ఇంటర్నెట్‌ని నవ్వుల్లో ముంచెత్తిన చిత్రాలు

Written By:

2015లో ఇంటర్నెట్ లో హల్ చల్ చేసిన ప్రముఖుల చిత్రాలను ఓ సారి గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్కరికీ నవ్వు రాక మానదు. ప్రధానితో మొదలుకుని రాష్ర్టపతి దాకా అందరి చిత్రాలు ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు విరగబడీ నవ్వారంటే అతిశయోక్తి కాదు. ప్రధాని ఏరియల్ సర్వ మొదలుకుని రాష్ర్టపతి ప్రణబ్ కు అతీంద్రియ శక్తులు ఉన్నట్లు మారపింగ్ చేసిన ఫోటోలు ఓ ఊపు ఊపేశాయి.అవేంటో మీరూ చూడండి.

Read more: 2015లో దుమ్మురేపిన 10 యూట్యూబ్ వీడియోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చెన్నై వరదల సందర్భంగా ప్రధానమంత్రి నరేద్రమోదీ

చెన్నై వరదల సందర్భంగా ప్రధానమంత్రి నరేద్రమోదీ చేపట్టిన ఏరియల్ సర్వే ఫోటో రేపిన దుమారం అంతాఇంతా కాదు. హెలికాప్టర్ నుండి స్పష్టంగా కనిపించని దృశ్యాన్ని కన్పిస్తున్నట్లు రిలీజ్ చేయడంతో నెటీజనులు దీనికి తీవ్రంగా స్పందించారు. ప్రధాని వాషింగ్ మెషిన్‌ను ఆసక్తిగా చూస్తున్నట్లు చేసిన మార్ఫింగ్ ఫోటో నెట్‌లో హల్‌చల్ చేసింది.అలాగే మరికొన్ని ఫోటోలు కూడా హల్ చల్ చేశాయి.

రాష్ట్రపతి భవన్‌ను ప్రజల సందర్శనకు అనుమతించిన సందర్భంగా

ఫిబ్రవరిలో రాష్ట్రపతి భవన్‌ను ప్రజల సందర్శనకు అనుమతించిన సందర్భంగా నల్లని సూట్‌లో ప్రత్యక్షమైన ప్రణబ్ విచిత్రమైన పోజ్‌లు ఇచ్చారు. దీంతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అనేక కామెంట్లతో రాష్ట్రపతి ఫోటోలను రకరకాలుగా వాడుకున్నారు. అందులో అతీంద్రియ శక్తులున్నట్లు ప్రణబ్‌ను చూపించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

అరవింద్ కేజ్రీవాల్‌ను 'మఫ్లర్ మ్యాన్' గా

ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 'మఫ్లర్ మ్యాన్' గా పేర్కొంటు ఆయన మద్దతుదారులు చేసిన ఫోటో‌లు బాగా ఆదరణ పొందాయి. కేజ్రీవాల్ రెండవసారి సీఎం పగ్గాలు చేపట్టిన సందర్భంలో మఫ్లర్ మ్యాన్ రిటర్న్స్ చిత్రాలు సైతం నెట్ జనులను ఆకట్టుకున్నాయి.

మమ్మీ రిటర్న్స్ చిత్రాలు చేసిన హడావిడి

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కోర్టు క్లీన్‌ చిట్ ఇచ్చిన సందర్భంగా మమ్మీ రిటర్న్స్ చిత్రాలు చేసిన హడావిడి నెట్ జనులు మరచిపోలేరు. మదర్స్ డే అనంతరం కోర్టు తీర్పు వెలువడిన రోజును సోషల్ మీడియాలో 'అమ్మా డే' గా పేర్కొనడం విశేషం.

అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో

అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వేసిన యోగాసనాలు మర్చిపోలేనివి. ట్విట్టర్‌‌లో ఆయన యోగా చేస్తున్నట్లున్న ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. మంత్రిగారి యోగాపై పడ్డ సెటైర్లు నెట్ ప్రియులకు మంచి హాస్యాన్ని పంచాయి.

ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమెరికా అధ్యక్షుడు

ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమెరికా అధ్యక్షుడు ఒబామా కలిసినప్పుడు పడిన పంచ్ డైలాగులు

యుఎఈ పర్యటనలో పడిన పంచ్ డైలాగులు

భారత ప్రధాని నరేంద్ర మోడీ యుఎఈ పర్యటనలో పడిన పంచ్ డైలాగులు

టెర్రాకొట్ట మ్యూజియం సందర్శనలో

టెర్రాకొట్ట మ్యూజియం సందర్శనలో మోడీపై పడిన పంచ్ డైలాగులు

పోర్న్ మూవీస్ బ్యాన్ చేసినప్పుడు

మహారాష్ర్ట లో ఆవు మాంసాన్ని తినడం బంద్ చేయమన్నప్పుడు అలాగే పోర్న్ మూవీస్ బ్యాన్ చేసినప్పుడు పడ్డ పంచ్ లు

సోనమ్ కపూర్ డ్రస్ పై

సోనమ్ కపూర్ డ్రస్ పై అనిల్ కపూర్ గురించి పడ్డ పంచ్ లు

సల్మాన్ ఖాన్ కారు హిట్టింగ్ కేసులో

సల్మాన్ ఖాన్ కారు హిట్టింగ్ కేసులో నిర్దోషిగా బయటపడ్డప్పుడు పడిన పంచ్ లు

సల్మాన్ ఖాన్ కారు హిట్టింగ్ కేసులో

సల్మాన్ ఖాన్ కారు హిట్టింగ్ కేసులో నిర్దోషిగా బయటపడ్డప్పుడు పడిన పంచ్ లు

సల్మాన్ ఖాన్ కారు హిట్టింగ్ కేసులో

సల్మాన్ ఖాన్ కారు హిట్టింగ్ కేసులో నిర్దోషిగా బయటపడ్డప్పుడు పడిన పంచ్ లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 12 Indian Memes That Nearly Broke The Internet In 2015
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot