పిన్నవయసులోనే కోట్లకు అధిపతులయ్యారు

Written By:

వారికి నిండా ముప్పై ఏళ్లు కూడా లేవు. అయితేనేమి మాకు తెలివి ఉంది అదే మా పెట్టుబడి అంటూ ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ వయసులో కోట్లకు అధిపతులయ్యారు. వారిలో ఫేస్‌బుక్ అధినేత జుకర్ బర్గ్ అలాగే ఫ్లిఫ్ కార్ట్ అధినేత సచిన్ బన్సాల్ ఇంకా అనేకమంది అతి పిన్న వయసులో కోట్ల రూపాయలతో మార్కెట్ ను శాసిస్తున్నారు. అలాంటి ఓ 16 మంది టెక్ బిలియనీర్స్‌పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: కుబేరులకే కుబేరుడు: 22 సంవత్సరాల్లో 17 సార్లు నెంబర్‌వన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్క్ జుకర్ బర్గ్ ( ర్యాంకు 31)

ఫేస్‌బుక్ సీఈఓ, ఇతని సంపద దాదాపు 45 బిలియన్ డాలర్లని అంచనా.23 ఏళ్ల ప్రాయంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కీర్తని ఆర్జించాడు. తమ వంతుగా సమాజ సేవా కార్యక్రమాలతో ముందుకుదూసుకెళుతున్నారు.

సావెరిన్ ( ర్యాంకు 33)

ఫేస్‌బుక్ కో ఫౌండర్ . ఇతని సంపద దాదాపు 5.6 బిలియన్ డాలర్లని అంచనా. ఇతనికి ఫేస్‌బుక్ కాకుండా మరికొన్ని ఇతర బిజినెస్‌లు కూడా ఉన్నాయి.

సచిన్ బన్సాల్ ( ర్యాంకు 34)

ఫ్లిప్‌కార్ట్ కో ఫౌండర్. ఇతని సంపద దాదాపు 1.4 బిలియన్ డాలర్లని అంచనా. 2007లో బిజినెస్ లోకి వచ్చిన బన్సాల్ ఈ కామర్స్ మార్కెట్లో తన సత్తా చాటుకుంటూ వచ్చారు. ఇప్పుడ ఇదే ఇండియాలో టాప్ రీటెయిల్ మార్కెట్ గా ఉంది. ఇందులో 30 మిలియన్ల ప్రొడక్టులు అలాగే 44 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.

బిన్నీ బన్సాల్ ( ర్యాంకు 34)

ఫ్లిప్ కార్ట్ కో ఫౌండర్. ఇతని సంపద దాదాపు 1.4 బిలియన్ డాలర్లని అంచనా. ఫ్లిప్‌కార్ట్‌లో ఇతని పాత్ర చాలా కీలకం.

డస్కిన్ మోస్కవిట్జ్ ( ర్యాంకు 31)

ఫేస్‌బుక్ సీటీఓ. ఇతని సంపద దాదాపు 10 బిలియన్ డాలర్లని అంచనా. ఫేస్‌బుక్ కో ఫౌండర్ అలాగే ఫేస్‌బుక్ మొట్టమొదటి సీటీఓ. అయితే దాన్ని వదిలి 2008లో జస్టిన్ తో కలిసి ఆసన అనే సంస్థను స్థాపించారు. ఇదొక వెబ్ మొబైల్ అప్లికేషన్.

నాధన్ బ్లెచెరిడ్జ్ ( ర్యాంకు 32)

ఎయిర్ బిఎన్‌బి కో ఫౌండర్. ఇతని సంపద దాదాపు 3.6 బిలియన్ డాలర్లని అంచనా. మైక్రోసాప్ట్ లో ప్రొడక్ట్ మేనేజర్ గా పనిచేసిన నాథన్ అక్కడి నుంచి ఎయిర్ బిఎన్‌బి‌కీ కో ఫౌండర్ గా మారారు.ఇప్పుడు సీటీఓగా ఉన్నారు.

జోయ్ గెబ్బియా ( ర్యాంకు 34)

ఎయిర్ బిఎన్‌బి కౌ ఫౌండర్. ఇతని సంపద దాదాపు 3.6 బిలియన్ డాలర్లని అంచనా. ఇప్పుడు కంపెనీకి చీప్ ప్రొడ్యూసర్ ఆఫీసర్‌గా ఉన్నారు.

ఈవెన్ స్పైజెల్ ( ర్యాంకు 25)

స్నాప్ చాట్ సీఈఓ. ఇతని సంపద దాదాపు 1.8 బిలియన్ డాలర్లని అంచనా. ఫోటో షేరింగ్ యాప్ లాంచింగ్ తో ప్రపంచంలోనే అత్యంత తక్కువ వయసులో బిలియనీర్ గా కీర్తి గడించారు.

బాబీ ముర్పీ ( ర్యాంకు 26)

స్నాప్ చాట్ సీటీఓ. ఇతని సంపద దాదాపు 1.8 బిలియన్ డాలర్లని అంచనా. ప్రపంచంలోనే అత్యంత తక్కువ వయసులో బిలియనీర్ అయినవ్యక్తి.

చాంగ్ వుయ్ ( ర్యాంకు 32 )

డిడి కుయాడి సీఈఓ. ఇతని సంపద దాదాపు 1.0 బిలియన్ డాలర్లని అంచనా.ఆలోబాబాలో 8 సంవత్సరాలు పనిచేసిన తరువాత సొంతంగా ఈ సంస్థను ప్రారంభించారు.

జాన్ కొల్లీసన్ ( ర్యాంకు 26 )

స్ట్రిప్ కో ఫౌండర్.ఇదొక ఆన్ లైన్ పేమంట్ కంపెనీ. ఇతని సంపద దాదాపు 1 బిలియన్ డాలర్లని అంచనా. 2011లో అతని బ్రదర్ తో కలిసి ప్రారంభించారు.

పాట్రిక్ కొల్లీసన్ ( ర్యాంకు 27 )

స్ట్రిప్ కో ఫౌండర్.ఇదొక ఆన్ లైన్ పేమంట్ కంపెనీ. ఇతని సంపద దాదాపు 1 బిలియన్ డాలర్లని అంచనా. 2011లో అతని బ్రదర్ తో కలిసి ప్రారంభించారు.

ఎలిజెబెత్ ( ర్యాంకు 31)

ధెర్నోస్ కో ఫౌండర్. ఈమె సంపద దాదాపు 4.3 బిలియన్ డాలర్లని అంచనా.ఇదొక హెల్త్ కేర్ టెక్నాలజీ.ఇప్పుడు అమెరికాలో అత్యంత పిన్న వయస్కుల్లో బిలియనీర్ అయిన స్త్రీలలో ఈమో ఒకరు.

స్కాట్ ( ర్యాంకు 35)

అట్లాసియన్ కో ఫౌండర్. ఇతని సంపద దాదాపు 1.9 బిలియన్ డాలర్లని అంచనా.ఇదొక సాఫ్ట్ వేర్ కంపెనీ. 2002లో ప్రారంభించారు. 2015లో ఐపీఓలోకి వెళ్లింది. అమెరికాలో అయిదవ ఐపీఓగా కంపెనీ నిలిచింది.

మైఖ్ కెనాన్ ( ర్యాంకు 35)

అట్లాసియన్ సీఈఓ. ఇతని సంపద దాదాపు 1.9 బిలియన్ డాలర్లని అంచనా.15 సాఫ్ట్ వేర్ ప్రొడక్ట్ లను సర్వ్ చేస్తున్నారు. నాసా, ట్విట్టర్,టెస్లా ఇంకా అనేక కంపెనీలకు క్లయింట్ లుగా వ్యవహరిస్తున్నారు.

ఫ్రాంక్ వాంగ్ ( ర్యాంకు 35)

డజాంగ్ ఇన్నోవేషన్ టెక్నాలజీ ఫౌండర్. ఇతని సంపద దాదాపు 3.4 బిలియన్ డాలర్లని అంచనా.2006లో ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద డ్రోన్ల కంపెనీ గా నిలిచింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write World's 16 youngest self-made tech billionaires
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot