స్మార్ట్‌ఫోన్ అరచేతిలో ఉంటే!!

Posted By:

స్మార్ట్‌ఫోన్ అరచేతిలో ఉంటే చాలు సమస్త కమ్యూనికేషన్ ప్రపంచం మీ ముంగిట ఉన్నట్టే. అత్యాధునిక సమాచార వ్యవస్థతో మినీ సూపర్ కంప్యూటర్‌లను తలపిస్తోన్న నేటి ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనాల జాబితాలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. స్మార్ట్‌ఫోన్‌లకు మరింత సాంకేతికతను జోడిస్తూ ప్రపంచానికి ఉపయోగపడే విధంగా శాస్త్రవేత్తలు అభివృద్థి చేసిన 10 ఆసక్తికర ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More: ఆ క్షణం.. ప్రపంచం నివ్వెరపోయింది!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్‌లను పొల్యూషన్ మానిటర్లుగా ఉపయోగించుకునేందుకు కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు సరికొత్త యాడ్-ఆన్‌ను అభివృద్థి చేసారు. ఈ ఫీచర్ ద్వారా ఎయిర్ పొల్యూషన్‌ను మానిటర్ చేసుకోవచ్చు.

UCLAకు చెందిన శాస్త్రవేత్తలు స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకునే విధంగా ఓ సరికొత్త పోర్టబుల్ మైక్రోస్కోప్‌ను అభివృద్థి చేసారు. ఈ మైక్రోస్కోప్ ద్వారా వైరల్ లోడ్స్‌ను లెక్కించవచ్చు.

 

భూకంపాలకు సంబంధించి అలర్ట్‌లను మీ స్మార్ట్‌ఫోన్‌లను తెలుసుకునేందుకు MEMS యాక్సిలరోమీలర్ పేరుతో సరికొత్త చిప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్థి చేసారు

అనేక మెడికల్ అవసరాలను తీర్చే విధంగా స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లలను శాస్త్రవేత్తలు అభివృద్థి చేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వాతావరణ వివరాలను తెలుసుకునేందుకు ప్రత్యేకమైన యాప్స్ రూపుదిద్దుకుంటున్నాయి.

రిసెర్చర్లు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఫీల్డ్ డేటా కలెక్షన్‌లను సేకరించేందుకు ప్రత్యేకమైన యాప్స్‌ను నిపుణులు డిజైన్ చేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ శాటిలైట్ వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్థి చేస్తున్నారు.

క్రౌడ్ సోర్సింగ్ సైన్స్‌లోనూ స్మార్ట్‌ఫోన్‌ల పాత్ర కీలకం కాబోతోంది.

మనిషి మానసిక స్థితిగతులను అంచనా వేయటంలోనూ స్మార్ట్‌ఫోన్‌ల పాత్ర కీలకం కాబోతోంది. ఇందకు సంబంధించి సైకాలజిస్ట్‌లు ప్రత్యేకమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 

క్లౌడ్ కంప్యూటింగ్ స్మార్ట్‌ఫోన్ రూపురేఖలనే మార్చేయంనుంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Ways Scientists Are Using Your Smartphone To Save The World. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot