Home
News

సెల్ఫీలతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన ప్రబుద్దుడు

సోషల్ నెట్‌వర్క్‌లలో ప్రతిరోజూ చాలా విషయాలు ప్రసారం అవుతూవుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే తొందరగా వైరల్ అవుతాయి. ప్రతి విషయం ఎందుకు వైరల్ అవుతుందో కూడా చెప్పడం చాలా కష్టం.

 నోహ్ కలీనా

మనం ఊహించని చిన్న చిన్న సంఘటనలు మరియు విషయాలు కూడా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతాయి. అటువంటి జాబితాలో న్యూయార్క్‌కు చెందిన నోహ్ కలీనా అనే ఫోటోగ్రాఫర్ తన సెల్ఫీల ద్వారా చాలా బాగా పాపులర్ అయ్యాడు.

 

 

నోహ్ కలీనా

సెల్ఫీల ద్వారా పాపులర్ అవ్వడం కాస్త అనుమానంగా ఉంది కదు! కానీ ఇది నిజం న్యూయార్క్‌లో జన్మించిన ఫోటోగ్రాఫర్ నోహ్ కలీనా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. నోహ్ కలీనా ఇంత పాపులర్ అవ్వడానికి కారణం అతని సెల్ఫీలే. అతను దాదాపు 20 సంవత్సరాలుగా ప్రతి రోజు తన సెల్ఫీలను క్లిక్ చేస్తూ వస్తున్నాడు అదే అతనిని పాపులర్ చేసింది.

 

 

అతను 19 సంవత్సరాల వయస్సు నుండి అంటే 2000 జనవరి 11 నుండి ప్రతిరోజూ ఒక సెల్ఫీని తీస్తున్నాడు. అతను తీసుకున్న ప్రతి సెల్ఫీలను అన్ని కలిపి ఒక వీడియోగా తయారు చేసాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతున్నది. ఆ వీడియోను చూడడానికి కింద ఉన్న లింక్ ను ఓపెన్ చేయండి.

సెల్ఫీ వీడియో

గతంలో కలీనా విడుదల చేసిన తన సెల్ఫీ వీడియో చాలా బాగా వైరల్ అయ్యింది. 2006 లో విడుదల చేసిన అతని మొట్టమొదటి వీడియో "ఎవరీ డే 20 ఇయర్స్" సుమారు 26 మిలియన్ల వీక్షణలను సంపాదించింది. 2012 లో విడుదల చేసిన రెండవ వీడియో ప్రస్తుతం 6 మిలియన్లకు పైగా వీక్షణలను కలిగి ఉంది.

 

 

ఎవరీడే ప్రాజెక్ట్

సింప్సన్స్ మరియు మరికొన్ని పెద్ద కంపెనీలు నోహ్ కలీనా ఎవరీడే ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపాయి. 2012 లో అతను తన ప్రాజెక్ట్ యొక్క పూర్తి సమాచారాన్ని వారితో పంచుకున్నాడు. దానితో అతను బాగా పాపులర్ అయ్యాడు. అతను ప్రతి రోజు విభిన్న నేపథ్య ఫోటోలను తీసుకునేవాడు. 20 సంవత్సరాలుగా ఫోటో తీస్తున్న నోహ్ కలీనా ఇప్పుడు సెల్ఫీ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందాడు. అతను తన చివరి శ్వాస వచ్చేవరకు సెల్ఫీ ఫోటోను క్లిక్ చేయడం ఆపనని తెలిపారు.

 

 

ప్రాజెక్ట్

అతని ప్రాజెక్ట్ మొదట వైరల్ అయినప్పుడు చాలా మంది వారి వయస్సును ఫోటోలలో తెలపడానికి ప్రేరేపించింది. కొంతమంది చిన్న పిల్లల ఫోటోలను క్లిక్ చేయడం ప్రారంభించారు. ఈ ప్రక్రియలో వారు తీసుకున్న ఫోటోల నేపథ్యంలో బాల్యం నుండి వృద్ధాప్యం వరకు వచ్చిన మార్పులను గుర్తుచేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
20 years Selfies prank Has Made Him Popular on Social Media
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X