మైక్రోసాఫ్ట్ పెట్టిన భిక్షతో ఆపిల్ బతికుందా..?: కళ్లు చెదిరే నిజాలివే..

By Hazarath
|

మైక్రోసాప్ట్.. టెక్ ప్రపంచంలో మకుటం లేని మహారాజు. అసలు దాని ప్రస్థానమే ఓ సంచలనం. 1970లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అనేక సంచలనాలు నమోదు చేస్తూనే ఉంది. ఇక 90వ దశకంలో అయితే మొత్తం కంప్యూటర్ రంగాన్నే మలుపు తిప్పింది. ఇప్పుడు సత్య నాదెళ్ల నేతృత్వంలో ముందుకు దూసుకెళుతోంది.. మరి దిగ్గజ సంస్థ గురించి ప్రపంచానికి తెలియని అత్యుధ్భుతమైన నిజాలు చాలానే ఉన్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని.

Read more: ఒక్క ఫోన్‌కాల్‌తో రైలు టికెట్ రద్దు: అదే రోజు డబ్బులు

1

1

1997 లో యాపిల్ సంస్థ పెను నష్టాల్లో కూరుకుపోయి దివాలా దిశగా సాగుతున్న వేళ, మైక్రోసాఫ్ట్ అప్పట్లో 150 మిలియన్ డాలర్లు (ప్రస్తుత కరెన్సీలో సుమారు రూ. 1000 కోట్లు) పెట్టుబడిగా పెట్టి ఆదుకుంది

2

2

31 సంవత్సరాల వయసులో ప్రపంచంలోనే అతి తక్కువ వయసున్న బిలియనీర్ గా గుర్తింపు పొందాడు బిల్ గేట్స్. ఆపై ఎనిమిదేళ్ల వయసులోనే 12.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 86 వేల కోట్లు) ఆస్తితో అతిపెద్ద ధనవంతుడిగా నిలిచాడు.

3

3

మైక్రోసాఫ్ట్‌ను‌లో పనిచేస్తూ ఇప్పటివరకు 12 వేల మందికి పైగా మిలియనీర్లుగా మారారు. వారిలో ఇద్దరు బిలియనీర్లయ్యారు. ఇతర టెక్ కంపెనీలకు ఏదీ సాధ్యం కాని విషయం ఇది.

4

4

మైక్రోసాప్ట్ సంస్థ ఆదినాళ్లలో లోగోను తయారు చేయించేందుకు డబ్బులు చెల్లించలేక బిల్ గేట్స్, పాల్ అలెన్‌లే స్వయంగా లోగోను డిజైన్ చేశారు. మధ్యలోని 'ఓ' అక్షరాన్ని వారు 'బిబ్లెట్' (నిక్ నేమ్) అని పిలుచుకునేవారు.

5

5

సిస్టమ్ ఆన్ చేయగానే వస్తే మ్యూజిక్ ను కంపోజ్ చేసింది ప్రముఖ మ్యుజీషియన్ బ్రియాన్ ఎనో. రోలింగ్ స్టోన్స్ ఆల్బమ్ కోసం ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ నుంచి దీన్ని తీసుకున్నారు.

6

6

మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసిన ఎక్సెల్ ప్రోగ్రామ్ ఆ సంస్థకు ఎనలేని ఖ్యాతిని తెచ్చి పెట్టింది. అప్పటివరకూ ఉన్న యాపిల్ విసీ క్లాక్, లోటస్ 1-2-3 తదితరాలు ఎక్సెల్ రాకతో మాయమైపోయాయి.

7

7

మైక్రోసాఫ్ట్ వద్ద ఇప్పుడు 48 వేలకు పైగా పేటెంట్లు ఉన్నాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, 48.313 రకాల పరిశోధనలు, ప్రొడక్టులపై పూర్తి అధికారం మైక్రోసాఫ్ట్ దే. భవిష్యత్తులో టెక్ ప్రపంచంలో సంచలనం రేపుతుందన్న 'హోలో లెన్స్' హెడ్ సెట్ పై హక్కులూ ఈ సంస్థవే.

8

8

1994 లోనే మైక్రోసాఫ్ట్ తొలి స్మార్ట్ వాచ్ ని విడుదల చేసింది. టైమెక్స్ తో కలసి మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసిన దీని పేరు డేటా లింక్ 150. ఇది ప్రపంచపు తొలి స్మార్ట్ ఫోన్, ఆపై 12 ఏళ్లకు యాపిల్ స్మార్ట్ ఫోన్ వచ్చింది.

9

9

1988 లో వాషింగ్టన్ సమీపంలో సుమారు 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మెడీనా ఎస్టేట్ (గేట్స్ పెట్టుకున్న ముద్దు పేరు క్సనాడు 2.0 ( Xanadu 2.0). దీన్ని 2 మిలియన్ డాలర్లకు ఆయన కొన్నారు. ఇప్పుడు దాని విలువ 123 మిలియన్ డాలర్లు.

10

10

మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్న ఉద్యోగులు ప్రతి యేటా దాదాపు 2.3 కోట్ల పానీయాలను ఉచితంగా తాగుతుంటారు. వీటిల్లో ఆత్యధికం పాలు, ఆరంజ్ జ్యూస్ ఉంటాయట.

11

11

తొలి మ్యకింతోష్ కంప్యూటర్ కోసం సంవత్సరాల తరబడి బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ కలిసి పని చేశారు. మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్‌ను ఎనౌన్స్ చేసిన తరువాత వీరిద్దరి మధ్యా దూరం పెరిగింది. ఇరు కంపెనీల మధ్యా వ్యాపార శత్రుత్వం దశాబ్దాలుగా సాగుతోంది.

12

12

మైక్రోసాప్ట్ ఉద్యోగులు కంపెనీ యానిర్సిరీ అప్పుడు ఇలా స్పెషల్ గా తీసుకువస్తారు. ఇవి అందరికీ షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది.

13

13

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write 12 amazing facts you probably didn't know about Microsoft

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X