కంప్యూటర్ మేధావి.. (వయసు పదకొండేళ్లే)!

Posted By: Staff

కంప్యూటర్ మేధావి.. (వయసు పదకొండేళ్లే)!

లక్ష్యాన్ని చేధించటానికి వయసుతో పనిలేదన్న వాస్తవాన్ని ఆ బాలా మేధవి మరోసారి రజువు చేశాడు. పట్టదలతో తన కలలను సాకారం చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన పదకొండేళ్ల శివ్ సఖూజా నాలుగు సంవత్సరాల క్రిందటే అంటే 2008లోనే ఓ వెబ్‌సైట్‌కు రూపకల్పన చేసి కంప్యూటర్ మేధావి‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘కంట్రోల్ యువర్ మ్యాక్’ పేరుతో సేవలందిస్తున్న ఈ వెబ్‌సైట్‌లో ఆపిల్ కంప్యూటర్ ‘మ్యాక్’ను ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చన్న వివరాలను శివ్ పొందుపరిచాడు.

మ్యాక్ కంప్యూటర్‌‍ను వినియోగిస్తున్న వారికి సైతం తెలియన కొత్త విషయాలు ఈ సైట్‌లో ఉన్నాయి. మరింత ఆధునీకతను జోడిస్తూ ఈ నాలుగేళ్ల కాలంలో వైబ్‌సైట్‌ను శివ్ మరింత మెరుగుపరిచాడు. అంతేకాదండోయ్.. క్విక్ కాల్, క్విక్ గేమ్స్ర్, క్విక్ మెయిలింగ్ పేరుతో ఈమెయిల్, గేమ్స్ తదితర అప్లికేషన్‌లను కూడా శివ్ రూపొందించి ఆన్‌లైన్‌లో పెట్టాడు. ‘క్విక్ మొయిల్’ను ఆపిల్ సంస్థ ఆమోదించి వాళ్ల వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌కు వీలుగా ఉంచింది. ప్రస్తుతం ఐఫోన్ అప్లికేషన్‌ను తయారు చెయ్యటానికి అవసరమైన కోర్సును నేర్చుకుంటున్నట్లు శివ్ తెలిపారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting