లైఫ్‌స్టైల్‌ను మరింత క్రేజీగా మార్చే ట్రాకర్స్, యాప్స్

Posted By:

అడవి నుంచి మొదలైన మనిషి జీవన ప్రస్థానం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. శాస్త్ర సాంకేతిక కమ్యూనికేషన్ రంగాలలో శతాబ్థాల కాలంగా మనిషి సాధిస్తున్న విజయాలు నవ శకానికి నాంది పలుకుతున్నాయి. సాంకేతిక విప్లవం మరింత వేగవంతంగా పుంజుకోవటంతో వెలుగులోకి వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి. గృహోపకరణాలు సైతం స్మార్ట్ సాంకేతికతను అద్దుకంటున్నాయి. ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం కాబోతున్న 10 క్రియేటివ్ ఉత్పత్తులు మిమ్మల్ని కొత్తగా ఆలోచనల వైపుగా మళ్లిస్తాయ్..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లైఫ్‌స్టైల్‌ను మరింత క్రేజీగా మార్చే ట్రాకర్స్, యాప్స్

బరువు తగ్గాలనుకుంటున్నారా..?(Fitbit Flex or Jawbone UP24)

ఫిట్‌బిట్ ఫ్లెక్స్, జాబోన్ యూపీ24 యాక్సిలరోమీటర్లను కలిగి ఉండే ఈ రెండు వేరబుల్స్ మీ ఆరోగ్యపు అలవాట్ల పై దృష్టిసారించి వాటిని నియంత్రణలోకి తీసుకువస్తాయి. మీరు రోజు ఎక్కువ సేపు కూర్చుంటున్నట్లయితే మిమ్మల్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తాయి.

లైఫ్‌స్టైల్‌ను మరింత క్రేజీగా మార్చే ట్రాకర్స్, యాప్స్

గార్మిన్ ఫోర్‌రన్నర్‌10 ( Garmin Forerunner 10)

వాచ్ తరహాలో ఉండే ఈ డివైస్ బిల్ట్-ఇన్ జీపీఎస్ సహాయంతో ప్రతి మైలుకు మీ పరుగును అంచనా వేస్తూ ఫిట్నెస్ స్థాయిని మరింత మెరుగుపరుస్తుంది.

లైఫ్‌స్టైల్‌ను మరింత క్రేజీగా మార్చే ట్రాకర్స్, యాప్స్

లుమో లిఫ్ట్ (Lumo Lift)

లుమో లిఫ్ట్.. ఈ చిన్ని గాడ్జెట్ యూజర్ ప్రతి కదలికను పర్యవేక్షిస్తూ అవసరమైన బాడీ లాంగ్వేజ్ చిట్కాలు సూచిస్తుంది. తద్వారా బాడీ లాంగ్వేజ్ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవచ్చు. ఈ గాడ్జెట్‌ను ఎవరికంటా పడకుండా దుస్తుల్లో అమర్చుకోవచ్చు.

లైఫ్‌స్టైల్‌ను మరింత క్రేజీగా మార్చే ట్రాకర్స్, యాప్స్

ఫిట్నెస్‌ను పెంపొందించే అతోస్ వేరబుల్ టెక్నాలజీ

సూట్ తరహాలో ఉండే ఈ వేరబుల్ క్లాత్ డివైజ్ మనిషి గుండె వేగంతో పాటు కండరాల కదలికలను మానిటర్ చేస్తూ మీ వ్యాయమ తీరను ఫీడ్‌బ్యాక్‌ల రూపంలో విశ్లేషిస్తుంది.

లైఫ్‌స్టైల్‌ను మరింత క్రేజీగా మార్చే ట్రాకర్స్, యాప్స్

Whistle (విజిల్)

ఈ హెల్త్ ట్రాకర్ మీ పెంపుడు కుక్కకు సంబంధించిన ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తూ ఆ సమాచారాన్ని మీకు చేరవేస్తుంది.

లైఫ్‌స్టైల్‌ను మరింత క్రేజీగా మార్చే ట్రాకర్స్, యాప్స్

Clue and Kindara (క్లూ అండ్ కిన్‌దారా)

యాపిల్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ యాప్స్ ద్వారా శృంగారం అలానే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలను తీసుకోవచ్చు.

లైఫ్‌స్టైల్‌ను మరింత క్రేజీగా మార్చే ట్రాకర్స్, యాప్స్

గ్లో నర్ట్యుర్ (Glow Nurture)

ఈ ఐఫోన్ యాప్ ద్వారా గర్భవతులు తమ ప్రెగ్నెన్సీకి సంబంధించి విలువైన సమచారాన్ని పొందవచ్చు.

లైఫ్‌స్టైల్‌ను మరింత క్రేజీగా మార్చే ట్రాకర్స్, యాప్స్

స్పైర్ (Spire)

ఈ అద్భుతమైన ట్రాకింగ్ గాడ్జెట్ శ్వాస తీసుకునే విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ యూజర్ మానసిక స్థితిని అంచనా వేస్తుంది. యూజర్ మానసిక స్థితిగతులను రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్‌ల రూపంలో అందిస్తుంది.

లైఫ్‌స్టైల్‌ను మరింత క్రేజీగా మార్చే ట్రాకర్స్, యాప్స్

మిమో స్మార్ట్ బేబీ మానిటర్

ప్రత్యేకమైన ట్రాకింగ్ వ్యవస్థతో పనిచేసే ఈ గాడ్జెట్ మీ బేబీకి సంబంధించి శ్వాస తీరుతో పాతు కదిలికలను మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Trackers And Apps That Can Make Your Life So Much Better. Read more in Telugu Gizbots....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot