ఫేస్‌బుక్ ప్రేమ కోసం కన్నతల్లినే కడతేర్చిన కూతురు
ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియని వారిని ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ప్రేమించడం కామన్ అయిపోయింది.ఆ ప్రేమ కోసం ఇంట్లోవాళ్లను ఎదురించడం లేకపోతే వారిని బెదిరించడం కూడా ఇప్పుడు కామన్ గా నడుస్తున్న ట్రెండే.
ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియని వారిని ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ప్రేమించడం కామన్ అయిపోయింది.ఆ ప్రేమ కోసం ఇంట్లోవాళ్లను ఎదురించడం లేకపోతే వారిని బెదిరించడం కూడా ఇప్పుడు కామన్ గా నడుస్తున్న ట్రెండే.ఎదురించడం లేదా బెదిరించడం వరకు ఓకే కానీ వారి ప్రేమ కోసం కన్నా తల్లితండ్రులనే చంపేస్తున్నారు.ఇలాంటి ఘటనే ఒకటి 3రోజుల క్రితం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.వారి ప్రేమకు అడ్డుగా ఉందని కన్నా తల్లినే చంపేసింది ఓ కసాయి కూతురు. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే...

తమినాడులోని తిరువళ్లూరు జిల్లా....
తమినాడులోని తిరువళ్లూరు జిల్లా కాకలూరు ఆంజనేయపురం 8వ వార్డుకు చెందిన తిరుముగన్‌నాథన్ (65), భానుమతి దంపతులకు చాముండేశ్వరి (24), దేవీప్రియ (19) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దేవీప్రియ పట్టాభిరామ్ సమీపంలోని ప్రైవేటు కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది.ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన సురేష్‌తో ప్రేమలో పడింది.

దేవీప్రియ తను సురేష్ ని ప్రేమిస్తున్నట్టు....
దేవీప్రియ తను సురేష్ ని ప్రేమిస్తున్నట్టు తల్లికి చెప్పగా ఇలాంటి ఫేస్‌బుక్ ప్రేమలను నమ్మకూడదని ముందు చదువు మీద శ్రద్ధ వహించమని తన తల్లి మందలించింది.

ఫేస్‌బుక్ లో చాట్ చేసేది...
తన తల్లి మందలించిన పట్టించుకోకుండా సురేష్ తో దేవీప్రియ రోజు ఫేస్‌బుక్ లో చాట్ చేసేది.ఈ తతంగమంతా చూసిన తల్లి దేవీప్రియ వద్ద ఉన్న ఫోన్ లాక్కుంది.తల్లి తనకి బాగా అడ్డుగా ఉంది అని భావించిన దేవీప్రియ ఎలాగైనా సరే తన తల్లిని చంపి సురేష్ తో పారిపోవడానికి స్కెచ్ వేసింది. దీని కోసమై సురేశ్ ద్వారా ఇద్దరు మైనర్ కుర్రాళ్లను పిలిపించుకుని తల్లిని హత్య చేయించింది.

భానుమతి పెద్దగా కేకలు పెట్టడంతో....
భానుమతి పెద్దగా కేకలు పెట్టడంతో చుట్టూ పక్కల వాళ్ళు ఆ ఇద్దరి మైనర్ కుర్రాళ్లను వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న దేవీప్రియను కూడా పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. విచారణలో దేవీప్రియ పొంతన లేని సమాచారాన్ని ఇవ్వడంతో పోలీసులు ఖంగుతిన్నారు. చాటింగ్ వివరాలకు, దేవీప్రియ ఇస్తున్న సమాచారానికి పొంతన లేకపోవడంతో పోలీసుల విచారణకు ప్రధాన అడ్డంకిగా మారింది. మొదట వివేక్‌ను ప్రేమిస్తున్నట్టు చెప్పింది.పోలీసులు వివేక్ ను విచారించి, అతనికి కేసుతో సంబంధం లేదని తేల్చారు. తర్వాత దేవీప్రియను మళ్లీ ప్రశ్నించగా నిజం బయటపెట్టింది.తన తల్లిని చంపడానికి సురేశ్ ఇద్దరు మైనర్లను పంపాడని, వారు తమ ఇంటికొచ్చి కొడవళ్లతో తన తల్లిని చంపారని వెల్లడించింది.

అసలు ప్రేమికుడు సురేష్....
అసలు ప్రేమికుడు శ్రీసిటీ ఉద్యోగి. రెడ్‌హిల్స్ ప్రాంతానికి చెందిన సురేష్ గతంలో ఆవడిలో పని చేసేవాడు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటిలోని నిప్పాన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. దేవీప్రియ అతణ్నే పెళ్లి చేసుకోవాలనకుని ఇంట్లోంచి నగలు, డబ్బులతో పారిపోతుండగా తల్లి అడ్డుపడింది. దీంతో సురేశ్ ద్వారా ఇద్దరు కుర్రాళ్లను పిలిపించుకుని తల్లిని హత్య చేయించింది. అసలు ప్రేమికుడు సురేష్ కావడంతో మంగళవారం వేకువజామున శ్రీసిటీకి వెళ్లిన పోలీసులు అక్కడ అతన్ని అరెస్టు చేసి విచారణ నిమిత్తం తిరువళ్లూరుకు తీసుకెళ్లారు.


Click it and Unblock the Notifications








