13 ఏళ్లకే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ స్థాపించిన ఆదిత్యన్‌ రాజేశ్‌

చాలా మంది టీనేజ్ లో ఉన్నపుడు ఏం చేసేవారు మహా అయితే వారి తల్లితండ్రులతో పాకెట్ మనీ కోసం గొడవ పడేవాళ్ళు అయితే కేరళకు చెందిన ఆదిత్యన్‌ రాజేశ్‌ మాత్రం 13ఏళ్లకే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని దుబాయ్‌లో

|

చాలా మంది టీనేజ్ లో ఉన్నపుడు ఏం చేసేవారు మహా అయితే వారి తల్లితండ్రులతో పాకెట్ మనీ కోసం గొడవ పడేవాళ్ళు అయితే కేరళకు చెందిన ఆదిత్యన్‌ రాజేశ్‌ మాత్రం 13 ఏళ్లకే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని దుబాయ్‌లో స్థాపించాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే

ఫేస్‌బుక్‌ లో ప్రేమ పేరుతో నమ్మించి 90 లక్షలు మోసంఫేస్‌బుక్‌ లో ప్రేమ పేరుతో నమ్మించి 90 లక్షలు మోసం

ఆదిత్యన్‌  రాజేశ్‌...

ఆదిత్యన్‌ రాజేశ్‌...

ఆదిత్యన్‌ రాజేశ్‌ కేరళలోనే పుట్టినా తన తల్లిదండ్రుల తో కలిసి 8 ఏళ్ల క్రితం నుంచి దుబాయ్‌లో ఉంటున్నాడు. 9 ఏళ్లకే మొబైల్‌ యాప్‌ను అభివృద్ధి చేశాడు . ఐదేళ్ల వయసులో కంప్యూటర్ వాడటం మొదలు పెట్టిన రాజేశ్ ఇప్పుడు సొంతంగా ట్రైనెట్ సొల్యూషన్స్ పేరిట ఓ కంపెనీని స్థాపించాడు.

బీబీసీ టైపింగ్ అనే ఓ కిడ్స్ వెబ్‌సైట్‌....

బీబీసీ టైపింగ్ అనే ఓ కిడ్స్ వెబ్‌సైట్‌....

బీబీసీ టైపింగ్ అనే ఓ కిడ్స్ వెబ్‌సైట్‌ను తన తండ్రి రాజేశ్‌కు పరిచయం చేసారు . అలా కంప్యూటర్‌పై పట్టు సాధించడం ప్రారంభించాక తనే సొంతంగా ఇంటర్నెట్‌లో చూసి కంప్యూటర్ లాంగ్వేజీలను కూడా నేర్చుకోవడం ప్రారంభించాడు. సాఫ్ట్‌వేర్ లాంగ్వేజీలన్నీ నేర్చుకున్నాక బోరు కొడుతుంటే తన తొమ్మిదేళ్ల వయసులో ఏకంగా మొబైల్ అప్లికేషన్‌నే డెవలప్ చేశాడు. ఇప్పటికే పలు కంపెనీలకు వెబ్‌సైట్లు, లోగోలు రూపొందిస్తున్నాడు.

 

 

ట్రైనెట్‌ సొల్యూషన్స్‌....
 

ట్రైనెట్‌ సొల్యూషన్స్‌....

తాజాగా అతను ట్రైనెట్‌ సొల్యూషన్స్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీని అక్కడే స్థాపించాడు. ప్రస్తుతానికి ఇందులో ముగ్గురు ఉద్యోగులుండగా వారంతా ఆదిత్యన్‌ సహ విద్యార్థులు, స్నేహితులే.

కంపెనీ స్థాపించాలంటే...

కంపెనీ స్థాపించాలంటే...

కంపెనీ స్థాపించాలంటే యజమానికి కనీసం 18 ఏళ్లు ఉండాల్సి ఉందని, అయితే అంత వయసు లేనప్పటికీ మేమంతా కంపెనీ తరహాలోనే పనిచేస్తామని ఆ బాలుడు చెప్పాడు. ఇప్పటికే 12 మంది వినియోగదారులతో పనిచేస్తున్నామని, డిజైనింగ్, కోడింగ్ సేవల్ని ఉచితంగా అందిస్తున్నామని ఆదిత్యన్ రాజేశ్ అన్నాడు.

 

 

 

Best Mobiles in India

English summary
This 13-year-old Indian teenager owns software company in Dubai.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X