1.1 కోట్లకు చేరిన మొబైల్ నెంబర్ పోర్టబులిటీ(ఎంఎన్‌పీ) యూజర్లు

Posted By: Staff

1.1 కోట్లకు చేరిన మొబైల్ నెంబర్ పోర్టబులిటీ(ఎంఎన్‌పీ) యూజర్లు

న్యూఢిల్లీ: నంబర్ మారకుండా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ)ద్వారా ఆపరేటర్‌ను మార్చుకున్న వినియోగదారుల సంఖ్య గత ఎనిమిది నెలల్లో దాదాపు 1.1 కోట్లుగా నమోదయ్యింది. ఏప్రిల్‌లో 85 లక్షలుగా ఉన్న ఈ సంఖ్య జూన్ రెండవ వారానికి 1.1 కోట్లకు దాటిపోయింది.

సీడీఎంఏ ఆపరేటర్ల నుంచి అధిక సంఖ్యలో వినియోగదారులు జీఎస్‌ఎం ప్లాట్‌ఫామ్‌కు మారారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్ (టీటీఎస్‌ఎల్) నుంచి అధిక సంఖ్యలో వినియోగదారులు వేరొక ఆపరేటర్‌ను ఎంచుకున్నారు. నెట్‌వర్క్‌ను మార్చిన వారిలో ఆర్‌కామ్ సీడీఎంఏ వినియోగదారులు 6 లక్షల మంది కాగా, జీఎస్‌ఎంకు సంబంధించి ఈ సంఖ్య 4.5 లక్షలుగా ఉంది.

టీటీఎస్‌ఎల్ తన సీడీఎంఏ నెట్‌వర్క్ నుంచి 4.5 లక్షలమంది వినియోగదారులను కోల్పోయింది. అయితే సంస్థ జీఎస్‌ఎం నెట్‌వర్క్ 1.5 లక్షల మంది ఎంఎన్‌పీ ద్వారా సంపాదించుకుంది. ఎంఎన్‌పీ ద్వారా వొడాఫోన్ అత్యధికంగా లాభపడింది. 10 లక్షల మందికిపైగా యూజర్లను వొడాఫోన్ ఆకర్షించింది. తర్వాత వరుసలో ఐడియా(8.7లక్షలు), భారతీ ఎయిర్‌టెల్(6.3లక్షలు) ఉన్నాయి. ఎయిర్‌సెల్ 73,000 మందిని ఆకర్షించింది. ఎంఎన్‌పీకి సంబంధించి జీఎస్‌ఎం ఆపరేటర్ల మధ్య గట్టి పోటీ పరిస్థితులు ఏర్పడ్డాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot