వెబ్ కంపెనీని ప్రారంభించిన 15 ఏళ్ల బాలిక!

Posted By:

కేరళలోని కోజికోడ్ ప్రాంతానికి చెందిన శ్రీలక్ష్మి సురేష్(15) వెబ్ కంపెనీని స్థాపించి చరిత్ర సృష్టించారు. ఈ బాలిక ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే తాను చదువుకుంటున్న స్కూల్‌కు సంబంధించి ఓ వెబ్‌సైట్‌ను వృద్ధిచేసి అప్పట్లోనే సంచలనంగా నిలిచింది.

 వెబ్ కంపెనీని ప్రారంభించిన 15 ఏళ్ల బాలిక!

వివరాల్లోకి వెళితే.... ప్రెజంటేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో పదో తరగతి చదువున్న లక్ష్మి సరేష్ మరో ఆరుగురు విద్యార్థులతో కలిసి వైగ్లోబ్స్ ( YGlobes) పేరుతో వెబ్ డిజైనింగ్ కంపెనీని యూఎల్ సైబర్ పార్క్‌లో ప్రారంభించటం జరిగింది. ఈ తాజా వెంచర్‌తో శ్రీలక్ష్మి ప్రపంచపు అతిచిన్న సిఈఓలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెబ్ డిజైనింగ్ విభాగంలో శ్రీలక్ష్మి రాణిస్తున్నతీరు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది.

వెబ్ డిజైనింగ్ విభాగంలో ప్రత్యేక నైపుణ్యాలను కనబరస్తూ జాతికి గర్వకారణంగా నిలిచిన శ్రీలక్ష్మి అసోసియేషన్ ఆఫ్ అమెరికర్ వెబ్ మాస్టర్స్ సభ్యత్వంతో పాటు 30 అవార్డులను అందుకున్నారు. జూలై నుంచి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని శ్రీలక్ష్మి ఓ వార్తా పత్రికను ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వెంచర్ నిమిత్తం పెట్టబడి వ్యయాన్ని రూ.50 లక్షలుగా అంచనా వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting