ఇకపై 13 అంకెల నంబర్లు, మరి 10 నంబర్ల సిమ్ పరిస్థితి ఏంటీ..?

Written By:

దేశంలో 13 అంకెల మొబైల్‌ నెంబర్‌ను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయంలో దేశంలోని అన్ని టెలికామ్ ఆపరేటర్లకు టెలికాం శాఖ (డిఓటి) ఆదేశాలను జారీ చేసింది. అక్టోబర్‌ ​1 నుంచి ఈ విధానం అమలు కానుంది. ప్రస్తుతం ఉన్న మొబైల్‌ నంబర్లు కూడా 13 అంకెల నంబర్‌కు మార్చనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2018 అక్టోబరు 1 నుంచి 2018 డిసెంబరు 31లోగా ప్రస్తుతమున్న మొబైల్‌ నంబర్లను 13అంకెలకు మార్చాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై యూజర్లు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మెషీన్‌ టు మెషీన్‌ సిమ్‌లకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

ఐఫోన్లకు ఊరట, తెలుగు అక్షరం రహస్యాన్ని చేధించిన ఆపిల్, ఏం చేయాలంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Machine-to-Machine (M2M)

Machine-to-Machine (M2M) అంటే ఏంటో తెలియక చాలా మంది ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే M2M అనేది మిషన్లకు డివైస్‌లకు మధ్య అనుసంధానంగా పనిచేస్తుంది. మెషిన్లు అంటే Airplane, Ship, connected cars, or Bicycle లాంటివి అని అర్థం. సెక్యూరిటీ నేపథ్యంలో ఈ సిమ్ కార్డ్‌ల 13 అంకెల విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది.

రాబోయ్ 13 నంబర్ల సిమ్ కార్డు

రాబోయ్ 13 నంబర్ల సిమ్ కార్డు వీటన్నింటికి ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని మీరు రెగ్యులర్ గా వాడే మొబైళ్లలో కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. టెలికాం దిగ్గజాలు Vodafone, Airtel, Bsnl, Jio లాంటి సంస్థలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాయి.

ప్రధాన ఉద్ధేశం.

Machine-to-Machine ప్రధాన ఉద్ధేశం..దేశంలోని transport, power, utilities, logistics, health, and shipping వంటి రంగాల్లో ఆర్థికాభివృద్ధి జరిగేందుకు వాటి మధ్య పరస్పర అవగాహన కలిగించడం కోసమేనని తెలుస్తోంది.

ఈ ఏడాది జనవరి 8న మార్గదర్శకాలు

కాగా టెలికమ్యూనికేషన్‌ విభాగం నుంచి ఈ ఏడాది జనవరి 8న మార్గదర్శకాలు వచ్చాయని, ఈ అంశంపై పనిచేయడం ప్రారంభించామని బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారి ఒకరు తెలిపారు. 13అంకెల నంబర్లను జారీ చేసే విధానాన్ని జులై 1వ తేదీ నుంచి మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. జులై 1వ తేదీ నుంచి ఇక 13 అంకెల మొబైల్‌ నంబర్లే జారీ అవుతాయని అన్నారు.

భారతి ఎయిర్‌టెల్‌ కూడా..

మరో టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. టెలికాం డిపార్ట్‌మెంట్‌ 13 అంకెల నంబర్‌ విధానాన్ని ఆమోదించిందని ట్రాయ్‌కు రాసిన లేఖలో పేర్కొంది. సమాచార మంత్రిత్వ శాఖ కూడా ట్రాయ్‌కు రాసిన లేఖలో.. సిమ్‌తో నడిచే మెషీన్‌ టు మెషీన్‌ పరికరాలకు 13అంకెల నంబరు విధానాన్ని ఆమోదించినట్లు తెలిపింది.

10అంకెల మొబైల్‌ యూజర్లు

సాధారణ 10అంకెల మొబైల్‌ యూజర్లు ప్రస్తుతం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయం కేవలం మెషీన్‌ టు మెషీన్‌ సిమ్‌ కార్డు నంబర్లకు మాత్రమే వర్తిస్తుంది.అయితే ఇది ముందు ముందు ఎటువంటి పరిణామాలను మోసుకొస్తుందనే దానిపై ఎటువంటి క్లారిటీ లేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
13 digit mobile numbers in India from July 1? Not true, only for M2M numbers More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot