాగంగా భారత్ మార్కెట్లో ఎంఐ 4 స్మార్ట్ ఫోన్ 16జీబి వేరియంట్ ధర రూ.17,999 (పాత ధర రూ.19,999). 64జీబి వేరియంట్ ధర రూ.21,999 (పాత ధర రూ.23,999).

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్‌లోని 10 ప్రత్యేక ఫీచర్లను ఇప్పుడు తెలుసుకుందాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమి ఎంఐ4 లాక్‌స్ర్కీన్ ఓ మల్టీ ఫంక్షనల్ యాప్

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన లాక్ స్ర్కీన్ ఓ మల్టీ ఫంక్షనల్ యాప్. ఫోన్ లాక్ చేసి ఉన్నప్పటికి యూజర్లు లాక్ స్ర్కీన్ పైనే అన్ని నోటిఫికేషన్ లను చూసుకోవచ్చు. ఫోన్ ను అన్ బ్లాక్ చేయకుండానే ఎస్ఎంఎస్ అలానే ఈమెయిల్ సందేశాలను చెక్ చేసుకోవచ్చు. ఫోన్ లాక్ తీయకుండానే హోమ్ బటన్ కొద్ది సేపు ప్రెస్ చేసి ఉంచటం వల్ల ఎల్ఈడి టార్చ్ ఆన్ అవుతుంది. లాక్ స్ర్కీన్ పై డబల ట్యాప్ చేయటం ద్వారా మ్యూజిక్ మెనూను కంట్రోల్ చేసుకోవచ్చు.

 

షియోమి ఎంఐ4లో పొందుపరిచిన నోట్ ఫీచర్ ద్వారా యూజర్ కాల్ స్వీకరిస్తూనే ఎస్ఎంఎస్, సింపుల్ నోట్ లేదా వాయిస్ రికార్డ్‌కు ఉపక్రమించవచ్చు.

షియోమి ఎంఐ4 స్మార్ట్‌ఫోన్ లోకి ముఖ్యమైన సందేశాలను పిన్ చేసుకోవచ్చు.

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్‌‌లో అద్భుతమైన ఆప్టిక్ సిస్టంతో ఏర్పాటు చేసిన బీఎస్ఐ సోనీ 13 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్  క్యూఆర్- కోడ్‌లను ఆటోమెటిక్‌గా స్కాన్ చేసేస్తుంది.

 

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచిన ఫ్రంట్ కెమెరా ద్వారా సెల్ఫీలను చిత్రీకరించుకునే సమయంలో యూజర్ వయసు ఇంకా జెండర్‌ను ఆటోమెటిక్‌గా స్కాన్ చేసేస్తుంది.

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు తమ డివైస్‌లోని వివిధ యాప్‌లకు సంబంధించి డేటా యూసేజ్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు.

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన ఇన్-బుల్ట్ క్లీనర్ యాప్‌ను కలిగి ఉంది.

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్‌‌లోని ఎంఐయూఐ యూజర్ ఇంటర్‌ఫేస్ అన్ని గూగుల్ అకౌంట్‌లను సపోర్ట్ చేస్తుంది.

షియోమి ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు వివిధ లొకేషన్‌లలో ఉన్న తమ డేటాను సునాయసంగా బ్యాకప్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Things You Didn't Know About Xiaomi Mi4. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot