యాపిల్ వాచ్ గురించి షాకింగ్ నిజాలు

Posted By:

యాపిల్ తన మొదటి స్మార్ట్‌వాచ్ ‘యాపిల్ వాచ్'ను ఎంపిక చేసిన మార్కెట్లలో విడుదల చేసిన విషయం తెలిసిందే. విప్లవాత్మక ఫీచర్లతో ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌వాచ్‌ మరి కొద్ది నెలల్లో భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. యాపిల్ వాచ్ రెండు సైజులలో లభ్యంకానుంది. ఒకటి 30 మిల్లీమీటర్ల సైజ్ వేరియంట్ కాగా మరొకటి 42 మిల్లీమీటర్ల సైజ్ వేరియంట్.

ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన టాప్టిక్ ఇంజిన్ వాచ్‌కు నోటిఫికేషన్ అందిన ప్రతిసారి ఓ నిగూఢమైన వైబ్రేషన్‌ను కలగజేస్తుంది. యాపిల్ వాచ్ మొత్తం మూడు ఎడిషన్‌లలో అందుబాటులోకి రానుంది. వాటి వివరాలు.. యాపిల్ వాచ్, యాపిల్ వాచ్ స్పోర్ట్స్, యాపిల్ వాచ్ ఎడిషన్. యాపిల్ వాచ్‌కు సంబంధించి 10 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు. (ఇంకా చదవండి: వాట్సాప్‌ను జీవితాంతం ఉచితంగా వాడుకోవాలంటే..?)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అల్బర్ట్ లీ అనే యాపిల్ ఇన్‌సైడర్ రీడర్ తెలిపిన వివరాల మేరకు యాపిల్ వాచ్ చార్జర్ తన మోటో 360 స్మార్ట్‌వాచ్‌ను ఛార్జ్ చేసుకునేందుకు ఉపయోగపడిందట. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ స్టాండర్డ్ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

ఓ టెస్ట్‌లో భాగంగా ఇతర క్యూఐ చార్జర్‌ల ద్వారా యాపిల్ వాచ్‌ను చార్జ్ చేసే ప్రక్రియ ఏ మాత్రం విజయంవంతం కాలేదట. ఇందుకు కారణం యాపిల్ వాచ్ ఇతర క్యూఐ చార్జ్‌లను సపోర్ట్ చేయలేకపోవటమే.

యాపిల్ వాచ్ విడుదలతో యాపిల్ కంపెనీ వైర్‌లెస్ ఛార్జింగ్ గాడ్జెట్‌ల తయారీ విభాగంలోకి అడుగుపెట్టినట్లయింది.

యాపిల్ వాచ్ మీ రక్తంలోని ఆక్సిజన్ స్థాయిను లెక్కబెడుతుంది.

యాపిల్ వాచ్‌లోని కొన్ని భాగాలను సులువుగా మార్చుకోవచ్చు.

యాపిల్ వాచ్, తాజాగా విడుదలైన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లతో పాటు ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5 స్మార్ట్‌పోన్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.

ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్‌వాచ్‌కు ‘డిజిటల్ క్రౌన్' ప్రధాన ఆకర్షణ కానుంది.వాచ్ కుడివైపు భాగంలో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్రౌన్ బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా వాచ్ డిస్‌ప్లేను తాకకుండానే ఆన్ - స్ర్కీన్ యాక్షన్‌లను నిర్విహించుకోవచ్చు. డిజిటల్ క్రౌన్ బటన్ యాపిల్ వాచ్‌కు హోమ్ బటన్ గాను ఉపయోగపడుతుంది. ఈ బటన్ ద్వారానే యాపిల్ వాయిస్ సెర్చ్ ఫీచర్ ‘సిరీ'ని యాక్సెస్ చేసుకోవచ్చు.

 

 

యాపిల్ కంపెనీ స్వయంగా డిజైన్ చేసిన ఎస్‌ఎస్ఐపీ సూక్ష్మ కంప్యూటర్ ఆర్కిటెక్చర్‌ను ఈ వాచ్‌లో ఏర్పాటు చేసారు.

ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్‌లో నిక్షిప్తం చేసిన టాప్టిక్ ఇంజిన్ వాచ్‌కు నోటిఫికేషన్ అందిన ప్రతిసారి ఓ నిగూఢమైన వైబ్రేషన్‌ను కలగజేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
11 Things About The Apple Watch That May Surprise You. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot