వీకీపీడియాకు 18 మంది అమెరికా సెనేటర్లు మద్దతు

Posted By: Prashanth

వీకీపీడియాకు 18 మంది అమెరికా సెనేటర్లు మద్దతు

 

న్యూయార్క్:జనవరి 18, 2012ని, బ్లాక్ అవుట్‌గా పరిగణించి ఇంగ్లీషు వీకీపీడియా కమ్యూనిటీ 24 గంటలు మూత పడింది. దీనికి గల కారణం అమెరికా సంయుక్త సెనేట్ లో సంయుక్త హౌస్ లో స్టాప్ ఆన్లైన్ పైరసీ చట్టాన్ని (SOPA) ప్రవేశపెట్టారు. ఈ చట్టం వల్ల యునైటెడ్ స్టేట్స్ లోపల అంతర్జాతీయ వెబ్సైట్లను సెన్సార్షిప్ కొత్త ఉపకరణాలు, ఓపెన్ ఇంటర్నెట్ హాని గురించి తెస్తుంది. దీంతో యునైటెడ్ స్టేట్స్ ప్రతిపాదిత చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ వికీపీడియా కమ్యూనిటీ ఈ అపూర్వమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని సోమవారం పత్రికా ముఖంగా తెలియజేశారు.

దీంతో అమెరికన్ సెనేట్ ప్రతిపాదించిన పైరసీ నిరోధక చట్టానికి నిరసనగా వీకీపీడియా ఇంగ్లిష్ వెబ్‌సైట్‌ను 24 గంటల పాటు మూసివేసి నిరసన తెలిపిన సందర్బంలో వీకీపీడియాకు అనూహ్యా స్పందన లభించింది. వివాదాస్పద స్టాప్ పైరసీ యాక్ట్, ప్రొటెక్ట్ ఐపీ యాక్ట్‌ల ఆమోదానికి తాము మద్దతు పలకమని గురువారం 18 మంది సెనేటర్లు ప్రకటించారు. వారు బహిరంగంగానే వికీపీడియాకు అనుకూలంగా మట్లాడుతున్నారు.

ఫ్లోరెడా సెనేటర్ మార్కో రుబియా మాట్లాడుతూ ‘ప్రతి రోజూ అనేక అంశాల కోసం దాదాపు 100 మిలియన్ల మంది సందర్శించే సైట్ ఒక్క రోజు కనపడలేదు. ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా లభించే విజ్ఞానం లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించండి’ అన్నారు. వందమంది సభ్యులున్న సెనేట్‌లో బిల్లు ప్రవేశపెట్టే సమయానికి ఎంతమంది మద్దతిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వికీపీడియాతో పాటు గూగుల్, ట్విటర్, ఫేస్‌బుక్, ఈబే వంటి సైట్లు కూడా ఈ చట్టాలకు వ్యతిరేకంగా గళమెత్తాయి.

ఇక ఇండియాలో ఇంటర్‌నెట్‌పై సెన్సార్ విధించే విషయంపై ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదని గురువారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని చట్టాలను కచ్చితంగా పాటించాల్సిందేనంటూ గూగుల్, ఫేస్‌బుక్‌లాంటి సోషల్ వెబ్‌సైట్లను హెచ్చరించినప్పటికీ, వాటిపై ఆంక్షల కోసం ప్రయత్నించడం లేదని తెలిపింది. అదేవిధంగా మీడియాపై కూడా సెన్సార్‌షిప్ ఉండబోదని, అయితే పెయిడ్ న్యూస్ వంటి విపరీత వ్యవహారాల విషయంలో మీడియా స్వయం నియంత్రణ పాటించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot