12 ల‌క్ష‌ల స్మార్ట్‌ఫోన్లు సేల్ అయ్యాయి.. ఫెస్టివ‌ల్ సేల్‌లో Samsung రికార్డు!

|

భార‌త్‌లో పండ‌గ సీజ‌న్ సంద‌ర్భంగా ప్ర‌త్యేక సేల్స్‌లో ద‌క్షిణ కొరియా దిగ్గ‌జం Samsung రికార్డు సృష్టించింది. దేశంలో త‌మ ఉత్ప‌త్తుల భారీ విక్ర‌యాల‌ను న‌మోదు చేసుకుంది. అమెజాన్‌మరియు ఫ్లిప్‌కార్ట్‌లలో ఆన్‌లైన్ పండుగ విక్రయాల మొదటి రోజున రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన 12 లక్షల గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. ఈ మేర‌కు సామ్‌సంగ్ ఇండియా ఆదివారం ప్ర‌క‌టించింది. పండుగ సీజన్ విక్రయాల కోసం శాంసంగ్ కంపెనీ త‌మ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను 17 నుంచి 60 శాతం వరకు త‌గ్గించిన విష‌యం తెలిసిందే.

 
Samsung

రూ.1000 కోట్ల మొబైల్ సేల్స్‌:
సామ్‌సంగ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. "ఫెస్టివ‌ల్ సీజ‌న్ సంద‌ర్భంగా ఆన్‌లైన్‌ విక్రయాల్లో తొలి రోజున Samsung రికార్డు సృష్టించింది. భారతదేశంలో 1.2 మిలియన్లకు పైగా గెలాక్సీ పరికరాలను విక్రయించింది. Amazon మరియు Flipkartలో మునుపెన్నడూ చూడని ఆఫర్‌లను కంపెనీ అందించింది. దీంతో ఈ సేల్‌లో Samsung Galaxy స్మార్ట్‌ఫోన్‌లకు అత్యధికంగా డిమాండ్ వ‌చ్చింది. 24 గంటల్లో రూ.1,000 కోట్లకు పైగా విలువ క‌లిగిన శాంసంగ్ గెలాక్సీ డివైజ్‌లు సేల్ అయ్యాయి" అని కంపెనీ పేర్కొంది.

 

ఫెస్టివ‌ల్ సీజ‌న్ సేల్‌లో భాగంగా, Samsung Galaxy S20 FE 5G, Galaxy S22 Ultra, Galaxy S22, Galaxy M53, Galaxy M33, M32 Prime Edition మరియు Galaxy M13 వంటి స్మార్ట్‌ఫోన్‌ల ధరలను కంపెనీ తగ్గించింది. ప్రీమియం Galaxy S22 సిరీస్ కోసం, కంపెనీ 17 నుండి 38 శాతం వ‌ర‌కు డిస్కౌంట్లను ప్రకటించింది.

Samsung

"అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదటి రోజున, Samsung నంబర్ 1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఉంది. Galaxy M13 నంబర్ 1 బెస్ట్ సెల్లర్" అని Samsung తెలిపింది. "ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ మొదటి రోజున, ప్లాట్‌ఫారమ్‌లో మార్కెట్ వాటా రెట్టింపు అయింది." అని కంపెనీ తెలిపింది. కాగా, మార్కెట్ పరిశోధన సంస్థ ఐడిసి ప్రకారం, 2022 రెండవ త్రైమాసికంలో 5.7 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్‌లతో శామ్‌సంగ్ 16.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న‌ట్లు స‌మాచారం.

Samsung

షియోమీ అగ్ర‌స్థానం!
గత నెల, ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) యొక్క నివేదిక కూడా దేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు సంబంధించి ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 3 శాతం పెరిగి 35 మిలియన్ యూనిట్లకు చేరుకుందని, చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమీ చార్టులో అగ్రస్థానంలో ఉందని ఐడీసీ వెల్లడించింది.

మార్కెట్లో చైనా కంపెనీల‌దే హ‌వా!
IDC యొక్క వరల్డ్‌వైడ్ క్వార్టర్లీ మొబైల్ ఫోన్ ట్రాకర్ నివేదిక ప్రకారం, చైనీస్ బ్రాండ్‌లు ఇప్పుడు భారతీయ స్మార్ట్‌ఫోన్ మొదటి మూడు స్థానాలను సాధించాయి. Realme మరియు Vivo మొద‌టి మూడు స్థానాల్లో ప్లేస్ ద‌క్కించుకున్నాయ‌ని పేర్కొంది. అయితే వాల్యూమ్‌ల పరంగా శామ్‌సంగ్ నాల్గవ స్థానానికి పడిపోయింది. దేశంలో జూన్ 2022 త్రైమాసికంలో 34.7 మిలియన్ యూనిట్ల స్మార్ట్‌ఫోన్‌లు స‌ర‌ఫ‌రా చేయబడ్డాయని నివేదిక అంచనా వేసింది. గ‌తేడాది ఇదే స‌మ‌యంలో 33.8 మిలియన్ యూనిట్లు స‌ర‌ఫ‌రా అయ్యాయి. అంటే గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది 2.9 శాతం ఎక్కువ న‌మోదైన‌ట్లు నివేదిక వెల్ల‌డించింది.

Samsung

Apple కూడా ఫెస్టివ‌ల్ సేల్ షురూ.. వారికి iPhone 14పై రూ.7వేల త‌గ్గింపు!
భార‌త్‌లో పండ‌గ సీజ‌న్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో Apple కంపెనీ యొక్క అధికారిక సైట్ వేదిక‌గా ప్ర‌త్యేక సేల్ ప్రారంభ‌మైంది. Apple India స్టోర్‌లో ప్ర‌స్తుతం పండ‌గ సీజ‌న్ సేల్ లైవ్‌లో ఉంది. ఈ సేల్ సమయంలో, కొనుగోలుదారులు తాజా iPhone 14 సిరీస్‌తో సహా అనేక ఉత్పత్తులపై రూ.7,000 తగ్గింపు పొంద‌వ‌చ్చు.

ఇదే కాకుండా, iPhoneలు, MacBooks, iPadలు, AirPodలు మరియు మరిన్నింటి వంటి Apple ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. అయితే, Apple తక్షణ క్యాష్‌బ్యాక్ అందించడానికి HDFC బ్యాంక్ మరియు అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది. కాబ‌ట్టి, ఆ ఎంపిక చేసిన కస్టమర్‌లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ సేల్ సమయంలో, పైన పేర్కొన్న బ్యాంకుల కస్టమర్‌లు ఆయా క్రెడిట్ కార్డుల‌ను వినియోగించి రూ.41వేల కంటే ఎక్కువ కొనుగోళ్ల‌పై రూ.7వేల‌ వరకు తక్షణ తగ్గింపును పొందుతారు.

Best Mobiles in India

English summary
12 lakh samsung galaxy smartphones worth of Rs.1000 crore sold out in festive sale

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X