వీడియో గేమ్ ఆడాడు,ఏకంగా రూ. 20 కోట్లు గెల్చుకున్నాడు

By Gizbot Bureau
|

న్యూస్ చూసి షాకవుతున్నారా... అవును అమెరికాకు చెందిన ఓ టీనేజర్ వీడియో గేమ్స్ కాంపిటీషన్‌లో 3 మిలియన్ల డాలర్లు (రూ.20 కోట్లు) ప్రైజ్ మనీ గెలిచాడు. ఆటకు బానిసగా మారిన అతను ఇప్పుడు ఏకంగా కోటీశ్వరుడయ్యాడు.

వీడియో గేమ్ ఆడాడు,ఏకంగా రూ. 20 కోట్లు గెల్చుకున్నాడు

 

న్యూయార్క్ లో పాపులర్ ఆన్ లైన్ వీడియో గేమ్ ఫోర్ట్ నైట్ నిర్వహించిన టోర్నమెంట్‌లో ఈ అమెరికా కుర్రాడు టాప్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే ఆన్‌లైన్ గేముల్లో ఓ వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో నగదు బహుమతిని గెలుచుకోవడం ఇదే మొదటిసారి.

Kyle Giersdorf

Kyle Giersdorf

న్యూయార్క్ లోని ఆర్ధర్ ఆషే స్టేడియంలో జరిగిన ఫోర్ట్‌నైట్ ప్రపంచ కప్ పోటీల్లో సోలో ఈవెంట్‌లో విజయం సాధించిన 16 ఏళ్ల Kyle Giersdorf ఈ భారీ నగదును సొంతం చేసుకున్నాడు. ఈ స్టేడియంలోనే యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుంది. మొత్తం 100 మంది ప్లేయర్లు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.

సోలో ఫైనల్స్ విభాగంలో

సోలో ఫైనల్స్ విభాగంలో

గేమ్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఫోర్ట్‌నైట్ ప్రపంచ కప్ లీడర్‌బోర్డ్ ప్రకారం బుఘా పేరుతో ఆడుతున్న ఫోర్ట్‌నైట్ ప్రపంచ కప్‌లో సోలో ఫైనల్స్ విభాగంలో పెన్సీలెవినియాకు చెందిన గియర్ డోర్ఫ్ 59 పాయింట్లు సాధించాడు. తన సమీప పోటీదారు "కీర్తన" కంటే 26 ఎక్కువ స్కోరు సాధించాడు. దీంతో అతను విజేతగా నిలిచాడు.

గియర్ డోర్ఫ్ స్పందన
 

గియర్ డోర్ఫ్ స్పందన

ప్రైజ్ మనీ గెలవడంపై గియర్ డోర్ఫ్ స్పందిస్తూ ఈ విజయాన్నిమాటల్లో చెప్పలేను. నాకు చెప్పలేనంత సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ మొత్తంలో చాలావరకూ దాచుకోవాలి. ముందు ఈ ట్రోఫీని ఉంచడానికి ఓ టేబుల్‌ కొనాలని తెలిపాడు. టోర్నమెంట్ జరుగుతున్నంతసేపూ గీర్స్‌డార్ఫ్ చిరునవ్వుతో ఆడుతూ, ప్రత్యర్థులను ఓడించాడని అక్కడి కామెంటేటర్లు వ్యాఖ్యానించారు.

2017లో గేమ్ లాంచ్

2017లో గేమ్ లాంచ్

2017లో ఫోర్ట్ నైట్ వీడియో గేమ్ కంపెనీ లాంచ్ అయింది. అప్పటి నుంచి ఎపిక్ గేమ్స్ నిర్వహించడంలో పాపులారిటీ సాధించింది. 2018 ఏడాదిలో ఈ-గేమ్స్ మీద 15 బిలియన్ల డాలర్ల విలువకు చేరింది. చైనా కంపెనీ టెన్సెంట్ కూడా ఎపిక్ గేమ్స్ లో 40శాతం వాటా ఉంది. గ్లోబల్ వీడియో, ఎలక్ట్రానిక్ గేమ్స్ మార్కెట్ లో 2019లో ఈస్పోర్ట్స్ నుంచి వచ్చే రెవిన్యూ 152.1 బిలియన్ల వరకు రానుంది. 2018తో పోలిస్తే 9.6 శాతం పెరగనున్నట్టు గేమింగ్ ఎనలిటిక్స్ సంస్థ న్యూజూ రిపోర్టులో తెలిపింది.

100 మంది ఆటగాళ్లు

100 మంది ఆటగాళ్లు

భారీ కంప్యూటర్ తెరలపై 100 మంది ఆటగాళ్లు ఫోర్ట్‌నైట్ ఫైనల్స్‌లో ఆడారు. దీనికి అర్హత సాధించడానికి 10 వారాల వ్యవధిలో ఆన్‌లైన్‌ పోటీల్లో 4 కోట్లమంది ఆటగాళ్లు పోటీ పడ్డారు. 30కి పైగా దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో అమెరికా నుంచి 70 మంది, ఫ్రాన్స్ నుంచి 14మంది, యూకే నుంచి 11మంది పోటీపడ్డారు. ఇదిలా ఉంటే ఫోర్ట్‌నైట్ ఓ వ్యసనంలా మారుతోందని, ఈ గేమ్‌ను నిషేధించాలని ఏప్రిల్‌లో డ్యూక్ ఆఫ్ ససెక్స్ పిలుపునిచ్చారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
American 16-year-old boy wins Rs 20 crores by playing video games

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X