10 ఎంఎస్ ఎక్సల్ ట్రిక్స్

Posted By:

కంప్యూటర్‌ను వినియోగించే వారిలో చాలామంది తమతమ అవసరాలను బట్టి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఫీచర్లను తరచూ ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని వాడే సమయంలో మెనూలోకి ప్రవేశించేందుకు ప్రతిసారీ మౌస్‌ను ఆశ్రయంచటం కంటే అందుబాటలో ఉన్న కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించటం ద్వారా పని మరింత వేగవంతంగా సాగుతుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఎంఎస్ ఎక్సెల్‌కు సంబంధించి పలు ముఖ్యమైన ట్రిక్‌లను మీముందుకు తీసుకువస్తున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 ఎంఎస్ ఎక్సల్ ట్రిక్స్

సాధారణంగా ఫైల్‌లోని డేటాను మొత్తం సెలక్ట్ చేసుకునేందుకు Ctrl + A షార్ట్ కట్ ను ఉపయోగిస్తాం. ఎంఎస్ ఎక్సల్ పేజీలో మొత్తం డేటాను సెలక్ట్ చేసేందుకు ఈ స్ర్కీన్ షాట్‌లో చూపించిన విధంగా కార్నర్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే డేటా మొత్తం సెలక్ట్ అవుతుంది.

10 ఎంఎస్ ఎక్సల్ ట్రిక్స్

ఎంఎస్ ఎక్సల్ ఫైళ్లను బల్క్‌గా ఓపెన్ చేయాలంటే

ఎంఎస్ ఎక్సల్ ఫైళ్లను బల్క్‌గా ఓపెన్ చేయాలంటే ముందుగా ఫైళ్లను సెలక్ట్ చేసుకుని ఆ తరువాత ఎంటర్ బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోతుంది.

 

10 ఎంఎస్ ఎక్సల్ ట్రిక్స్

ఒక ఎక్సల్ ఫైల్ నుంచి మరొక ఎక్సల్ ఫైల్‌కు

ఒకే సారి అనేక ఎక్సల్ ఫైళ్లను ఓపెన్ చేసారు. ఈ క్రమంలో ఒక ఫైల్ నుంచి మరొక ఫైల్‌కు మారేందుకు Ctrl + Tab కమాండ్‌ను అమలు చేస్తే చాలు.

 

10 ఎంఎస్ ఎక్సల్ ట్రిక్స్

కొత్త షార్ట్‌కట్ మెనూను క్రియేట్ చేయాలంటే

సాధారణంగా ఎంఎస్ ఎక్సల్ షీట్ మెనూ పై భాగంలో మూడు షార్ట్ కట్‌ల మనుక కనిపిస్తాయి. అవి.. సేవ్(Save), అండూ టైపింగ్ (Undo Typing), రిపీట్ టైపింగ్ (Repeat Typing). ఈ షార్ట్ కట్‌ల సంఖ్యను మరింతగా పెంచుకోవాలంటే. ఫైల్ మెనూలోని ఆప్షన్స్ లోకి ప్రవేశించి క్విక్ యాక్సెస్ టూల్‌ బార్‌లోకి వెళ్లి కట్, కాఫీ ఆప్షన్‌‍లను జోడించండి.

 

10 ఎంఎస్ ఎక్సల్ ట్రిక్స్

ఒక సెల్‌కు వికర్ణ లైన్‌ను జోడించవల్సి వస్తే

ఎంఎస్ ఎక్సల్‌లో క్లేస్ మేట్ అడ్రస్ లిస్ట్‌ను ఎంటర్ చేస్తున్న సమయంలో ఒక సెల్‌కు వికర్ణ లైన్ ను (Diagonal Line) జోడించవల్సి వచ్చింది. ఏం చేస్తారు..? హోమ్ మెనూలోని ఫాంట్స్ లోకి ప్రవేశించటం ద్వారా బోర్డర్స్ ను నచ్చినట్లు మార్చుకోవచ్చు.

 

10 ఎంఎస్ ఎక్సల్ ట్రిక్స్

కొత్త కాలమ్‌ను జత చేయాలంటే

కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + = (ఈక్వల్ కీ) ఫలితం : ఈ కీబోర్ షార్ట్‌కట్‌ ద్వారా ఎక్సెల్ స్ర్పెడ్‌షీట్‌లో అవసరమైన చోట కొత్త కాలమ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

 

10 ఎంఎస్ ఎక్సల్ ట్రిక్స్

సెల్స్ లోని డేటాను వేగవంతంగా తరలించాలంటే

10 ఎంఎస్ ఎక్సల్ ట్రిక్స్

ఖాళీ సెల్స్‌ను వేగంగా డిలీట్ చేయాలంటే
కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + -(మైనస్ కీ)
ఫలితం : ఈ కీబోర్డ్ షార్ట్‌కట్‌ ద్వారా ఎక్సెల్ స్ర్పెడ్‌షీట్‌లో అవసరం‌లేని కాలమ్‌ను డిలీట్ చేసుకోవచ్చు.

10 ఎంఎస్ ఎక్సల్ ట్రిక్స్

కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + `
ఫలితం : ఫార్ములాలను డిస్‌ప్లే చేస్తుంది.

కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + ↑

ఫలితం : షీట్‌లోని ప్రారంభ సెల్‌కు తీసుకువెళుతుంది.

కీబోర్డ్ షార్ట్‌కట్ : CTRL + ↓ ఫలితం : షీట్‌లోని ముగింపు సెల్‌కు తీసుకువెళుతుంది.

 

10 ఎంఎస్ ఎక్సల్ ట్రిక్స్

కీబోర్డ్ షార్ట్‌కట్ : ALT + =
ఫలితం : ఈ కీబోర్ షార్ట్‌కట్‌ ఎక్స్‌ఎల్ షీట్‌లోని గణాంకాలను స్వయంచాలకంగా లెక్క కట్టి ఫలితాన్ని సంబంధింత కాలమ్‌లో ప్రదర్శిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Tricks That Can Make Anyone An Excel Expert . Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot