హైదరాబాద్‌లో 200 ఉచిత వైఫై సెంటర్లు!

Posted By:

హైదరాబాద్‌లో 200 ఉచిత వైఫై సెంటర్లు!

భాగ్యనగర వాసులకు శుభవార్త.. గత కొంత కాలం కాలంగా ఉచిత వై-ఫై కోసం ఎదురుచూస్తోన్న హైదరాబాద్ వాసులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఉచిత వై-ఫై సర్వీసును అందించబోతోంది. నగరంలో ఉచిత వై-ఫై సేవలను మరింత ఉదృతం చేసే క్రమంలో 200 స్పాట్‌లను జీహెచ్ఎంసీ ఎంపిక చేసుకుంది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ కమీషనర్ 10 కోట్లు నిధులను విడుదల చేసారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో తొలత మూడు గంటల పాటు ఉచిత వై-ఫై సేవలను అందించనున్నారు.

హైదరాబాద్‌లో 200 ఉచిత వైఫై సెంటర్లు!

జీహెచ్‌ఎంసీ ప్రకటించే మెయిల్ లేదా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించినవారికి పాస్‌వర్డ్ తెలియజేస్తారు. వైపై సెంటర్ల వద్ద ఆ పాస్ వర్డ్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు తన స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనిపై త్వరలోనే పూర్తి సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు. వైపై సేవలను అందించేందుకు ఇందిరా పార్కు, కేబీఆర్ పార్కు, సంజీవయ్య పార్కు లాంటి వాటితో పాటు నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలను కూడా ఎంపిక చేస్తున్నారు.

English summary
200 free WiFi centers in Hyderabad!. Read more in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot