12 ఏళ్లకే సాప్ట్‌వేర్ పాఠాలు బోధిస్తున్న చిచ్చరి పిడుగు

By Gizbot Bureau
|

చిన్న పిల్లలకు ఆటలు,పాటలు, అల్లరి పనులు, చదువు, హోం వర్క్‌ ఇవి తప్ప మరో ప్రపంచం తెలీదు. హైదరాబాద్‌కి చెందిన జురైనా ఖాన్‌ మాత్రం వెబ్‌సైట్‌లు, ప్రోగ్రాంలు, కోడింగులు.. అంటూ అదరగొడుతుంది. ఇంజినీరింగ్‌ చదివిన వాళ్లకే సరిగా అర్థం కాని అంతర్జాలంలో దూసుకుపోతూ అందరిచేత శబాస్ అనిపించుకుంటోంది.

12-year-old Hyderabad girl emerges as software developer and budding entrepreneur

ఎనిమిదేళ్లకే ప్రోగ్రామ్‌లు, కోడింగ్‌లు చేస్తూ అసాధారణ ప్రతిభాపాటవాలతో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం అందరికీ గుర్తుండు ఉంటుంది. ఇపుడు ఆమె మళ్లీ వార్తల్లో నిలిచారు. తన ఖాతాదారుల కోసం సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌ చేస్తూ వర్ధమాన వ్యాపారవేత్తగా ప్రశంసలందుకుంటోంది.

 ఢిల్లీ పబ్లిక్ స్కూలులో ఏడవ తరగతి

ఢిల్లీ పబ్లిక్ స్కూలులో ఏడవ తరగతి

జునైరా ఖాన్ (Zunaira Khan).. హైదరాబాద్‌ ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలులో ఏడవ తరగతి చదువుకుంటోంది. తన వయసు 12 సంవత్సరాలు. కానీ తెలివితేటలు మాత్రం అమోఘం. ఏడేళ్ల వయసు నుండే ఆమె సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ చేయడం ప్రారంభించింది. ఆమె తల్లి కూడా ఐటి ఉద్యోగిని కావడంతో.. జునైరాకి కూడా తన తల్లి చేస్తున్న పని మీద ఆసక్తి పెరిగింది. తెలియని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించింది.

టీం మేనేజ్‌మెంట్‌ కోసం కొత్త అప్లికేషన్‌

టీం మేనేజ్‌మెంట్‌ కోసం కొత్త అప్లికేషన్‌

జెడ్‌ఎం ఇన్ఫోకామ్‌ అనే సొంత వెబ్‌సైట్‌ ద్వారా బీటెక్‌ విద్యార్థులకు శిక్షణనిస్తున్న జునైరా ఖాన్‌ ఇప్పుడు టీం మేనేజ్‌మెంట్‌ కోసం కొత్త అప్లికేషన్‌ను సృష్టించానని అతి త్వరలోనే దీన్ని లాంచ్‌ చేయబోతున్ననని ప్రకటించారు. ఈ యాప్‌ ద్వారా సంస్థలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపబోతున్నానని ఆమె తెలిపారు. ఇప్పటికే అనేక కంపెనీలకు బిజినెస్‌ యాప్‌లను రూపొందించిన జునైరా ఖాన్‌ సొంతంగా ఒక సంస్థను నడుపుతూ వుండటం విశేషం.

 అనేక మొబైల్‌ యాప్‌లు, బిజినెస్‌ యాప్‌లు

అనేక మొబైల్‌ యాప్‌లు, బిజినెస్‌ యాప్‌లు

అనతికాలంలోనే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, పీహెచ్‌పీ, జావా స్క్రిప్ట్.. ఇలా అన్నింటి మీదా పట్టుసాధించింది. అలా పట్టు సాధించడమే కాదు.. తనకున్న ప్రతిభతో ట్యూటర్‌గానూ మారింది. ఇప్పటివరకు నేను నాలుగైదు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చాను. ఇప్పటికే అనేక మొబైల్‌ యాప్‌లు, బిజినెస్‌ యాప్‌లు తయారు చేశాను. ప్రస్తుతం, ఒక ఎన్‌జీవో కోసం పని చేస్తున్నానని ఖాన్ చెప్పారు. అలాగే చిన్న వయసులోనే తాను కోడింగ్‌ నేర్చుకుంటానని అనడం తనకు ఆశ్చర్యం కలిగించిందనీ, ఒక తల్లిగా ఆమెకు నేర్పడం తన బాధ్యతగా భావించానని జునైరాఖాన్‌ తల్లి నిషాద్‌ ఖాన్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 నాల్గవ తరగతి నుండే

నాల్గవ తరగతి నుండే

కాగా జునైరా తల్లి నిషాత్‌ఖాన్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వెబ్‌ డెవలపింగ్‌, ఆండ్రాయిడ్‌ ఆప్‌ తరగతులు చెప్తుండేవారు. అయితే అప్పటికే నాల్గవ తరగతి చదువుతున్న జునైరాఖాన్‌ తనకు కూడా కోడింగ్‌ నేర్పాలని పట్టుబట్టింది. దీంతో ఆశ్చర్యపోయిన నిషాత్‌ కూతురి ఆసక్తిని ప్రోత్సహించారు. వెబ్‌ డెవలపింగ్‌, కోడింగ్‌ను నేర్పించారు. అంతే..ఇక వెనుదిరిగి చూడలేదు.

డిజిటల్‌ అంబాసిడర్‌ అవార్డు

డిజిటల్‌ అంబాసిడర్‌ అవార్డు

దిన దిన ప్రవర్థమానం చెంది చిన్న వయసులోనే ఢిల్లీ పబ్లిక్‌ స్కూలు చేత డిజిటల్‌ అంబాసిడర్‌ అవార్డును గెల్చుకుంది. తన పేరుతోనే జునైరా వెబ్‌ సొల్యూషన్స్‌ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించి తన అసాధారణ ప్రతిభతో దూసుకుపోతోంది. మరోవైపు జునైరా దగ్గర శిక్షణ పొందుతున్న మహమ్మద్‌ అర్బాజ్‌ అలం స్పందిస్తూ ఆమెదగ్గర శిక్షణ పొందడం నిజంగా తనకు ఎంతో సంతోషంగా ఉందనీ, తన కెరీర్ అభివృద్దిలో ఇది మరింత సాయపడుతుందని నమ్ముతున్నానన్నారు.

 టీచింగ్, లెర్నింగ్

టీచింగ్, లెర్నింగ్

ప్రస్తుతం తాను చదువుతున్న పాఠశాలకు తానే డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్‌గా జునైరా వ్యవహరిస్తోంది. అలాగే పలు సంస్థలకు బిజినెస్ అప్లికేషన్లను తయారుచేసి అందిస్తోంది. జునైరా వద్దకు పాఠాలు నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థులు కూడా ఆమెతో ఎంతో స్నేహంగా ఉంటారు. ఆమె పాఠాలు చాలా సులభంగా అర్థమవుతున్నాయని అంటున్నారు వాళ్లు. "టీచింగ్, లెర్నింగ్ అనే విషయాలకు వయసుతో పనిలేదు. ఆమె చాలా స్నేహంగా మాట్లాడుతూ.. మాకు అర్థం అయ్యే విధంగా ప్రోగ్రామింగ్ పాఠాలు నేర్పుతుంది. తనకు ఉన్న అపారమైన తెలివితేటలు నిజంగానే మా కెరీర్‌కు ఉపయోగపడతాయి" అని విద్యార్థులు చెప్పడం విశేషం.

Best Mobiles in India

English summary
12-year-old Hyderabad girl emerges as software developer and budding entrepreneur

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X