Home
News

తండ్రి స్మార్ట్‌ఫోన్‌ లాక్కున్నాడని ఆత్మహత్య చేసుకున్న కుమారుడు.. ఈ సూచనలు తప్పనిసరి!

స్మార్ట్‌ఫోన్లు లేనిదే ప్రస్తుత రోజుల్లో చాలా వరకు ఏ పనికూడా జరగని పరిస్థితి నెలకొంది. అయితే అవసరం వరకు స్మార్ట్‌ఫోన్‌ వినియోగం మంచిదే అయిన.. మితిమీరిన వినియోగం అనేక ప్రమాదాలకు కారణం అవుతుంది. అయితే యువత, చిన్నారులు చాలా మంది స్మార్ట్‌ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు.

చిన్నారుల స్మార్ట్‌ఫోన్‌ వినియోగంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. లేకుంటే ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. మితిమీరిన స్మార్ట్‌ఫోన్‌ వినియోగం చిన్నారుల మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. మరియు భవిష్యత్‌లో అనేక సమస్యలకు కారణం అవుతుంది. తాజాగా ఓ కన్నీటి ఘటన వెలుగులోకి వచ్చింది.

 boy commits suicide in mumbai

ముంబైకిలోని మాల్వానికి చెందిన 16 ఏళ్ల బాలుడు స్మార్ట్‌ఫోన్‌కు బానిసయ్యాడు. గేమ్స్‌ సహా ఫోన్‌ను ఎక్కువ సమయం వినియోగించేవాడు. దీంతో ఆగ్రహించిన అతని తండ్రి ఫోన్‌ను అతని దగ్గరి నుంచి తీసుకున్నాడు. దీంతో నవంబర్‌ 16న తండ్రితో గొడవపడ్డాడు. రాత్రి సమయంలోనూ స్మార్ట్‌ఫోన్లో గేమ్స్‌ ఆడేందుకు అలవాటు పడ్డాడని తెలుస్తోంది.

దీంతో నవంబర్‌ 17న ఇంట్లోనే ఉరివేసుకొని అత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మరణించినట్లు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసునమోదు చేసిన పోలీసులు బాలుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదుచేసినట్లు తెలిపారు.

 boy commits suicide in mumbai

ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగించింది. స్మార్ట్‌ఫోన్‌కు బానిసైన సదరు బాలుడు ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవంబర్‌ 16న బాలుడి తండ్రి ఫోన్‌ను తీసుకెళ్లగా.. ఆ తర్వాత రోజే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి ఘటనలతో తల్లిదండ్రులు అప్రమత్తం కావాల్సి ఉంటుంది. మీ చిన్నారులు ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే ముందే వారిని ఆ వ్యసనం నుంచి దూరం చేయాల్సి ఉంటుంది.

ప్రేమ పూర్వకంగా వారితో ప్రవర్తించాలి : తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చే తల్లిదండ్రులు అందుకు తగిన సమయాన్ని కేటాయించాలి. భోజనం, రాత్రి సమయాల్లో ఫోన్‌ను వినియోగించకుండా సున్నితంగా సూచించాలి. ప్రేమ పూర్వకంగా వారితో ప్రవర్తించాలి. వినకుంటే కొంచెం కఠినంగా చెప్పాల్సి ఉంటుంది.

 boy commits suicide in mumbai

పిల్లలతో ఆటలాడడం : అలాగే చిన్నారులతో ఉన్న సమయంలో తల్లిదండ్రులు కూడా స్మార్ట్‌ ఫోన్‌కు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. పిల్లలతో ఆటలాడడం లేదా ఇతర కార్యక్రమాలతో వారితో కాలక్షేపం చేయండి. ఫలితంగా పిల్లలు కూడా స్మార్ట్‌ఫోన్‌కు ఆకర్షితులు కాకుండా ఉంటారు.

శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం : మితిమీరిన స్మార్ట్‌ఫోన్‌ వినియోగం చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఫోన్ల వినియోగంపై చిన్నారులకు అవగాహన కల్పించాలి. అతి వినియోగం కారణంగా కళ్లు, నిద్రపై చూపే చెడు ప్రభావాన్ని వారికి అర్థమయ్యే విధంగా వివరించండి.

దాంతోపాటు చిన్నారులు స్మార్ట్‌ఫోన్లను వినియోగించే సమయంలో వారికి కొన్ని యాప్స్‌లోకి ప్రవేశించేందుకు మాత్రమే అనుమతి ఇవ్వండి. స్మార్ట్‌ఫోన్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పేరెంటల్‌ కంట్రోల్ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేయండి. ఈ ఫీచర్ ద్వారా చిన్నారులకు హాని చేకూర్చే యాప్‌లను లాక్‌ చేయండి. అలాగే పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు ఎక్కువగా ఆకర్షితులు కాకుండా జాగ్రత్తపడండి.

More from GizBot

Best Mobiles in India

English summary
16 years old boy commits suicide after his father takes away his smartphone in mumbai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X