Home
News

లక్కీ గ్రాహక్ యోజన, 15,000 మంది విజేతలు

By Sivanjaneyulu Bommu

దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం లాంచ్ చేసిన లక్కీ గ్రాహక్ యోజన, డిజీ ధన్ వ్యాపర్ యోజన స్కీమ్‌లకు సంబంధించి విజేతల ఎంపిక ప్రారంభమైంది.

లక్కీ గ్రాహక్ యోజన, 15,000 మంది విజేతలు

Read More : 2016లో సంచలనం రేపిన 4జీ డేటా, వాయిస్ ప్లాన్స్

నవంబర్ 9 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగిన 8 కోట్ల డిజిటల్ లావాదేవీలకు సంబంధించి 15,000 మంది విజేతలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి రూ.1000 నగదు బహుమతిని అందజేస్తారు. www.digidhanlucky.mygov.inలో విజేతల వివరాలను తెలుసుకోవచ్చు.

రూ.340 కోట్ల విలువైన ఆఫర్లు...

రూ.340 కోట్ల విలువైన ఆఫర్లు...

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం రూ.340 కోట్ల విలువైన ఆఫర్లను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. నగదురహిత లావాదేవీల వైపు దేశప్రజానీకాన్ని నడిపించి, తద్వారా క్యాష్‌లెస్ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పే క్రమంలో రెండు సరికొత్త పధకాలను నీతి అయోగ్ ప్రకటించింది.

100 రోజుల పాటు..

100 రోజుల పాటు..

వంద రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ స్కీమ్‌లో భాగంగా ఈ-వాలెట్స్, యూఎస్ఎస్‌డి ఇంకా స్మార్ట్‌ఫోన్ యాప్స్‌ను ఉపయోగించుకుని లావాదేవీలు నిర్వహించే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. లక్కీ గ్రాహక్ యోజన పథకం ప్రజలందరికి వర్తిస్తుంది. డిజీ-ధన్ వ్యాపర్ యోజన పథకం వ్యాపారులకు మాత్రమే వరిస్తుంది.

లక్కీ గ్రాహక్ యోజనా పథకంలో భాగంగా

లక్కీ గ్రాహక్ యోజనా పథకంలో భాగంగా

లక్కీ గ్రాహక్ యోజనా పథకంలో భాగంగా రోజుకు 15,000 వేల మంది విజేతలను ఎంపిక చేస్తారు. వీరికి రూ.1000 చొప్పున ప్రోత్షాహాకాలు మంజూరు చేస్తారు. ఇదే పథకంలో భాగంగా వారానికి ఒకసారీ లక్కీ డ్రాలో భాగంగా 7,000 మంది విజేతలను ఎంపిక చేసి వారికి రూ.లక్ష వరకు నగదు బహుమతులను అందజేస్తారు. వ్యాపారుల కోసం తీసుకువచ్చిన డిజీ-థన్ వ్యాపర్ యోజన పథకంలో భాగంగా వారానికొకసారి 7,000 మంది విజేతలను ఎంపిక చేసిన వారికి రూ.50,000, రూ.5,000, రూ.2,500 ప్రోత్సాహాకాలను ఇవ్వటం జరుగుతుంది.

మెగా అవార్డ్స్ పేరుతో...

మెగా అవార్డ్స్ పేరుతో...

ఇవి కాకుండా మెగా అవార్డ్స్ పేరుతో భారీ నగదు బహుమతలను నీతి అయోగ్ ప్రకటించింది. ఈ అవార్డ్ స్కీమ్‌లో భాగంగా నవంబర్ 8 2016 నుంచి ఏప్రిల్ 13, 2017 వరకు నిర్వహించిన డిజిటల్ లావాదేవీలు ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. లక్కీ గ్రాహక్ యోజన పథకంలో భాగంగా మెగా అవార్డ్స్ క్రింద మొదటి విజేతకు రూ.కోటి, రెండవ విజేతకు రూ.50 లక్షలు, మూడవ విజేతకు రూ.25 లక్షల ప్రోత్సాహకం ఇవ్వటం జరుగుతుంది.

డిజీ-ధన్ వ్యాపర్ యోజన

డిజీ-ధన్ వ్యాపర్ యోజన

డిజీ-ధన్ వ్యాపర్ యోజన పథకంలో భాగంగా మెగా అవార్డ్స్ క్రింద మొదటి విజేతకు రూ.50 లక్షలు, రెండవ విజేతకు రూ.25 లక్షల, మూడవ విజేతకు రూ.5లక్షల ప్రోత్సాహాకాన్ని అందించటం జరుగుతుంది.

Best Mobiles in India

English summary
15,000 Winners Selected to Receive Digital Payments Rewards. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X