ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలికులేషన్ అవార్డును గెల్చుకున్న హైదరాబాద్ యువకుడు
హైదరాబాదుకు చెందిన ఇరవై ఏళ్ల నీలకాంత భాను ప్రకాష్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా అవతరించాడు. ఈ వారం లండన్‌లో జరిగిన మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌లో మెంటల్ క్యాలికులేషన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇండియా తరపున పోటీలో పాల్గొన్న భాను ప్రకాష్ స్వర్ణం సాధించాడు. అత్యంత గౌరవనీయమైన ఈ టైటిల్ ను గెలుచుకున్న మొదటి భారతీయుడు కూడా ఇతడే కావడం మరొక ప్రశంసనీయమైన విషయం.

మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్
మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో దాదాపుగా UK, జర్మనీ, UAE, ఫ్రాన్స్, గ్రీస్ మరియు లెబనాన్ వంటి ఇతర 13 దేశాల నుండి దాదాపుగా 30 మంది పాల్గొన్నారు. ఈ పోటీలో మొదటిసారిగా పాల్గొన్న భాను ప్రకాష్ తన మొదటి ప్రయత్నంలోనే అగ్రస్థానానికి చేరుకొని టైటిల్ ను గెల్చుకున్నాడు.

అంతర్జాతీయ అబాకస్ ఛాంపియన్ టైటిల్స్
హైదరాబాదుకు చెందిన భాను ప్రకాష్ తన ఐదు సంవత్సరాల వయస్సు నుండే మాథ్స్ మీద మక్కువను పెంచుకున్నాడు. అప్పటి నుంచి మాథమెటికల్ విజ్ పిల్లవాడిగా తన పరాక్రమాన్ని చూపిస్తూ వస్తున్నాడు. ఇతను SIP అబాకస్ ప్రోగ్రామ్ కోసం తనను తాను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ వస్తున్నాడు. అతను SIP అకాడమీ అందించే అబాకస్, గ్రాండ్ మాస్టర్ ప్రోగ్రాం యొక్క తొమ్మిది స్థాయిలను ఇప్పటికే పూర్తి చేశాడు. అతను అంతర్జాతీయ అబాకస్ ఛాంపియన్ '13 మరియు అంతర్జాతీయ అబాకస్ ఛాంపియన్ '11 & '12 టైటిల్ లను కూడా గెలుచుకున్నాడు. అతని ప్రపంచ రికార్డులలో మరి కొన్ని కూడా ఉన్నాయి. ఇందులో "వేగవంతమైన హ్యూమన్ క్యాలికులేషన్", "పవర్ మల్టిప్లికేషన్ రికార్డ్" మరియు "ది సూపర్ సబ్ట్రాక్షన్ రికార్డ్" వంటివి ఉన్నాయి.

శకుంతల దేవి బయోపిక్
రికార్డులు వస్తాయి, పోతాయి కానీ నగదు బహుమతి కంటే గుర్తింపు అనేది చాలా ముఖ్యమైనది. గ్లోబల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో నన్ను చేర్చుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది అని భాను ప్రకాష్ తెలిపారు. భారతదేశం యొక్క మొదటి గణిత మేధావి అయిన శకుంతల దేవి యొక్క బయోపిక్ OTT ప్లాట్‌ఫామ్‌లలో వస్తున్న ఈ సమయంలో ఈ ఘనత యాదృచ్చికంగా రావడం మరింత సంతోషంగా ఉంది అని తెలిపారు.

ఎక్స్‌ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ (EI)
భాను ప్రకాష్ స్టార్ట్-అప్ ఎక్స్‌ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ (EI) ను కలిగి ఉన్నాడు. ఇది తెలంగాణ ప్రభుత్వంతో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో కలిసి పనిచేస్తోంది. మొబైల్ యాప్ లలో గ్యామిఫైడ్ లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా మానవ మెదడు యొక్క అనంతమైన శక్తిని ఉపయోగించడం ద్వారా EI వివిధ విద్యా సంస్థలకు చేరుకుంది. వేగం మరియు విజ్ఞానం సామర్థ్యం అభివృద్ధిలో EI ఇన్స్టిట్యూట్ శిక్షణ ఇస్తుంది.


Click it and Unblock the Notifications








