SpaceX కంపెనీ గురించి మీకు తెలియని వాస్తవాలు

|

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అమెరికన్ ఏరోస్పేస్ మాన్యుఫాక్షరింగ్ సర్వీసెస్ కంపెనీ 'స్పేస్ఎక్స్’ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. 2002లో ప్రారంభమైన ఈ కంపెనీ ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్‌కు మొట్టమొదటి కమర్షియల్ రాకెట్‌ను అందించింది.

SpaceX  కంపెనీ గురించి మీకు తెలియని వాస్తవాలు

 

మానవ అంతిరక్ష ప్రయాణాన్ని మరింత విప్లవాత్మకం చేసే క్రమంలో ఇలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కార్పొరేషన్ తీవ్రంగా శ్రమిస్తోంది. కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న SpaceX గురంచి 10 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1.) స్పేస్‌క్రాఫ్ట్‌ను భూకక్ష్యలోకి పంపి దానిని విజయవంతంగా భూమి పై దింపగలిగిన మొట్టమొదటి ప్రైవేటు కంపెనీగా SpaceX ఏరోస్పేస్ చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు ఈ పనిని ప్రభుత్వం సంస్థలైన NASA, Roscosmosలు మాత్రమే విజయవంతంగా పూర్తి చేయగలిగాయి.

2.) SpaceX కంపెనీ రూపొందించిన Falcon 9 రాకెట్‌కు ఆ పేరు, స్టార్ వార్స్ చిత్రంలో ఉపయోగించిన Millennium Falcon స్పేస్‌షిప్ ప్రేరణతో వచ్చింది. 9 అంకె ఆ రాకెట్‌లో వినియోగించిన 9 ఇంజిన్‌లను సూచిస్తుంది.

3.) SpaceX రాకెట్ల తయారీకి అవసరమైన 80% విడి భాగాలు, ఆ కంపెనీ లోపలే తయారవుతాయట. దీని వల్ల బోలెడంత డబ్బు ఆదా అవటంతో పాటు సమయం కూడా కలిసొస్తుందట.

4.) SpaceX కంపెనీ అభివృద్ది చేసిన మొట్టమొదటి రాకెట్ Falcon 1 భూకక్ష్యలోకి చేరుకోవటానికి వరసగా మూడు సార్లు ఫెయిల్ అయ్యింది. నాలుగో సారి మాత్రం విజయవంతంగా భూకక్ష్యలోకి చేరుకోగలిగింది. ఈ ప్రయోగం కంపెనీని నష్టాల్లోకి నెట్టేసింది.

5.) మార్స్ కలోనియల్ ట్రాన్స్పోర్టర్ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేంత వరకు SpaceX కంపెనీని పబ్లిక్ కంపెనీగా ఎలాన్ మస్క్ మార్చాలనుకోవటం లేదట.ఈ ప్రాజెక్టులో భాగంగా ఓ ప్రత్యేకమైన వాహక నౌక మనుషులను అంగారక గ్రహానికి తీసుకువెళ్లబోతోంది. ఇందులో ప్రయాణించే ఒక్కొక్కరికి 5 లక్షల డాలర్లు ఖర్చవుతుంది.

6.) SpaceX కంపెనీ అభివృద్ది చేసిన డ్రాగన్ అనే రీయూజబుల్ స్పేస్‌క్రాఫ్ట్ 7గురు వ్యోమగాములతో పాటు వారికి సంబంధించి వస్తువులను ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్‌కు చేర్చగలదు. ఈ స్పేస్‌క్రాఫ్ట్ మొత్తం 3,310 కిలోగ్రాముల బరువును మోసుకెళ్లగలదు.

7.) మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుల్లో ఒకరైలన పాల్ అలెన్ 2011లో SpaceX బోర్డులో జాయిన్ అయ్యారు.

Stratolaunch సిస్టమ్స్ పేరుతో ఓ జాయింట్ ప్రాజెక్ట్‌ను ఎలాన్ మస్క్‌తో కలిసి పాల్ అలెన్ ప్రారంభించారు.

8.) SpaceX కంపెనీ తమ రాకెట్లను ప్రయోగించుకునేందుకుగాను 2012లో బోకా చికా బీచ్ ప్రాంతంలో 43 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలాన్ని ఆనుకునే ఉన్న మరో 56.6 ఎకరాలను కూడా కంపెనీ లీజుకు తీసుకుంది.

9.) రాకెట్ సైన్స్ పై పూర్తి అవగాహనను ఏర్పరుచుకున్న ఎలాన్ మస్క్ సరికొత్త ఆవిష్కరణల దిశగా ముందుకు సాగుతున్నారు. ల్యాండింగ్ పార్ట్‌తో సహా అన్ని పనులను రాకెట్లే నిర్వర్తించుకునే విధంగా ఆటోమెటిక్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని SpaceX భావిస్తోంది.

10.) దక్షిణాఫ్రికాలో జన్మించిన ఎలాన్ మస్క్ తన 17వ ఏటనే కెనడాకు వచ్చారు. ఇక్కడ ఆయన బాయిలర్ రూమ్ క్లీనర్‌గా పనిచేసారట. ఇందుకు గాను గంటకు 18 డాలర్లను వేతనంగా తీసుకునే వారట. ఎలాన్ మస్క్ తన 12వ ఏట తయారుచేసుకున్న మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్ (బ్లాస్టర్ వీడియో గేమ్)ను 500 డాలర్లకు (మన కరెన్సీ ప్రకారం రూ.33,900)కు విక్రయించారు.

 

11.) Stanford Ph.Dలో జాయిన్ అయిన రెండు రోజులకే ఎలాన్ మస్క్‌ ఆ చదువకు స్వస్తి పలికారు. 1 మిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ కొనుగోల చేసిన మెక్లారెన్ F1 కారుకు కొన్నరోజునే ప్రమాదం జరిగింది.

12.) 2008లో బ్యాంక్ అప్పుల్లో కూరుకుపోయిన ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీని 1.6 బిలియన్ డాలర్లు విలువ చేసే నాసా కాంట్రాక్ట్ కాపాడింది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన 20 రాకెట్ లాంచర్లలో వరసుగా 19 విజయవంతమయ్యాయి. జూన్ 2015లో ప్రయోగించిన 20వ రాకెట్ లాంచర్ ఫెయిల్ అయ్యింది.

అక్టోబర్ 10న Mi Mix 2 లాంచ్ అవుతోంది

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
SpaceX is an American Aerospace Manufacturing services founded by Elon Musk in an attempt to create the technologies that will enable humanity to reduce the cost of space transportation and enable the colonization of Mars.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X