బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు
ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ‘మైక్రోసాఫ్ట్' ఒకటి. 1975లో బిల్‌గేట్స్ ఇంకా పౌల్ అలెన్‌లు అమెరికాలోని రెడ్మాండ్ నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటరు పరికరాలకు వివిధ రకాలయిన సాఫ్టువేర్ అభివృద్ది పరచడం, తయారు చేయడం, లైసెన్స్‌లు ఇవ్వడం ఇంకా సహకారం అందించడం చేస్తుంది.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
మైక్రోసాఫ్ట్ వృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణను పొందాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ ప్రముఖ మొబైల్ ఫోన్ ల తయారీ కంపెనీ నోకియాను సొంతం చేసుకుది. తాజాగా ‘విండోస్ 10' పేరుతో సరికొత్త మొబైల్ ఇంకా కంప్యూటింగ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేటి ప్రత్యేక శీర్షికలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ గురించి 10 ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం...

బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు
లేక్‌సైట్ ప్రీప్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న సమయంలో జనరల్ ఎలక్ట్రిక్ కంప్యూటర్ పై తన మొదటి కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను గేట్స్ రాసారు.

బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు
గేట్స్ నైపుణ్యాలను గుర్తించిన స్కూల్ యాజమాన్యం తమ విద్యార్థులకు క్లాస్‌లను షెడ్యూల్ చేసేందుకు ఓ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను తయారు చేయమని షెడ్యూల్ చేసింది.

బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు
ఇతర విజయవంతమైన టెక్ పారిశ్రామికవేత్తల మాదిరిగానే బిల్ గేట్స్ కూడా డ్రాప్ అవుటే. మైక్రోసాఫ్ట్ పై తన దృష్టిని పూర్తిస్థాయిలో కేటాయించేందుకు గేట్స్ 1975లో హార్వర్డ్
యూనివర్శిటీని విడిచారు.

బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారును నడపటం వల్ల గేట్స్ న్యూ మెక్సికోలో 1977లో అరెస్ట్ అయ్యారు.

బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు
1997 వరకు బిల్ గేట్స్ ఫ్లై కోచ్‌ను ఉపయోగించే వారు. ప్రసత్తుం బిల్ గేట్స్‌కు సొంత విమానముంది.

బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు
బిల్ గేట్స్ 1994లో నిర్వహించిన ఓ వేలం పాటలో $30.8 బిలియన్ వెచ్చించి లియోనార్డో డా విన్సీ రచించిన కోడెక్స్ లీసెస్టర్‌ను కొనుగోలు చేసారు.

బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు
బిల్ గేట్స్ వద్ద తరగని సంపద ఉన్నప్పటికి తమ పిల్లలకు వారసత్వంగా 10 మిలియన్‌లు మాత్రమే ఇచ్చారు. పిల్లల వద్ద డబ్బులు ఎక్కువ ఉండకూడదన్నది బిల్ గేట్స్ అభిప్రాయం.

బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు
బిల్ గేట్స్‌కు ఏ విధమైన విదేశీ భాషలు రావు.

బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు
బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్స్రరానికి $7.2 బిలియన్.

బిల్ గేట్స్ గురించి 13 ఆసక్తికర నిజాలు
బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్లను నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జార విడిచిన మొత్తాన్ని నాలుగు సెకన్లలో సంపాదించగలరు. అమెరికాకు ఉన్న అప్పు విలువ షుమారు 5.62 ట్రిలియన్లు. ఈ మొత్తాన్ని బిల్‌గేట్స్ 10 సంవత్సరాల్లో తీర్చగలరు. బిల్ గేట్స్ ఈ భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి US$15 డాలర్‌లను దానం చేసినప్పటికి. ఆయన వద్ద ఇంకా యూఎస్ $5 మిలియన్ సంపద మిగిలి ఉంటుంది.


Click it and Unblock the Notifications