Home
News

స్మార్ట్‌ఫోన్ మీ ఆరోగ్యాన్ని ఇలా చంపేస్తుంది !

By Hazarath

ఈ రోజుల్లో సెల్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో కామన్ అయిపోయింది. 24 గంటలూ సెల్‌ఫోన్ తోనే కాలం గడిపేస్తున్నారు. అయితే ఫోన్లు వాడటం చాలా ప్రమాదనమని ఇప్పటికే చాలామంది డాక్టర్లు చెబుతున్నారు. అపరిమితంగా ఫోన్ వాడటం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ సెల్‌ఫోన్‌తో మీరు ఎటువంటి అనారోగ్యాలను కొని తెచ్చుకుంటారో ఓ సారి మీరే చెక్ చేసుకోండి.

శాంసంగ్ ఎస్6 ఎడ్జ్ కొనండి: దుబాయ్ ఉచితంగా వెళ్లిరండి

మీ చేతులకు చాలా ప్రమాదం

మీ చేతులకు చాలా ప్రమాదం

సెల్‌ఫోన్‌తో మెసేజ్‌ టైపింగ్‌ అనేది ఒక కళ. చకచక మునివేళ్లను టచ్‌పాడ్‌పై కదలాడిస్తూ టైప్ చేయడం యూత్‌ అలవాటుగా మారుతోంది. కానీ ఇలా ముని వేళ్లను నిరంతరంగా విరామం లేకుండా టైప్‌ చేస్తూ పోతే మోచేతి నరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. నిత్యం గేమ్స్‌ ఆడే వారిలో మోచేతి నరాలు వాచిపోయే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. 

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెన్నునొప్పి

వెన్నునొప్పి

సెల్‌ఫోన్‌ లో గంటల తరబడి టెక్స్ట్‌ మెసేజెస్‌ పంపడానికి కేటాయిస్తాం. అలాగే గేమింగ్‌ కోసం కూడా మనం కీ పాడ్‌ను తరచూ వాడుతుంటాం అయితే టెక్ట్స్‌ మెసేజెస్‌ పంపే సమయంలో మనం తలను కదిలిస్తుంటాం. అయితే ఇలా తరచూ చేయడం వల్ల మెడ నరాలు మీ వెన్నుపై ఒత్తిడి కలుగజేస్తాయని వైద్యులు అంటున్నారు. ఈ ఒత్తిడి ఎంతలా ఉంటుంది అంటే సుమారు 60 పౌండ్ల బరువును మీ మెడపై వేసినంత ఉంటుందని పరిశోధనల్లో తేలింది. 

కంటి మంటే, తలపోటు

కంటి మంటే, తలపోటు

ఫోన్‌లలో ఉండే చిన్న ఫాంట్‌ అక్షరాలను అలాగే తదేకంగా చూడటం వల్ల కంటి సమస్యలు వస్తాయి. అలాగే తరచూ సెల్‌ఫోన్‌ వాడటం వల్ల తలనొప్పి కూడా వస్తుంది. చూపు మందగించడంతో పాటు ముఖకండరాలు పట్టేయడంతో తలనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నిద్రలేమి

నిద్రలేమి

మీ సెల్‌ఫోన్‌ మీకు నిద్రలేని రాత్రులు మిగిల్చడం ఖాయమనే అంటున్నారు శాస్త్రవేత్తలు. రాత్రి పూట సెల్‌ఫోన్‌ నుంచి వెలువడే కాంతిని ఎక్కువగా చూడటం వల్ల నిద్రలేమి వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా శరీరంలో మెలటోనిన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. మెలటోనిన్‌ మీ నిద్రకు ఉపకరిస్తుంది. మెలటోనిన్‌ లోపం వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌, పేగు క్యాన్సర్‌, ప్రోస్టెట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఒత్తిడి

ఒత్తిడి

మీ స్మార్ట్‌ ఫోన్‌ స్మార్ట్‌గా మీ ఒత్తిడి స్థాయిని పెంచుతుంది. నిరంతరం ఫోన్‌తోనే మమేకం అయి ఉండటం వల్ల మీలో ఆత్రుత, కోపం, నిస్పృహ పెరిగిపోతుంది. ఫలితంగా మీలో ఒత్తిడి పెరిగిపోతుంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోడ్డు యాక్సిడెంట్లు

రోడ్డు యాక్సిడెంట్లు

సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వారు 23 శాతం చొప్పున తగ్గిపోతున్నారని పరిశోధనలు తేల్చాయి.

టాయ్‌లెట్‌ సీట్‌ కన్నా పది రెట్లు అపరిశుభ్రమైనది

టాయ్‌లెట్‌ సీట్‌ కన్నా పది రెట్లు అపరిశుభ్రమైనది

ఈ విషయం వింటేనే ఒళ్లు గగుర్పాటు కలుగుతుంది. కానీ ఇది నిజం. ముఖ్యంగా చేతులకి ఉండే మురికి అంతా సెల్‌ఫోన్‌కే అంటుకుంటుంది. అంతేకాదు ముఖ్యంగా జలుబు, జ్వరం వచ్చినప్పుడు సెల్‌ఫోన్‌ వాడినప్పుడు రోగ క్రిములు సెల్‌ ఫోన్‌పై నిక్షిప్తమై, మనకు మళ్లీ రోగాన్ని తిరగతోడుతాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గర్భస్త శిశువుకు ఫోన్‌ అత్యంత ప్రమాదకరం

గర్భస్త శిశువుకు ఫోన్‌ అత్యంత ప్రమాదకరం

ఈ విషయం నిజమే. నిరూపించబడింది. ముఖ్యంగా గర్భస్రావం జరిగేంత దుష్పరిణామాలు సెల్‌ ఫోన్‌ వల్ల సంభవిస్తాయని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు.

నాడీ మండలం పై ప్రభావం

నాడీ మండలం పై ప్రభావం

సెల్‌ఫోన్‌ నుంచి వెలువడే హానికరమైన రేడియేషన్‌ ఏకంగా మీ డీఎన్‌ఏ కణాలనే ధ్వంసం చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఫలితంగా నాడిమండల వ్యాధులు వస్తాయంటున్నారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుండెపోటుకు కారణం

గుండెపోటుకు కారణం

యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆంకాలజీ రిపోర్టు ప్రకారం సెల్‌ ఫోన్‌ రేడియేషన్‌ గుండెకు హానికరమని తేల్చింది. అంతేకాదు రక్తహీనతకు సైతం గురయ్యే ప్రమాదం ఉంది.

చెవుడు

చెవుడు

మీరు కంటిన్యూగా రెండు నుంచి మూడు గంటలు సెల్‌ఫోన్‌లో మాట్లాడితే వినికిడి శక్తి నెమ్మదిగా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పేలుడు పదార్థం

పేలుడు పదార్థం

 నిజమే.. పలు సందర్భాల్లో సెల్‌ఫోన్‌లు పేలి పలువురు మరణించిన దాఖలాలు సైతం ఉన్నాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
10 Ways Your Cellphone Is Screwing With Your Body and Mind red more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X