14 రోజుల్లో 14 లక్షలు బుకింగ్స్..!

Posted By:
  X

  14 రోజుల్లో 14 లక్షలు బుకింగ్స్..!

   

  ప్రపంచంలో అతి తక్కువ ఖరీదు కలిగిన టాబ్లెట్‌గా 'ఆకాష్' ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. 'ఎన్‌క్యారీ. కామ్' అనే వెబ్‌సైట్ ద్వారా ఆకాష్ టాబ్లెట్‌ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టగా, అమ్మకానికి పెట్టిన రెండు వారాల లోపే 14 లక్షల బుకింగ్స్‌కు చేరుకుంది. గత సంవత్సరం డిసెంబర్ 15న ఆకాష్ టాబ్లెట్‌ని ఆన్ లైన్‌లో అమ్మకానికి పెట్టారు.

  ఎన్‌క్యారీ.కామ్ వెబ్‌సైట్ విషయానికి వస్తే నెదర్లాండ్స్‌కు చెందిన నింబుజ్ కంపెనీకి లోబడి పని చేస్తుంది. ఇంటర్నెట్ ప్రపంచంలో నింబుజ్ కంపెనీ ఇనిస్టాంట్ మెసేజింగ్ అప్లికేషన్స్‌ని రూపొందించడంలో నెంబర్ వన్‌గా కొనసాగుతుంది. తక్కువ ధర కలిగిన ఈ ఆకాష్ టాబ్లెట్ మార్కెట్లోకి రూ 2,499 లభ్యమవుతుండగా, ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న కస్టమర్స్‌కి ఎక్సట్రాగా రూ 199 లను వసూలు చేయనున్నారు. దీని ద్వారా ఆకాష్ టాబ్లెట్ డైరెక్టుగా వారి ఇంటివద్దకే డెలివరి కానుంది.

  ఇక ఆకాష్ ప్రత్యేకతలను గనుక గమనించినట్లేతే ఏడు అంగుళాల టచ్ స్క్రీన్‌తో పాటు, 256 MB RAM, ARM 11 ప్రాసెసర్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.2తో రన్ అవుతుంది. రెండు యుఎస్‌బి పోర్ట్స్‌తో పాటు, హై క్వాలిటీ వీడియోని అందించనుంది. ఇక బ్యాటరీ బ్యాక్ అప్ 1.5 గంటలు.

  ఆకాష్ ప్రత్యేకతలు:

  హార్డ్ వేర్:

  * ప్రాసెసర్: 366 Mhz. Connexant with Graphics accelerator and HD Video processor

  * మెమరీ(RAM): 256MB RAM / Storage (Internal): 2GB Flash

  * స్టోరేజి(External): 2GB to 32GB Supported

  * ఆడియో: 3.5mm jack / Audio in: 3.5mm jack

  * డిస్ ప్లే: 7" display with 800x480 pixel resolution

  * ఇన్ పుట్: Resistive touch screen

  * కనెక్టివిటీ & నెట్ వర్కింగ్: GPRS and WiFi IEEE 802.11 a/b/g

  * పవర్ & బ్యాటరీ: Up to 180 minutes on battery. AC adapter 200-240 volt range.

  సాప్ట్ వేర్:

  * ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.2

  * Supported Document formats: DOC, DOCX, PPT, PPTX, XLS, XLSX, ODT, ODP

  * PDF viewer, Text editor

  * Multimedia and Image Display

  * Image viewer supported formats: PNG, JPG, BMP and GIF

  * Supported audio formats: MP3, AAC, AC3, WAV, WMA

  * Supported video formats: MPEG2, MPEG4, AVI, FLV

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more