టెక్ దిగ్గజాలకు సవాల్ విసిరిన 11 ఏళ్ల కుర్రాడు, ఖంగుతిన్న అమెరికా !

|

కేవలం 11 ఏళ్ల కుర్రాడు అగ్రదేశం అమెరికా ఎన్నికల ఫలితాలను మార్చేశాడు అంటే ఎవరైనా నమ్మగలరా. కానీ ఇది నిజంగా నిజమే.. అత్యంత పటిష్ఠ భద్రతా వ్యవస్థ కలిగిన అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఎన్నికల ఫలితాల ‌సైట్‌ను పోలిన నకలు వెబ్‌సైట్‌ని తయారుచేసి ఆ ఎన్నికల ఫలితాను మార్చేశాడు! టెక్‌ దిగ్గజాలే గంటలు, రోజులపాటు కష్టించి మరీ చేయగలిగిన పనిని ఈ 11 ఏళ్ల విద్యార్థి నిమిషాల వ్యవధిలో చేసి ఔరా అనిపించాడు. ఆ కుర్రాడి ఘనతతో అమెరికా ఓటింగ్‌ సైట్ల సమాచారం భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకెళితే..

అమెజాన్‌కు దిమ్మతిరిగింది, భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఉచితంగా..

వోటింగ్‌ విలేజ్‌' పేరిట..
 

వోటింగ్‌ విలేజ్‌' పేరిట..

ఇటీవల లాస్‌ వెగాస్‌లో డెఫ్‌కాన్‌ సెక్యూరిటీ కన్వెన్షన్‌ ‘వోటింగ్‌ విలేజ్‌' పేరిట మూడు రోజులపాటు హ్యాకింగ్‌ కాంపిటీషన్‌ నిర్వహించింది. ఇందులో 6-17 ఏళ్ల మధ్య చిన్నారులు పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.

ఎన్నికల వ్యవస్థలోని లోపాలను..

ఎన్నికల వ్యవస్థలోని లోపాలను..

అమెరికా ఎన్నికల వ్యవస్థలోని లోపాలను ఆయా రాష్ట్రాలకు తెలియజేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఇందులో పాల్గొన్న చిన్నారులు ఆయా వెబ్‌సైట్‌లోని పార్టీ పేర్లు, ఓట్లను మార్చి వేశారు.

11 ఏళ్ల బాలుడు

11 ఏళ్ల బాలుడు

ఓ 11 ఏళ్ల బాలుడు ఎమ్మెట్‌ బ్రెవర్‌ మాత్రం అచ్చం అమెరికాఎన్నికల ఫలితాల వెబ్‌సైట్‌ లాంటి వెబ్‌సైట్‌నే కేవలం 10 నిమిషాల్లో క్రియేట్‌ చేశాడు.

 ఫ్లొరిడా రాష్ట్ర ఎన్నికల విజేత పేరును

ఫ్లొరిడా రాష్ట్ర ఎన్నికల విజేత పేరును

ఏకంగా ఫ్లొరిడా రాష్ట్ర ఎన్నికల విజేత పేరును మార్చేశాడు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను మార్చి వారికి కోట్లాది ఓట్లు పడేటట్లు చేశాడు.

5 అమెరికా రాష్ట్రాల ఎన్నికల వెబ్‌సైట్‌లను
 

5 అమెరికా రాష్ట్రాల ఎన్నికల వెబ్‌సైట్‌లను

దీంతో పాటు 5 అమెరికా రాష్ట్రాల ఎన్నికల వెబ్‌సైట్‌లను చిన్నారులు సులువుగా హ్యాక్‌ చేయడంతో అచ్చం అలాంటి వెబ్‌సైట్‌ పేజీలను రూపొందించడం సైబర్‌ విభాగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

నమూనా వెబ్‌సైట్‌కు అసలు వెబ్‌సైట్‌కు..

నమూనా వెబ్‌సైట్‌కు అసలు వెబ్‌సైట్‌కు..

అయితే, నమూనా వెబ్‌సైట్‌కు అసలు వెబ్‌సైట్‌కు చాలా వ్యత్యాసం ఉంటుందని, ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని అక్కడి అధికారులు కొట్టిపారేస్తున్నారు.

రష్యాపై ఆరోపణలు

రష్యాపై ఆరోపణలు

అసలే ఓవైపు తమ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని, అమెరికా ఎన్నికల వెబ్‌సైట్‌లపై నిఘా పెట్టిందని ఆరోపణలున్నాయి.

అమెరికా కీలక వెబ్‌సైట్‌లను..

అమెరికా కీలక వెబ్‌సైట్‌లను..

ఈ నేపథ్యంలో చిన్నారులు సైతం అమెరికా కీలక వెబ్‌సైట్‌లను తమ నియంత్రంణలోకి తెచ్చుకోవడం, అచ్చం వాటి నకలుగా వెబ్‌సైట్‌లను కేవలం నిమిషాల వ్యవధిలో క్రియేట్‌ చేయడంతో సైబర్‌ నిపుణులు ఖంగుతిన్నట్లు సమాచారం.

బ్రేవర్‌ విజేతగా నిలిచినట్లు..

బ్రేవర్‌ విజేతగా నిలిచినట్లు..

అయితే నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సెక్రటరీస్‌ ఆఫ్‌ స్టేట్‌ మాత్రం ఈ కన్వెన్షన్‌లో వచ్చిన ఫలితాలను స్వాగతించడం గమనార్హం. సైబర్‌ కాంపిటీషన్‌లో బ్రేవర్‌ విజేతగా నిలిచినట్లు ట్విటర్‌ ద్వారా వారు వెల్లడించారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
An 11-year-old changed election results on a replica Florida state more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X