ఆ రహస్యాలకు అంత కిక్ ఉందా..?

|

యాపిల్ నుంచి అమెజాన్ వరకు మైక్రోసాఫ్ట్ నుంచి ట్విట్టర్ వరకు టెక్నాలజీ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపునే సొంతం చేసుకున్న కంపెనీలే. సామ్‌సంగ్‌కు ఆ పేరు ఏలా వచ్చింది...?, నోకియా పేరును ఆ నది నుంచి తీసుకున్నానరా..? యాపిల్ పేరును ఎవరు సూచించారు..? ట్విట్టర్ అనే పదం ఎక్కడ దొరికింది..?, ఈబే డాట్ కామ్‌ను తొలినాళల్లో ఏలా పిలిచేవారు..? ఇలా అనేక రకాల సందేహాలు పలువురిలో మెదులుతుంటాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రముఖ బ్రాండ్‌ల పేర్లకు సంబంధించిన రహస్యాలను మీతో పంచుకుంటున్నాం..

 

వాటి వెనక రహస్యాలు

వాటి వెనక రహస్యాలు

ట్విట్టర్ అనే పదాన్ని నిఘంటువు ఆధారంగా పరిశీలించడం జరిగింది.

వాటి వెనక రహస్యాలు

వాటి వెనక రహస్యాలు

ఈబే డాట్ కామ్ పూర్తి పేరు ‘ఎకో బే టెక్నాలజీ గ్రూప్'. పలికేందుకు ఇబ్బందికరంగా ఉండటంతో ఈబేగా మార్చేసారు.

వాటి వెనక రహస్యాలు

వాటి వెనక రహస్యాలు

వికీపిడియా (Wikipedia): హవాయి భాషలో వికీ అనే పదానికి ‘క్విక్' అని అర్ధం.

వాటి వెనక రహస్యాలు
 

వాటి వెనక రహస్యాలు

అతిపెద్ద నదుల్లో ఒకటైన అమెజాన్‌ను ఆధారంగా చేసుకుని తమ రిటైల్ సంస్థకు ఆమోజాన్‌గా పేరును ఖారరు చేసుకున్నారు. పేరుకు తగ్గట్టుగానే ఆమోజాన్ ఆన్‌‌లైన్ రిటైలింగ్ వ్యాపారం ప్రపంచ దేశాలకు విస్తరించింది.

వాటి వెనక రహస్యాలు

వాటి వెనక రహస్యాలు

ఈ సామాజిక సంబంధల వారధికి గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్'గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు. సదరు విశ్వవిద్యాలయంలోని అమ్మాయిలు, అబ్బాయిల ఫోటోలను వారికి తెలియకుండా వారి వారి ప్రొఫైల్స్ నుంచి సేకరించి తన లోకల్ నెట్‌వర్క్‌లో పొందుపరిచాడు. ఈ చర్య మార్క్‌ను నేరారోపణలు ఎదుర్కొనేలా చేసింది. ఈ వివాదం ముగిసిన అనంతరం 2004, ఫిబ్రవరి 4వ తేదిన ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘ద ఫేస్‌బుక్ డాట్ కామ్'గా రూపాంతరం చెందింది.

వాటి వెనక రహస్యాలు

వాటి వెనక రహస్యాలు

ప్రపంచ ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్‌లలో ఒకటైన గూగుల్ కోట్ల కొలది వెబ్ పేజీలను తమ వినియోగదారులకు అందబాటులో ఉంచి.అంశం ఏదైనా సరే, గూగుల్ నుంచి చిటికెలో సమాధానాన్ని రాబట్టవచ్చు. గూగుల్ అనే పేరు గూగోల్ అనే పదం నుంచి వచ్చింది. ఒకటి పక్కన వంద సున్నాల గల సంఖ్యే ఈ ‘గూగోల్'. గూగుల్ సామర్థ్యాన్ని చాటి చెప్పేలా ఈ పేరును ఏర్పాటు చేసి ఉంటారన్నది నిపుణులు విశ్లేషణ.

వాటి వెనక రహస్యాలు

వాటి వెనక రహస్యాలు

ఈ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరును మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన పాల్ అలెన్ సూచించారు. మైక్రోప్రాసెసర్, సాఫ్ట్‌వేర్ అనే రెండు పదాల సంశ్లేషణ ఆధారంగా మైక్రోసాఫ్ట్ రూపాంతరం చెందింది. వాస్తవానికి మైక్రోసాఫ్ట్ పేరు మొదట్లో మైక్రో-సాఫ్ట్‌గా ఉండేది. కాల క్రమంలో పదాల మధ్య హైఫన్ తొలగించారు.

వాటి వెనక రహస్యాలు

వాటి వెనక రహస్యాలు

కొరియన్ భాషలో సామ్ అంటే ‘త్రీ', సంగ్ అంటే ‘స్టార్స్' అని అర్ధం.

వాటి వెనక రహస్యాలు

వాటి వెనక రహస్యాలు

తొలినాళ్లలో నోకియాకు సంబంధించిన ఓ కంపెనీ నోకియన్‌విర్టా అనే నది ఒడ్డున ఉండేదట. ఆ నది ఆధారంగానే ‘నోకియా' అనే పేరు తమ పరిశీలనలోకి వచ్చిందట.

వాటి వెనక రహస్యాలు

వాటి వెనక రహస్యాలు

ఐఫోన్‌ల తయారీ కంపెనీ యాపిల్ మనందరికి సుపరిచితమే. యాపిల్ అనే పేరును కంపెనీ సహ వ్యవస్థాపకులైనే స్టీవ్ జాబ్స్ సూచించినట్లు యాపిల్ కంపెనీ మరో సహ వ్యవస్థాపకులు ఒకరైన స్టీవ్ వోజ్నైక్ ఓ సందర్భంలో వెల్లడించారు. స్టీవ్ జాబ్స్‌కు చిన్నతనం నుంచి యాపిల్ పండ్ల అంటే చాలా ఇష్టం. చివరకు ఆయన తన సంస్థకు కూడా ‘యాపిల్' అనే నామకరణం చేసేశాడు.

వాటి వెనక రహస్యాలు

వాటి వెనక రహస్యాలు

2001లో రిసెర్చ్ ఇన్ మోషన్ (రిమ్) తమ కొత్త ఈమెయిల్ మెసేజింగ్ డివైస్‌కు పేరును సూచించవల్సినదిగా ఓ కన్సల్టింగ్ కంపెనీని కోరింది. సదరు బ్రాండింగ్ ఏజెన్సీ సూచించిన పేరే బ్లాక్‌బెర్రీ. దీంతో, 2013లో రిమ్ తన 2013లో రిమ్ తన కార్పొరేట్ బ్రాండ్ పేరును బ్లాక్‌బెర్రీగా మార్చేసుకుంది.

Best Mobiles in India

English summary
17 Secret Messages Hidden in Tech Logos. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X