ఆపిల్‌ను కాపీ కొడుతున్న షియోమి, సాక్ష్యం ఈ ఫోటోలే

చైనా మొబైల్ మేకర్ షియోమి ఇప్పుడు స్మార్ట్ మార్కెట్ లో మకుటం లేని మారాజుగా వెలుగొందుతోంది. టెక్నాలజీలోకి ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే దిగ్గజాలను వెనక్కి నెట్టేసింది. అయితే షియోమి ఎంతలా ముందుకెళుతున్

|

చైనా మొబైల్ మేకర్ షియోమి ఇప్పుడు స్మార్ట్ మార్కెట్ లో మకుటం లేని మారాజుగా వెలుగొందుతోంది. టెక్నాలజీలోకి ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే దిగ్గజాలను వెనక్కి నెట్టేసింది. అయితే షియోమి ఎంతలా ముందుకెళుతున్నప్పటికీ దానిపై ఓ ముద్ర మాత్రం చెరిగిపోవడం లేదు. అదేంటంటే షియోమి నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి ఆపిల్ ని కాపీ కొడుతోంది. అందుకే అది చైనా ఆపిల్ అయిందని విశ్లేషకులు చెబుతుంటారు.

ఆపిల్‌ను కాపీ కొడుతున్న షియోమి, సాక్ష్యం ఈ ఫోటోలే

ఆపిల్ కంపెనీ నుంచి ఏదైనా ఉత్పత్తి వచ్చిందంటే అది షియోమిని పోలీ ఉంటుందనే దానికి కొన్ని ఫోటోలను సాక్ష్యంగా చెప్పవచ్చు. మరి ఆపిల్ ను కాపీ కొట్టిన షియోమి ఫోటోలను మీరు ఓ సారి చూడండి.

ఐఫోన 5ని కాపీ కొట్టి ఎంఐ4

ఐఫోన 5ని కాపీ కొట్టి ఎంఐ4

షియోమి ఐఫోన్ 5ని కాపీ కొట్టి ఎంఐ4ని మార్కెట్లోకి దించింది. స్క్రీన్ పరంగా కాని డిజైన్ పరంగా కాని చూస్తే అచ్చు గుద్దినట్లు ఒకే విధంగా ఉంటాయి.ఇదిలా ఉంటే 2014లో షియోమి సీఈఓ లీ జున్ కూడా అచ్చం దివగంత ఆపిల్ బాసు స్టీవ్ జాబ్స్ ని కాపీ కొట్టాడు. ఆ ఈవెంట్లో జాబ్స్ డ్రస్ కోడ్ అయిన బ్లాక్ టాప్ అండ్ బ్లూ జీన్స్ తో దర్శనమిచ్చారు.

ఐఫోన్ 5సి మాదిరిగా ఎంఐ ప్యాడ్స్

ఐఫోన్ 5సి మాదిరిగా ఎంఐ ప్యాడ్స్

ఎంఐ ప్యాడ్స్ కూడా అచ్చం ఐప్యాడ్ మినిని పోలీ ఉంటాయి. అలాగే ఐఫోన్ 5సిని మక్కీకి మక్కీ దించినట్లుగా కూడా ఉంటాయి.

షియోమి ఎంఐ మిని రూటర్

షియోమి ఎంఐ మిని రూటర్

ఆపిల్ మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్ లా షియోమి ఎంఐ మిని రూటర్
ఇది కూడా డిజైన్ పరిశీలిస్తే అచ్చం కాపీ కొట్టినట్లే ఉంటుంది.

ఐఫోన్ ఎక్స్ ని కాపీ కొట్టిన ఎంఐ8

ఐఫోన్ ఎక్స్ ని కాపీ కొట్టిన ఎంఐ8

ఈ రెండు ఫోన్లను పరిశీలిస్తే ఒకే విధంగా ఉంటాయి. రెండు కవలలు అని కూడా అనుకునే అవకాశం ఉంది.

ఐఫోన్ ఎక్స్ గ్వెశ్చరే MIUI 9

ఐఫోన్ ఎక్స్ గ్వెశ్చరే MIUI 9

ఆ ఆపరేటింగ్ సిస్టంను పరిశీలిస్తే ఇది కూడా అచ్చం కవలలు లాగానే ఉంటాయి.

ఆపిల్ ఎయిర్ ప్యాడ్  షియోమి ఎయిర్ డాట్స్

ఆపిల్ ఎయిర్ ప్యాడ్ షియోమి ఎయిర్ డాట్స్

ఇయర్ ఫోన్ విషయంలో కూడా షియోమి తన కాపీ తత్వాన్ని వదులుకోలేదు. ఈ రెండింటిని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.

 

 

ఐఓఎస్7ని కాపి కొట్టి MIUI 6

ఐఓఎస్7ని కాపి కొట్టి MIUI 6

MIUI 6 కూడా ఐఓఎస్ ని కాపీ కొట్టింది. అందులో కనిపించే క్యాలండర్లు , కాలిక్యులేటర్ అన్ని ఒకే విధంగా ఉంటాయి.

MacOS Mojave వాల్ పేపరే ఎంఐ9 వాల్ పేపర్

MacOS Mojave వాల్ పేపరే ఎంఐ9 వాల్ పేపర్

ఈ ఫోటోలను చూసి మీరే చెప్పవచ్చు. ఆఖరికి వాల్ పేపర్లను కూడా వదిలిపెట్టలేదు షియోమి

ఆపిల్ adsలా షియోమి ads

ఆపిల్ adsలా షియోమి ads

వీటి విషయంలో కూడా ఆపిల్ ని ఆదర్శంగా తీసుకుంది షియోమి

ఆపిల్ టీవీలా షియోమి మి బాక్స్

ఆపిల్ టీవీలా షియోమి మి బాక్స్

ఇది కూడా కాపీ కొట్టినట్లే కనిపిస్తోంది. రెండింటిని పోల్చి చూస్తే ఇట్టే పసిగట్టవచ్చు.

Best Mobiles in India

English summary
10 times xiaomi copied apple smartphone and laptop design names ads

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X