Home
News

Youtube ద్వారా నేర్చుకున్న హ్యాకింగ్ ట్రిక్స్ తో సొంత తండ్రిని ముప్పుతిప్పలు పెట్టిన 11-ఏళ్ల బుడ్డోడు

కరోనా మహమ్మారి సమయంలో చాలా రకాల మార్పులు వచ్చాయి. ముఖ్యంగా టెక్నాలజీ వినియోగంలో చాలానే మార్పులు వచ్చాయి. విద్యార్థుల యొక్క తరగతులు కూడా ఆన్‌లైన్ మోడ్‌కు మారాయి. విద్యార్థులు మరియు అభ్యాసకులందరికీ కొత్త విషయాలను నేర్చుకోవడం కోసం యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌ గొప్ప వేదికగా మారింది. ఈ అతి పెద్ద విరామం సయమంలో ఇటువంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను కొంత మంది తమ యొక్క స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోగలిగారు. ఈ సంఘటనలో భాగంగా ఘజియాబాద్‌కు చెందిన 11 ఏళ్ల బాలుడు హ్యాకింగ్ ట్రిక్స్ నేర్చుకోవడానికి యూట్యూబ్‌ను ఉపయోగించి తన సొంత తండ్రి వద్ద నుండి రూ.10 కోట్ల దోపిడీకి పాలుపడ్డాడు.

ఇమెయిల్ అకౌంట్ హ్యాక్

ఇమెయిల్ అకౌంట్ హ్యాక్

సంఘటన వివరాలలోకి వస్తే ఘజియాబాద్ లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తికి తెలియని నెంబర్ నుండి ఫోన్ కాల్స్ అందుకోవడం మొదలైంది. రూ.10 కోట్ల డబ్బు ఇవ్వకపోతే మీ యొక్క ప్రైవేట్ చిత్రాలు మరియు కుటుంబ రహస్యాలు ఇంటర్నెట్‌లో ప్రచురిస్తాము అని నిత్యం బెదిరింపు కాల్స్ అందుకోవడంతో పోలీసులను సంప్రదించిన తరువాత ఈ సంఘటన వెలుగు చూసింది. తన ఇమెయిల్ అకౌంట్ హ్యాక్ చేసి అకౌంట్ నుండి తన ప్రైవేట్ ఫోటోలను దొంగలించి డబ్బు కోసం తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని అతను పోలీసులకు చెప్పాడు.

 

హ్యాకర్ ఫోన్ కాల్స్

హ్యాకర్ ఫోన్ కాల్స్

ఘజియాబాద్ కు చెందిన బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం రంగంలోకి దిగిన పోలీసులు అతని ఇమెయిల్ అకౌంట్ శుక్రవారం (జనవరి 1) హ్యాక్ చేయబడినట్లు గుర్తించారు. హ్యాకర్లు అతని ఫోటోలను యాక్సెస్ చేయడమే కాకుండా తన పాస్‌వర్డ్ మరియు అకౌంటుతో అనుబంధించబడిన అతని ఫోన్ నంబర్‌ను మార్చినట్లు కూడా గుర్తించారు. రూ.10 కోట్లు ఇవ్వాలి అని అంటూ నిరంతర వేధింపులతో కూడిన ఫోన్ కాల్స్ హ్యాకర్ల నుండి లభిస్తున్నట్లు గమనించారు.

హ్యాకర్ IP అడ్రస్

హ్యాకర్ IP అడ్రస్

పోలీసులు ఈ కేసును జాగ్రత్తగా దర్యాప్తు చేయడంతో వివరాలు తెలుసుకొని షాకింగ్ కు గురిఅయ్యారు. హ్యాకర్ల యొక్క IP అడ్రస్ ఆధారంగా నిందితులు బాధితుడి ఇంటి వద్దనే ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అలాగే బాధితుని కుటుంబానికి చెందిన దగ్గరి వారే బెదిరింపు ఇమెయిల్ పంపినట్లు స్పష్టత ఇచ్చింది. పోలీసు విచారణ ప్రక్రియను ప్రారంభించగానే పక్క కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలుడు ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో కనుగొన్నారు.

సైబర్ క్రైమ్ టెక్నాలజీ

సైబర్ క్రైమ్ టెక్నాలజీ

ఘజియాబాద్‌కు చెందిన 11 ఏళ్ల బాలుడు 5 వ తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. సైబర్ క్రైమ్‌లో చిక్కుకోకుండా ఎలా ఉండాలనే దానిపై ఆన్‌లైన్ సెషన్‌కు బాలుడు హాజరయ్యాడు. సైబర్ క్రైమ్ టెక్నాలజీని నేర్చుకోవటానికి అతను క్రమం తప్పకుండా యూట్యూబ్‌లో ఆన్‌లైన్ వీడియోలను చూసేవాడు అని తెలిపారు. ఈ బాలుడి మీద క్రిమినల్ బెదిరింపు, శాంతిని ఉల్లంఘించడానికి ఉద్దేశపూర్వకంగా అవమానించడం వంటి ఐటీ చట్టంలోని సెక్షన్ 66D వివిధ విభాగాల కింద కేసు నమోదైంది.

Best Mobiles in India

English summary
11-year-old Boy Threatened His own Father With Hacking Tricks Technology
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X