దేశంలో 200 Mbps వేగంతో ISPలు అందించే బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇవే...

|

ఇండియాలో కరోనా రావడంతో ప్రతి ఒక్కరు ఇంటి వద్ద ఉండి పనిచేయడంతో ఇంటర్నెట్ అవసరం భారీగా పెరిగింది. ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడానికి దేశంలో అనేక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPలు) ఉన్నారు. అన్ని రకాల ISPలు ఒకేరకమైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను విభిన్న ప్రయోజనాలతో అందించవచ్చు. ఉదాహరణకు 200 Mbps వేగంతో లభించే ప్లాన్‌ల విషయంలో కూడా ISPలు వివిధరకాల ప్రయోజనాలతో రావడంతో వినియోగదారులు దేనిని ఎంచుకోవాలి అనే విషయంలో సందిగ్ధంలో పడుతున్నారు. 200 Mbps స్పీడ్ ప్లాన్‌లతో కొంతమంది సర్వీస్ ప్రొవైడర్లు OTT ప్రయోజనాలను అందిస్తున్నారు. అయితే మరికొందరు తమ ప్యాక్‌లను చాలా తక్కువ ధరకు అందిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని అత్యుత్తమ 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Airtel ఎక్స్‌స్ట్రీమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్

Airtel ఎక్స్‌స్ట్రీమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్

ఇండియాలోని బ్రాడ్‌బ్యాండ్ విభాగంలోని సేవల విషయానికి వస్తే మార్కెట్లో ఎయిర్‌టెల్ బెస్ట్ ఆఫర్లను అందిస్తున్న ప్రముఖమైన ఆటగాళ్లలో ఒకటిగా ఉంది. ఎయిర్‌టెల్ తన ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ కనెక్షన్ ద్వారా కొన్ని ఉచిత OTT యాక్సెస్‌లతో కొన్ని ప్లాన్‌లను అందిస్తుంది. వీటిలో ముఖ్యమైనది 'ఎంటర్‌టైన్‌మెంట్' ప్యాక్ 200 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌తో నెలకు రూ.999 ధర వద్ద అందిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 3.3TB లేదా 3300GB నెలవారీ ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) డేటాను పొందుతారు. ఎయిర్‌టెల్ తన ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో 'ఎయిర్‌టెల్ థాంక్స్ బెనిఫిట్స్'ని కూడా అందిస్తుంది. ఈ సందర్భంలో వింక్ మ్యూజిక్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ యొక్క బెస్ట్ సెల్లింగ్ ప్లాన్‌లలో ఇది కూడా ఒకటి.

BSNL 200 Mbps ప్లాన్
 

BSNL 200 Mbps ప్లాన్

ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL సంస్థ దాని భారత్ ఫైబర్ కనెక్షన్ ద్వారా హై-స్పీడ్ కనెక్టివిటీతో ఫైబర్ ప్రీమియం ప్లస్‌ ప్లాన్‌ను అందిస్తుంది. BSNL యొక్క ఈ ఫైబర్ ప్రీమియం ప్లస్ ప్యాక్ నెలకు రూ.1,277 ధరతో లభిస్తుంది. ఇది 200 Mbps వేగంతో 3300GB డేటాను అందిస్తుంది. దీని తరువాత డేటా స్పీడ్ ని 15 Mbpsకి తగ్గించబడుతుంది. అయితే BSNL టెల్కో నుండి లభించే ఈ సూపర్‌స్టార్ ప్రీమియం ప్లస్ ప్యాక్ ఎటువంటి OTT సభ్యత్వాలను అందించదు. అయినప్పటికీ వినియోగదారులు వారి మొదటి నెల అద్దెపై 90% వరకు అంటే రూ.500 వరకు తగ్గింపును పొందవచ్చు.

Excitel ప్రీమియం ప్లాన్

Excitel ప్రీమియం ప్లాన్

Excitel సంస్థ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో వినియోగదారులకు 100 Mbps, 200 Mbps మరియు 300 Mbps ఇంటర్నెట్ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ప్లాన్‌లను అందిస్తుంది. కంపెనీ నుండి 200 Mbps వేగంతో లభించే ప్లాన్ సహేతుకమైన ప్లాన్‌లలో ఒకటి. Excitel యొక్క 200 Mbps ప్లాన్ వివిధ చెల్లుబాటులతో వేర్వేరు ధర ట్యాగ్‌లతో వస్తుంది. అందులో భాగంగా దీనిని వినియోగదారులు ఒక నెల వాలిడిటీ కాలానికి రూ.799 ధరతో 200 Mbps ప్లాన్‌ని అందిస్తోంది. అలాగే వినియోగదారులు 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, 9 నెలలు మరియు 12 నెలల చెల్లుబాటు కాలానికి ఎంచుకునే వారు నెలకు వరుసగా రూ.732, రూ.572, రూ.545, రూ.471 మరియు రూ.449 ధరల వద్ద పొందవచ్చు. Excitel యొక్క అన్ని ప్లాన్‌లు FUP డేటా పరిమితి కాకుండా అపరిమిత డేటాను అందిస్తాయి.

Best Mobiles in India

English summary
200 Mbps Speed Best Broadband Plans Available in India 2022! Which One is Best

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X