Home
News

ఫోన్ సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ ఫ్రీగా మాట్లాడటం ఎలా ?

మీరు అర్జంటుగా ఎవరికైనా ఫోన్ చేయాలనుకోండి. అక్కడ మీకు సిగ్నల్ వీక్ అనిపిస్తే ఎక్కడ లేని చిరాకు వస్తుంది. కాల్ మాట్లాడుతున్నప్పడు వాయిస్ వినిపించకపోవడం లాంటి సమస్యలు ఎదురైతే ఇక చెప్పనే అవసరం లేదు. సాధారణంగా నెట్‌వర్క్ సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడటం చాలా కష్టమవుతూ ఉంటుంది.

ఫోన్ సిగ్నల్స్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్ ఫ్రీగా మాట్లాడటం ఎలా ?

అదే చాలా ముఖ్యమైన కాల్ అయితే మనకు ఎక్కడ లేని విసుగు వస్తుంది. సిగ్నల్స్ వీక్ అని మనకు ఎటువంటి అలర్ట్స్ లేకుండానే ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి. సిగ్నల్ వీక్ సమస్యను పరిష్కరించుకునేందుకు పలు సింపుల్ ట్రిక్స్ మీకోసం..

ఫోన్ బ్యాటరీ

ఫోన్ బ్యాటరీ

మీ ఫోన్ నెట్‌వర్క్ సిగ్నల్ బాగుండాలంటే, మీ ఫోన్ బ్యాటరీ కూడా బలంగానే ఉండాలి. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువుగా ఉన్న ఫోన్‌లతో పోలిస్తే తక్కువ ఛార్జింగ్ ఉన్న ఫోన్‌లలో నెట్‌వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉంటున్నట్లు కొన్ని సందర్భాల్లో రుజువైంది. నెట్‌వర్క్ సిగ్నల్‌కు ఫోన్ బ్యాటరీ చాలా అవసరం కాబట్టి, ఫోన్ బ్యాటరీని ఎప్పుటికప్పుడు ఫుల్ ఛార్జ్‌తో ఉంచుకోవటం మంచిది. ఫోన్ బ్యాటరీ ఆదా అవ్వాలంటే వై-ఫై, బ్లుటూత్, NFC తదితర కనెక్టువిటీ ఆప్షన్ లను అవసరంలేనపుడు స్విచాఫ్ చేసి ఉంచండి

 landscape position

landscape position

మీరు ఫోన్‌ను హోల్డ్ చేసి ఉంచే దానిబట్టి కూడా నెట్‌వర్క్ సిగ్నల్ అనేది మారుతుంటుంది. మీరు ఫోన్‌ను landscape positionలో పట్టుకుని ఉన్నట్లయితే సెల్ టవర్ నుంచి అందే సిగ్నల్స్‌ను మీ ఫోన్‌ యాంటెనా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. ఫోన్‌ను upright positionలో పట్టుకుని ఉండటం ద్వారా సిగ్నల్ బాగా అందే అవకాశం ఉంటుంది.

3జీ నుంచి 2జీకి

3జీ నుంచి 2జీకి

మీ ఫోన్ సిగ్నల్స్ బాగా వీ‌క్‌గా ఉన్న సమయంలో మీరు 3జీ నుంచి 2జీకి మీ ఫోన్ సెట్టింగ్ మార్చుకోండి. దీని వల్ల మీ వాయిస్ సిగ్నల్స్ కొంచెం బాగా వచ్చే అవకాశం ఉంటుంది. 2జీ అనేది అన్ని చోట్ల పాతుకుపోయి ఉంటుంది. అయితే 3జీ మాత్రం కొన్ని చోట్ల మాత్రమే వస్తూ ఉంటుంది. దీని వల్ల సిగ్నల్స్ ప్రాబ్లం వస్తుంది.

సిగ్నల్ బూస్టర్

సిగ్నల్ బూస్టర్

సిగ్నల్ బూస్టర్ పెట్టుకోవడం వల్ల సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో మీకు మరింతగా సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటుంది.వై-ఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవటం ద్వారా నెట్‌వర్క్ సిగ్నల్ సమస్యలను నిరోధించవచ్చు. వై-ఫై తరహాలోనే Femtocells కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి మీ ల్యాండ్‌లైన్ ఇంటర్నెట్‌ను సెల్యులార్ సిగ్నల్స్‌గా మార్చేసి, మీ ఫోన్‌కు బలమైన నెట్‌వర్క్‌ను ఆఫర్ చేస్తాయి.

అటూ ఇటూ కదలకూడదు

అటూ ఇటూ కదలకూడదు

మీరు ఫోన్ మాట్లాడుతున్న సమయంలో అటూ ఇటూ కదులుతూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. అలా చేయడం వల్ల సిగ్నల్స్ వీక్ అయి కాల్ కట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కదలకుండా ఓ చోట నుండే మాట్లాడటం మంచిది.

కేస్ రిమూవ్

కేస్ రిమూవ్

మీ ఫోన్ కి ఏదైనా కవర్ వేసి ఉంటే సిగ్నల్స్ వీక్ గా ఉన్న సమయంలో దాన్ని తొలగించండి. అలా చేయడం ద్వారా మీ సిగ్నల్స్ పెంచుకునే అవకాశం ఉంది. అలాగే ఫోన్ కి ఉన్న యాంటెన్నాని మీరు చేతితో పట్టుకోకండి. అలా చేయడం ద్వారా మీరు వస్తున్న సిగ్నల్స్ ని కూడా కోల్పోయే అవకాశం ఉంది.

లోకేషన్ ఛేంజ్

లోకేషన్ ఛేంజ్

మీకు కనుక ఫోన్లో సిగ్నల్స్ వీక్ గా ఉన్నట్లు కనిపిస్తుంటే వెంటనే అక్కడి నుంచి ఇంకో లోకేషన్ కి వెళ్లడం మంచిది. అక్కడ మీకు మెరుగైన సిగ్నల్ రావచ్చు. కాబట్టి మీరు లోకేషన్ మార్చుతూ ఉండటం వల్ల మీ ఫోన్ సిగ్నల్స్ మరింతగా పెంచుకునే అవకాశం ఉంది.

వైఫై

వైఫై

ఫోన్ సిగ్నల్స్ రాని సమయంలో వైఫై ఉపయోగించండి. వైఫై ద్వారా కాల్స్ చేయడం వల్ల ఫోన్ ఎటువంటి అంతరాయం లేకుండా కాల్స్ సెండ్ చేస్తుంది. కాబట్టి ఫోన్ సిగ్నల్స్ వీక్ గా ఉన్న సమయంలో కాల్ చేస్తున్నట్లయితే వైఫై ఉపయోగించండి.

Best Mobiles in India

English summary
how to improve your cell phone signal easily .Here 10 ways to improve cell phone reception without signal booster
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X