జియోని వణికిస్తున్న కొత్త కంపెనీ, రూ. 20కే 1జిబి డేటా

By Hazarath
|

టెలికం మార్కెట్లోకి దూసుకువచ్చిన అతి తక్కువ కాలంలోనే దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన జియోని వణికించేందుకు కొత్త కంపెనీ రెడీ అవుతోంది. అతి తక్కువ ధరలకు డేటాను వినియోగదారులకు అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతున్న జియోకి ఈ స్టార్టప్ కంపెనీ భారీ షాక్ ఇచ్చేలా ఉందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

ఫోన్‌కి ప్రింటర్ తగిలించి ఫోటోలను ప్రింట్ తీసుకోండిఫోన్‌కి ప్రింటర్ తగిలించి ఫోటోలను ప్రింట్ తీసుకోండి

రూ.52 కాదు రూ.20కే 1జీబీ హై స్పీడ్ మొబైల్ డేటా

రూ.52 కాదు రూ.20కే 1జీబీ హై స్పీడ్ మొబైల్ డేటా

జియో ప్రస్తుతం 1 జీబీ డేటా ప్యాక్‌కు వసూలు చేస్తున్న చార్జి రూ.52గా ఉందని తెలిసిందే. అయితే ఇంతకన్నా తక్కువ ధరకు..అంటే.. కేవలం రూ.20కే అక్కడ 1జీబీ హై స్పీడ్ మొబైల్ డేటా లభిస్తున్నది. అయితే ప్రస్తుతం ఇది బెంగుళూరులో మాత్రమే అందుబాటులో ఉంది.

వైఫై డబ్బా

వైఫై డబ్బా

బెంగుళూరులో 'వైఫై డబ్బా' అనే స్టార్టప్ కంపెనీ అతి తక్కువ ధరకే వినియోగదారులకు ఇంటర్నెట్‌ను అందిస్తున్నది. రూ.2కు 100 ఎంబీ, రూ.10కి 500 ఎంబీ, రూ.20కి 1 జీబీ డేటా లభిస్తుంది. వీటి వాలిడిటీ 24 గంటలు.

వైఫై డబ్బా ప్రీ పెయిడ్ టోకెన్లను..
 

వైఫై డబ్బా ప్రీ పెయిడ్ టోకెన్లను..

ఈ డేటాను ఉపయోగించుకోవాలనుకునే వారు స్థానికంగా టీస్టాల్స్, కిరాణా షాపులు, పాన్ డబ్బాలు, ఇతర షాపుల్లో వైఫై డబ్బా ప్రీ పెయిడ్ టోకెన్లను తీసుకోవాలి. వాటిని కొన్నాక వైఫై డబ్బా హాట్ స్పాట్ ఉన్న ప్రాంతంలో ఫోన్ ద్వారా వైఫైకు కనెక్ట్ అవ్వాలి.

ఓటీపీ వెరిఫికేషన్

ఓటీపీ వెరిఫికేషన్

ఈ క్రమంలో ఫోన్‌లో ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఓపెన్ చేస్తే సదరు వైపై డబ్బా లాగిన్ పేజీ వస్తుంది. అందులో వినియోగదారుడు తన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలి.

లాగిన్ అయితే చాలు

లాగిన్ అయితే చాలు

అది పూర్తయ్యాక తాను కొన్న ప్రీపెయిడ్ టోకెన్‌లో ఉన్న కోడ్‌ను వెబ్ పేజీలో ఎంటర్ చేసి లాగిన్ అయితే చాలు, 24 గంటల పాటు మొబైల్ డేటా వాడుకోవచ్చు.

శుభేందు శర్మ, కరం లక్ష్మణ్ అనే ఇద్దరు వ్యక్తులు..

శుభేందు శర్మ, కరం లక్ష్మణ్ అనే ఇద్దరు వ్యక్తులు..

వైఫై డబ్బా స్టార్టప్ కంపెనీని శుభేందు శర్మ, కరం లక్ష్మణ్ అనే ఇద్దరు వ్యక్తులు 13 నెలల కిందట బెంగుళూరులో ప్రారంభించారు. ఈ క్రమంలో ఆ నగరంలో అనేక ప్రాంతాల్లో వారు వైఫై డబ్బా పేరిట తమ కంపెనీకి చెందిన వైఫై రూటర్లను ఏర్పాటు చేశారు. అవి ఇప్పుడు 350 వరకు చేరుకున్నాయి.

మిగిలిన ప్రాంతాల్లోనూ వైఫై డబ్బాలు..

మిగిలిన ప్రాంతాల్లోనూ వైఫై డబ్బాలు..

త్వరలో మిగిలిన ప్రాంతాల్లోనూ వైఫై డబ్బాలు (రూటర్లు) ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా యూజర్ వైఫైకు కనెక్ట్ అయితే గరిష్టంగా 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ పొందవచ్చు. పూర్తిగా ఫైబర్ ఆప్టికల్ నెట్‌వర్క్‌తో వైఫై డబ్బాలు పనిచేస్తాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
100 MB internet for Rs 2: This startup wants to beat Jio at its own game Read more News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X